బరువు తగ్గాలని కీటో డైట్‌ ఫాలో అవుతున్నారా..? అయితే ఈ విషయాలు మీ కోసమే

Over weight తగ్గించుకోవాలంటే.. ఈరోజుల్లో చాలామంది వివిధ రకాల డైట్స్‌ను ఫాలో అవుతున్నారు. అలాంటి వాటిల్లో బాగా వినిపించే పేరు keto diet.. ఇందులో భాగంగా నిర్దిష్ట‌మైన మోతాదులో ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

బరువు తగ్గాలని కీటో డైట్‌ ఫాలో అవుతున్నారా..? అయితే ఈ విషయాలు మీ కోసమే
keto diet to lose weight


Over weight తగ్గించుకోవాలంటే.. ఈరోజుల్లో చాలామంది వివిధ రకాల డైట్స్‌ను ఫాలో అవుతున్నారు. అలాంటి వాటిల్లో బాగా వినిపించే పేరు keto diet.. ఇందులో భాగంగా నిర్దిష్ట‌మైన మోతాదులో ప‌లు ర‌కాల ఆహార ప‌దార్థాల‌ను తీసుకోవాల్సి ఉంటుంది. keto diet ను పాటించాల‌నుకునే వారు ఈ కింద ఇచ్చిన విషయాల‌ను ముందుగా తెలుసుకోండి.. లేకపోతే చాలా ప్రమాదం..!

కీటో డైట్‌లో భాగంగా కొవ్వులు, ప్రోటీన్లు ఉండే ఆహారాల‌ను ఎక్కువ‌గా, కార్బొహైడ్రేట్లు ఉండే ఆహారాల‌ను చాలా త‌క్కువ‌గా తినాల్సి ఉంటుంది. అంటే కార్బొహైడ్రేట్ల‌ను రోజూ 20 నుంచి 30 గ్రాముల మేర మాత్ర‌మే తీసుకోవాలనమాట..కీటో డైట్‌లో కొవ్వు ప‌దార్థాల‌ను ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. ఆరంభంలో కొంత అసౌక‌ర్యంగా ఉంటుంది. కానీ కొవ్వు ప‌దార్థాలు అంటే చికెన్‌, మ‌ట‌న్‌, చేప‌లు మాత్ర‌మే కాదు, న‌ట్స్, ఆలివ్ నూనె, నెయ్యి వంటి కొవ్వు ప‌దార్థాల‌ను కూడా తీసుకోవ‌చ్చు. వాటిని స‌మ‌యానుగుణంగా తీసుకోవాల్సి ఉంటుంది. 
ఈ డైట్‌లో త‌రువాత ప్రోటీన్ల‌ను ఎక్కువ‌గా తీసుకోవాలి. కానీ మోతాదుకు మించ‌రాదు. అధికంగా తీసుకుంటే అది గ్లూకోజ్‌గా మారుతుంది. శ‌రీరానికి అవ‌స‌రం అయిన మేర మాత్ర‌మే ప్రోటీన్ల‌ను తీసుకోవాలి.కొవ్వు ప‌దార్థాల‌ను తినాల‌ని చెప్పి కీటో డైట్‌లో జంక్ ఫుడ్‌, వేపుళ్లు, ప్రాసెస్ చేయ‌బ‌డిన ప‌దార్థాల‌ను అస్సలు తిన‌రాదు. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాల‌నే తినాలి.కీటో డైట్‌లో కాఫీలో కొబ్బ‌రినూనె, వెన్న క‌లిపి తాగితే అస్స‌లు ఆక‌లి తెలియ‌దు. ఈ విష‌యాన్ని త‌ప్ప‌క గుర్తుంచుకోవాలి. కీటో డైట్‌ను 3 నుంచి 6 నెల‌ల పాటు పాటించ‌వ‌చ్చు. అయితే అంత‌కు మించి ఈ డైట్‌ను చేయ‌రాదు. అవ‌స‌ర‌మైన మేర ల‌క్ష్యాన్ని సాధించాం అనుకుంటే ఈ డైట్‌ను మానేయాలి.. అతిగా చేయ‌రాదు. ఫ‌లితం రాక‌పోతే కొన్ని నెల‌ల పాటు ఆగి మ‌ళ్లీ ప్ర‌య‌త్నించాలి. 
కీటో డైట్ చేసే వారికి ఆరంభంలో మ‌ల‌బ‌ద్ద‌కం, విరేచ‌నాలు వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. ఇలా వ‌స్తే మీ శ‌రీరం కీటో డైట్‌కు అల‌వాటు ప‌డుతున్న‌ట్లు అర్థం. ఇలా ఒక వారం వ‌ర‌కు ఉండ‌వ‌చ్చు. ఆ త‌రువాత మామూలుగా అయిపోతారు. కిడ్నీలు ఎల‌క్ట్రోలైట్స్‌ను ఎక్కువ బ‌య‌ట‌కు పంపుతాయి. అందువ‌ల్ల సోడియం పొటాషియం ఉండే కూర‌గాయ‌లు, పండ్ల‌ను తీసుకోవాలి.

వీరు వద్దు..

టైప్ 1 డ‌యాబెటిస్ ఉన్న‌వారు, హైబీపీ, గుండె జ‌బ్బుల బారిన ప‌డిన వారు, కిడ్నీ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కీటోడైట్‌ను పాటించ‌కూడదు.. పాటించాల‌నుకుంటే డాక్ట‌ర్‌ను సంప్ర‌దించి స‌ల‌హా తీసుకోవాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.