తట్టు కోసం ఈ పది విషయాలు తెలుసుకోండి.. 

Measles ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. గాలి ద్వారా ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది

తట్టు కోసం ఈ పది విషయాలు తెలుసుకోండి.. 
Know this ten things about Measles


తట్టు లేదా పొంగు అని ఈ వ్యాధి కి డేకా వచ్చి చాలా సంవత్సరాలు అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కేసులు కనిపిస్తూనే వస్తున్నాయి. ఆంగ్ల భాషలో Measles అనే పిలిచే ఈ వ్యాధి సాధారణంగా చిన్నపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. వందల ఏళ్ల క్రితమే ఈ వ్యాధి ఎందరినో బలి తీసుకుంది. మారబిల్లి వైరస్ అనే వైరస్ వల్ల కలిగే ఈ వ్యాధి కేవలం ఒక్క వైరస్ వల్ల కాకుండా 21 రకాల వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది. తట్టును కలిగించే వైరస్లు 21 రకాలు ఉండటం విశేషం. 1963 లోనే ఈ వ్యాధికి నిరోధకను అందుబాటులోకి తెచ్చినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఈ కేసులో కనిపిస్తూనే వస్తున్నాయి. ఈరోజుకి ఈ వ్యాధి పైన సరైన అవగాహన లేక ఎందరో బలైపోతున్నారు కాబట్టి కచ్చితంగా దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సిందే. 

తట్టు ఒక అంటు వ్యాధి. ఈ వ్యాధి ఉన్న వ్యక్తి దగ్గినా, తుమ్మినా ఆ వ్యక్తి లాలాజలం నుంచి వైరస్ గాలిలో కలుస్తుంది. గాలి ద్వారా ఈ వైరస్ చాలా త్వరగా వ్యాప్తి చెందుతుంది ముఖ్యంగా ఈ వ్యాధి ఉన్న వ్యక్తికి దగ్గరగా ఉండటం వల్ల ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.  అలా ఆరోగ్యకరమైన వ్యక్తికి కూడా ఇది వస్తుంది.. అలాగే వ్యాధి ఉన్న వ్యక్తిని నేరుగా పట్టుకున్న రావచ్చు.. సాధారణంగా రెండవ వారంలో బయటపడే ఈ వ్యాధి వచ్చినప్పుడు శరీరంపై చిన్న చిన్న పొక్కులా వస్తాయి. దీన్ని టీకాల ద్వారా మాత్రమే నివారించవచ్చు.  

చిన్న పిల్లలకు ఈ వ్యాధి వచ్చినప్పుడు జలుబు, జ్వరం, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, కళ్ల మంటలు, కళ్లు ఎర్రబడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నోటిలోపల ఇసుక రేణువులాంటి పొక్కులు కనిపిస్తాయి. మూడు మూడు రోజుల కంటే ఎక్కువ రోజులు జ్వరం అనిపిస్తుంది. దీనికి సంబంధించిన అలాంటి లక్షణాలు కనిపించిన వైద్యం ని సంప్రదించి రక్త పరీక్ష చేసుకోవాలి వెంటనే చికిత్స తీసుకోవాలి.. అయితే టీకాలు వేయలేని పిల్లలకు గర్భిణీ స్త్రీలకు ఈ వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది అందుకే ఇలాంటివారు మరింత జాగ్రత్తగా ఉండటం అవసరం.. 

చిన్నపిల్లలు పుట్టగానే మీజిల్స్‌ వ్యాక్సీన్‌తో పాటు రూబెల్లా వ్యాక్సీన్‌ను రెండు డోసులలో ఇస్తారు. 9 నుంచి 12 నెలల వయసులో మొదటి డోసు, 16 నుంచి 24 నెలల వయసులో రెండవ డోసు వ్యాక్సీన్ వేస్తారు. సారి తెకా వేయించుకున్నాక జీవితాంతం ఎలాంటి భయం లేకుండా ఉండవచ్చు..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.