DIABETES : రెండు బెండకాయలతో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచొచ్చు..!
బెండకాయల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బెండకాయల్లో యాంటీ హైపర్ లిపిడెమిక్ గుణాలు కూడా ఉంటాయి. దీని వల్ల మనం తినే ఆహారం నుంచి శరీరం కొలెస్ట్రాల్‌ను శోషించుకోదు. దీంతో రక్తంలో కొవ్వుల స్థాయిలు తగ్గుతాయి.

DIABETES బారినపడిన వాళ్లు.. షుగర్ లెవల్స్ నియంత్రణలో ఉంచుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. ట్యాబ్లెట్స్ వాడినా షుగర్ లెవల్స్ మాత్రం కంట్రోల్లో ఉండటం లేదు. నిజానికి షుగర్‌ను తగ్గించుకోవాడనికి ప్రకృతి మార్గాలే ప్రభావవంతంగా పనిచేస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు తీసుకునే ఆహార పదార్థాలపైనే వారి రక్తంలో చక్కెర స్థాయిలు ఆధారపడి ఉంటాయి. ఇక ఆహారం విషయానికి వస్తే డయాబెటిస్ ఉన్నవారికి బెండకాయలు ఎంతో మేలు చేస్తాయని మీకు తెలుసా..?
బెండకాయల్లో యాంటీ డయాబెటిక్ గుణాలు ఉంటాయి. దీని వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. బెండకాయల్లో యాంటీ హైపర్ లిపిడెమిక్ గుణాలు కూడా ఉంటాయి. దీని వల్ల మనం తినే ఆహారం నుంచి శరీరం కొలెస్ట్రాల్‌ను శోషించుకోదు. దీంతో రక్తంలో కొవ్వుల స్థాయిలు తగ్గుతాయి.
టైప్ 1 డయాబెటిస్ వంశ పారంపర్యంగా వస్తుంది. కానీ టైప్ 2 డయాబెటిస్ అనేది అస్తవ్యస్తమైన జీవన విధానం, రోజులో ఎక్కువ సమయం పాటు కూర్చుని ఉండడం వంటి అనేక కారణాల వల్ల ఇది వస్తుంది. అలాగే చక్కెర, పిండి పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్సులిన్ నిరోధకత ఏర్పడుతుంది. ఇది టైప్ 2 డయాబెటిస్‌కు దారి తీస్తుంది. స్థూలకాయం కూడా వస్తుంది.
అయితే అధిక బరువు పెరిగినా, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నా కూడా రక్తంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయి. దీని వల్ల బీటా కణాల పనితీరు దెబ్బ తింటుంది. ఫలితంగా డయాబెటిస్ వస్తుంది. బెండకాయల్లో ఫైటో కెమికల్స్ అధికంగా ఉంటాయి. పాలీ శాకరైడ్స్, పాలిఫినాల్స్, టానిన్స్, ఫ్లేవనాయిడ్స్, ట్రైటర్పీన్స్, స్టెరాల్స్, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు, లిపిడ్ స్థాయిలు తగ్గుతాయి. బెండకాయలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల బీటా కణాల పనితీరు మెరుగు పడుతుంది. దీంతో ఇన్సులిన్ ఉత్పత్తికి ఆటంకం ఏర్పడదు. ఫలితంగా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి.
బెండకాయలో గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ చాలా తక్కువ. అది 20 మాత్రమే ఉంటుంది.. అంటే వీటిని తింటే రక్తంలో షుగర్ లెవల్స్ చాలా నెమ్మదిగా పెరుగుతాయన్నమాట. అందువల్ల వీటిని డయాబెటిక్ ఫ్రెండ్లీ ఆహారం అని కూడా అంటారు.. డయాబెటిస్ ఉన్నవారు వీటిని తరచూ తీసుకోవాలి.
డయాబెటిస్ వల్ల జరిగే ప్రధాన నష్టం.. కిడ్నీ వ్యాధులు. చక్కెర స్థాయిలు అధికంగా ఉంటాయి. కిడ్నీలు దెబ్బ తింటాయి. కానీ బెండకాయలను తినడం వల్ల ఈ ప్రమాదం తగ్గుతుంది. కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి.
బెండకాయల్లో ఉండే ఫైబర్ కార్బొహైడ్రేట్లను జీర్ణం చేయడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. వీటిల్లో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. ఎక్కువ ఆహారం తీసుకోకుండా ఉంటారు. ఇది అధిక బరువు తగ్గేందుకు, షుగర్ లెవల్స్‌ను తగ్గించేందుకు సహాయ పడుతుంది.
బెండకాయలను ఇలా వాడితేనే ప్రయోజనం..
రెండు బెండకాయలను తీసుకోవాలి. వాటిని పైన, కింద భాగాల్లో కట్ చేయాలి. దీంతో బెండకాయల నుంచి తెల్లని జిగురు వంటి పదార్థం బయటకు వస్తుంది. బెండకాయలను కడగొద్దు...వాటిని అలాగే ఒక గ్లాస్ నీటిలో వేయాలి. రాత్రి పూట ఇలా చేయాలి. గ్లాస్ మీద మూత పెట్టాలి. మరుసటి రోజు ఉదయాన్నే ఆ నీటి నుంచి బెండకాయలను తీసేసి..ఆ నీటిని తాగాలి.
ఇలా రోజూ చేయడంవల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బెండకాయలను వండుకుని తినడం కంటే ఇలా చేయడం వల్లే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుందని నిపుణులు అంటున్నారు.. దీంతోపాటు వాటిల్లో ఉండే పోషకాలు కూడా లభిస్తాయి. అయితే బెండకాయలను నానబెట్టిన నీటిని రోజూ ఇలా తీసుకుంటూనే యథావిధిగా వాటితో కూరలు చేసుకుని కూడా తినవచ్చు. కానీ పచ్చిగా వాటిని అలా వాడితేనే ఎక్కువగా, వేగంగా ఫలితం వస్తుంది.
అయితే మరీ ఎక్కువగా బెండకాయలను ఎక్కువగా తీసుకోరాదు. తీసుకుంటే గ్యాస్ సమస్యలు వస్తాయి. విరేచనాలు అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బెండకాయల్లో ఆగ్జలేట్స్ అధికంగా ఉంటాయి. అందువల్ల కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వీటిని తీసుకోకపోవడమే మంచిది.