LDL చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు,కారణాలు, తగ్గే మార్గాలు?.. LDL పెరిగితే గుండెకు డేంజర్
LDL Cholesterol బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా బాడీలో ఫామ్ అవుతుంది. దీని లక్షణాలు ఏంటి? ఎలా కొవ్వును కరిగించటం, ఏం ఆహారాలు తినకూడదు, ఏం తినాలి..

LDL (low-density lipoprotein) : శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. రక్తపోటు, ఊబకాయం, గుండె పోటు, నడుము నొప్పులు, కీళ్ల నొప్పులు, వెన్నునొప్పులు, కిడ్నీ, మెదడుకు సంబంధించిన సమస్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాన్తాడంత లిస్ట్ ఉంటుంది. బాడీకి గుడ్ కొలెస్ట్రాల్ అవసరం. బ్యాడ్ కొలెస్ట్రాల్ వల్ల అన్నీ సమస్యలు వస్తాయి. అసలు బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎలా బాడీలో ఫామ్ అవుతుంది. దీని లక్షణాలు ఏంటి? ఎలా కొవ్వును కరిగించటం, ఏం ఆహారాలు తినకూడదు, ఏం తినాలి.. ఇవన్నీ చూద్దామా..!
LDL (low-density lipoprotein) లేదా చెడు కొలెస్ట్రాల్..ప్రతి 1 మిల్లీ గ్రాము/డి.ఎల్ ఎల్డిఎల్ పెరిగితే గుండెపోటు పెరిగే ప్రమాదం ఒకశాతం పెరుగుతుంది. ఎల్ డీఎల్ కొలెస్టరాల్ 100 ఎంజీ/డీఎల్ లోపు ఉంటే మంచిది. ఎల్డీఎల్ లో 20% లైపో ప్రొటీన్ ఉంటుంది. అందుకే దీన్ని.. బ్యాడ్ కొలెస్ట్రాల్ అంటారు. ఇందులో ప్రొటీన్ చాలా తక్కువ శాతం ఉంటుంది. మనం ఒక ఎమ్ఎల్ ఆయిల్ తీసుకుంటే.. ఒక గ్రాము వెయిట్ వస్తుంది
LDL కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ పెంచే ఆహారాలు
- స్వీట్
- ప్రాసెస్డ్ ఫుడ్
- ఆయిల్ ఫుడ్స్
- కల్తీ ఆహారం
- శీతలపానియాలు
- వైట్ ప్రొడెక్టట్స్( పంచదార, ఉప్పు, పాలిష్ పట్టిన బియ్యం, పప్పు, రవ్వ)
- జంతు ఉత్పత్తులు, మాంసం, చీజ్ ఎక్కువగా తినడం.
LDL చెడు కొలెస్ట్రాల్ లక్షణాలు
- రక్తం సరఫరాలో ఇబ్బందులు ఏర్పడతాయి.
- ఒకొక్కసారి అధిక రక్తపోటు వస్తుంది.
- శ్వాస తీసుకోవడంలో కూడా ఇబ్బందులు ఏర్పడతాయి.
- ఛాతిలో నొప్పిగా ఉంటుంది.
ఇక ఒకొక్కసారి ఈ చెడు కొలెస్ట్రాల్ అధికమైనప్పుడు చర్మంపై పసుపు లేదా ఎరుపు రంగులో కురుపులు వస్తాయి.
ముఖ్యంగా మోచేతులు, మోకాళ్లు, చేతులు, పాదాలు, ముక్కుపై ఈ కురుపులు వస్తాయి. మొటిమలు అం నిర్లక్ష్యం చేస్తూ.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇలా కురుపులు కనిపించిన వెంటనే శరీరంలోని కొవ్వు గురించి టెస్ట్ చేయించుకోవాలి.
అధిక కొలెస్ట్రాల్ కారణంగా మీ పాదాలు లేదా కాళ్లు ఏడాది పొడవునా, వేసవిలో కూడా చల్లగా అనిపించేలా చేస్తాయి. ఈ సంకేతం PAD వ్యాధిని సూచిస్తుంది.
చెడు కొవ్వు తగ్గడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ఉప్పు తగిన మోతాదులో తీసుకోవాలి. ఎల్డీఎల్ అనే చెడు కొవ్వులు.. డెసీలీటర్‌కు 70 మిల్లీగ్రాములకు మించకూడదు.
మంచి కొలెస్ట్రాల్ డెసిలీటర్కు 40 మిల్లీగ్రాములు ఉండేలా చూసుకోవాలి. ఎత్తుకు తగ్గ బరువు ఉండేలా చూసుకోవాలి. ఊబకాయం బారిన పడకుండా జాగ్రత్తపడాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
తిండిని అదుపులో ఉంచుకోవాలి.
చెడు కొలెస్ట్రాల్ గుండెకు ఎలా హాని చేస్తుంది
ఒక వ్యక్తి గుండె ఆరోగ్యం అనేది కొలెస్ట్రాల్ మీద ఆధారపడి ఉంటుంది. బాడీలో గుడ్ ఫ్యాట్ ఉంటే.. గుండె ఆరోగ్యంగా ఉన్నట్లు.. చెడు కొలెస్ట్రాల్ ఉంటే గుండె ప్రమాదంలో పడినట్లే.. గుండెకు రక్తాన్ని తీసుకెళ్లె ధమనులల్లో కొవ్వు పేరుకుపోతే రక్తం సరఫరా సరిగ్గా అవదు. రక్తం సరఫరా కాకుంటే..పంపింగ్ మీద ఎఫెక్ట్ అవుతుంది. గుండె పంప్ చేసిన రక్తమే బాడీ అంతా సర్కూలేట్ అవుతుంది. సో ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల మొత్తం సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుందనమాట.! ఈ పరిస్థితుల్లో మీరు పీచు పదార్థాలు తినడం వల్ల ఇంట్లో చెత్తను చీపురుతో క్లీన్ చేసినట్లు..బాడీలో ఈ బ్యాడ్ ఫ్యాట్‌ను పీచు పదార్థాలు క్లీన్ చేస్తాయి. హెచ్‌డీఎల్ (మంచి) కొలెస్ట్రాల్ శరీరంలో ఎంత ఎక్కువ ఉంటే.. అది ఈ చెడు కొలెస్ట్రాల్‌ను అంత బాగా తొలగిస్తుంది.
ఆహారం - ఆరోగ్యం
- అల్లం వెల్లుల్లి మిశ్రమాన్ని ప్రతిరోజు వంటల్లో ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించుకోవచ్చు.
- గ్రీన్ టీ రోజు తాగడం వల్ల కూడా చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు హెచ్‌డీఎల్ స్థాయిని కూడా పెంచుకునే వీలుంది.
- దనియాలు.. ఈ గింజల్లో ఫోలిక్ యాసిడ్, విటమిన్ ఏ, బీటా కెరోటిన్, విటమిన్ సి వంటివి ఉండటం వల్ల కొలెస్ట్రాల్ ప్రభావం తగ్గుతుంది. వీటిని రోజు నేరుగా తినడం అలవాటు చేసుకుంటే మరీ మంచిది.
- మెంతులు కూడా కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నానపెట్టుకుని తినటం మంచిది.
- ఉసిరికాయను లేదా ఉసిరి పొడిని వాడుకోవడం మేలు.
- మాంసాహారం మితంగా తీసుకోవాలి.
- శాకాహారంలో వేపుడు కూరలు తినరాదు.
- ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది.
- కొబ్బరి, వేరుశనగలు, నువ్వులు వంటివి తీసుకోవడం వల్ల వీటిలో ఫైబర్‌తోపాటు ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది.
- వరి, గోధుమ బదులు తృణ ధాన్యాలు, సిరి ధాన్యాలు తింటే కూడా చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గుతుంది.
- పళ్ళు, పచ్చికూరలు తురుముకొని పెరుగులో వేసుకుని తినండి. కీర దోస, కారట్, బీట్రూట్, దోసకాయలు, బూడిద గుమ్మడి, సొరకాయ వంటివి తురుముకొని లేదా మిక్సర్‌లో వేసి పెరుగులో కలిపి తీసుకుంటే చాలా మంచిది.
- పాలకు బదులు పెరుగు, మజ్జిగ తీసుకోండి. పంచదార పూర్తిగా మానేసి తాటిబెల్లం, బెల్లం లేదా తేనె కొంచెం కొంచెం తీసుకోండి.
- ప్రతిరోజూ ఉదయం మొలకలు, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం సలాడ్, పండ్లు తీసుకోవాలి. ఉదయం రెండు కిలోమీటర్ల నడక, ప్రాణాయామం చేయండి.
మనకు అన్నీ తెలుసు.. ఏం తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందో, ఏం తింటే కొలెస్ట్రాల్ తగ్గుతుందో అన్నీ తెలుసు. కానీ సమస్య ఏంట్రా అంటే.. అంటే.. తెలిసి కూడా ఫాలో కాకపోవడమే..! కొలెస్ట్రాల్‌లో LDL, HDL, ట్రైగ్లిజరైడ్స్ అంటే ఏంటి..? ఏది మంచిది..? ప్రమాదం ఎలా జరుగుతుంది, ఏవి శత్రువుల్లా ఎటాక్ చేస్తాయో క్లియర్‌గా చెప్తే కనీసం అప్పుడై హానికరమైన వాటిని మానేయకున్నా..తగ్గించి మంచివి తినటం ప్రారంభిస్తారు కదా..!