మండిపోతున్న ఎండల్లో మామిడికాయలతో షర్బత్.. పోషకాలతో పాటు ఫుల్ టేస్టీ.. ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుంటే సరి!

ఎండాకాలం అంటే ఈ రోజుల్లో అందరూ బయటకు పోయి శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, జ్యూస్ లో వంటివి ఎక్కువగా తాగేస్తున్నారు. ఇలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న మామిడికాయతో షర్బత్ తాగితే

మండిపోతున్న ఎండల్లో మామిడికాయలతో షర్బత్.. పోషకాలతో పాటు ఫుల్ టేస్టీ.. ఎలా చేయాలో ఒకసారి తెలుసుకుంటే సరి!


ఎండాకాలం అంటే ఈ రోజుల్లో అందరూ బయటకు పోయి శీతల పానీయాలు, ఐస్ క్రీమ్స్, జ్యూస్ లో వంటివి ఎక్కువగా తాగేస్తున్నారు. ఇలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకున్న మామిడికాయతో షర్బత్ తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు తో పాటు టేస్టీగా కూడా ఉంటుంది.

సంవత్సరం మొత్తంగా మామిడికాయలు దొరికే ఏకైక కాలం ఎండాకాలం. ముఖ్యంగా ఈ సమయంలో పిల్లలకి సెలవులతో పాటు ఇంట్లో అందరూ ఒకే దగ్గర ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో కాస్త ఓపిక తెచ్చుకొని మామిడికాయతో షర్బత్ చేసుకుంటే ఇంటి అందరూ చక్కగా తాగేయవచ్చు..
అయితే మామిడికాయలతో షర్బత్ ఎలా తయారు చేయాలంటే..  రెండు మామిడికాయలు కొంచెం పంచదార ఉప్పు నీళ్లు దగ్గర ఉంచుకోవాలి.
ముందుగా కుక్కర్‌లో మామిడికాయలు మునిగే అన్ని నీళ్లు పోసి 4 విజిల్స్ వచ్చేంత వరకూ ఉడికించుకోవాలి. కాసేపయ్యాక మామిడి కాయలు బయటకు తీసి, తొక్క తీసేయాలి. గుజ్జును మాత్రమే తీసి పక్కన పెట్టుకోవాలి. మామిడి కాయలు ఉడికించిన నీళ్లలో తగినంత పంచదార కలుపుకొని పక్కన పెట్టుకోండి. మామిడికాయ గుజ్జులో పంచదార కలుపుకొని పెట్టుకున్న నీళ్లు, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి. పులుపు, తీపి సరిపోయేట్లు చూసుకుని మరిన్ని నీళ్లు కూడా పోసుకోవచ్చు.
ఇలా తయారుచేసిన షర్బతును కాసేపు ఫ్రిజ్లో ఉంచి తీసి తాగితే ఎండాకాలంలో బాడీ బిహేవితే సమస్య తగ్గడంతో పాటు ఎంతో టేస్టీగా అనిపిస్తుంది మామిడికాయలో ఉండే అన్ని పోషకాలు శరీరానికి చక్కగా అందుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.