Curd pack : పెరుగులో ఇది కలిపి రాస్తే..మీ చర్మం మెరిసిపోతుంది తెలుసా..?

Glowing face : భోజనంలో పెరుగు లేకపోతే.. అస్సలు అన్నం తిన్న ఫీలింగ్‌ కూడా రాదు చాలామంది.. అలా డైలీ పెరుగుతినే వాళ్లు ఉన్నారు. పెరుగుతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది.

Curd pack : పెరుగులో ఇది కలిపి రాస్తే..మీ చర్మం మెరిసిపోతుంది తెలుసా..?
Curd face packs for skin whitening


Glowing face : భోజనంలో పెరుగు లేకపోతే.. అస్సలు అన్నం తిన్న ఫీలింగ్‌ కూడా రాదు చాలామంది.. అలా డైలీ పెరుగుతినే వాళ్లు ఉన్నారు. పెరుగుతో ఆరోగ్యమే కాదు.. అందాన్ని కూడా పెంచుకోవచ్చు. ముఖ సౌంద‌ర్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పెరుగు మ‌న‌కు దోహ‌ద‌ప‌డుతుంది. దీనిలో ఉండే పోష‌కాలు, యాంటీ ఇన్ ప్లామేష‌న్ గుణాలు మ‌న చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించి ముఖాన్ని అందంగా క‌న‌బ‌డేలా చేయ‌డంలో స‌హాయ‌ప‌డ‌తాయి. పెరుగును ఉప‌యోగించ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మ‌చ్చ‌లను, మొటిమ‌ల‌ను, న‌లుపుద‌నాన్ని మ‌నం చాలా సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.
పెరుగును మ‌న చ‌ర్మ త‌త్వాన్ని బ‌ట్టి వాడాలి. జిడ్డు చ‌ర్మం ఉన్న వారు పుల్ల‌టి పెరుగును అలాగే పొడి చ‌ర్మం ఉన్న వారు తియ్య‌టి మీగ‌డ పెరుగును ఉప‌యోగించాలి. ముందుగా ఒక గిన్నెలో ఒక టీ స్పూన్ పెరుగును తీసుకోండి..త‌రువాత ఇందులో ఒక టీ స్పూన్ గోధుమ పిండిని తీసుకోవాలి. గోధుమ‌పిండి బ్లీచింగ్ ఏజెంట్ లాగా ప‌ని చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు క‌లిసేలా బాగా క‌ల‌పాలి. జిడ్డు చ‌ర్మం ఉన్న వారు ఇందులో నిమ్మ‌ర‌సాన్ని కూడా వేసుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న మిశ్ర‌మాన్ని ఉప‌యోగించే ముందు చ‌ర్మాన్ని శుభ్రంగా క‌డ‌గండి.. త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ముఖానికి రాసుకోవాలి. కొద్దిగా ఆరిన త‌రువాత సున్నితంగా మ‌ర్దనా చేసుకోవాలి.

పూర్తిగా ఆరే వ‌ర‌కు అలాగే ఉంచి ఆ త‌రువాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ముఖంపై ఉండే మొటిమ‌లు, మ‌చ్చ‌లు, న‌లుపుద‌నం, మృత క‌ణాలు తొల‌గిపోయి ముఖం అందంగా మారుతుంది. మీరు ఈ మిశ్రమంలో.. టమటా గుజ్జు కూడా యాడ్‌ చేసుకోవచ్చు. అలాగే చ‌ర్మానికి కావ‌ల్సిన తేమ అంది చ‌ర్మం పొడి బార‌కుండా ఉంటుంది. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు పాటించ‌డం వ‌ల్ల మ‌నం మ‌రింత చ‌క్క‌టి ఫ‌లితాన్ని పొంద‌వ‌చ్చు.
పెరుగుతో పాటు కాఫీ పౌడర్‌, టమాట గుజ్జు, రోజ్‌ వాటర్‌ ఇవన్నీ కూడా యాడ్‌ చేసుకోని..ముఖానికి రాసుకోవడం వల్ల మీ ఫేస్‌ తెల్లగా మారుతుంది. అయితే ఇది ఒక్కరోజులో అయ్యే పని కాదు.. వారానికి ఒకసారి నెలకు నాలుగు సార్లు కచ్చితంగా చేస్తూ ఉండాలి. ఓపిక ఉంటే రిజల్ట్‌ మీకే కనిపిస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.