నిద్రలేమికి చక్కని పరిష్కారం మూన్ మిల్క్.. 

Moon milk.. శరీరాన్ని తేలికపరచి మెదడుని రిలాక్స్ చేయడంలో ముందుంటుందని తెలుస్తోంది అయితే ఈ పదం ఏమి కొత్తది కాదు ఎన్నో ఏళ్లుగా insomnia వారికి చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది

నిద్రలేమికి చక్కని పరిష్కారం మూన్ మిల్క్.. 
Moon milk is the best solution for insomnia


ఈరోజుల్లో చాలామందిని వేధిస్తున్న సమస్య insomnia. దీనివల్ల ఎందరో ఇబ్బంది పడుతూ ఉన్నారు అలాగే వైద్యుల్ని సంప్రదిస్తూ మందులు వాడుతూ ఆరోగ్యాన్ని సైతం ఇబ్బంది పెడుతూన్నారు.. అయితే నిద్రలేమికి చక్కని పరిష్కారం moon milk అని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.. 

మూన్ మిల్క్.. శరీరాన్ని తేలికపరచి మెదడుని రిలాక్స్ చేయడంలో ముందుంటుందని తెలుస్తోంది అయితే ఈ పదం ఏమి కొత్తది కాదు ఎన్నో ఏళ్లుగా నిద్రలేమి వారికి చక్కని పరిష్కారంగా ఉపయోగపడుతుంది. దీనిపై ఇప్పటికే అధ్యయనాలు కూడా జరిపారు అంతేకాకుండా భారతీయ ఆరోగ్య శాస్త్రంలో సైతం దీని ప్రాధాన్యత ఎంతో ఉంది..

సాధారణంగా నిద్ర పట్టని వారికి పడుకునే ముందు గోరువెచ్చని పాలు తాగమని చెబుతారు అయితే ఇందులో కొన్ని మార్పులు చేస్తే దాన్ని మూన్ మిల్క్ అంటారు. ముఖ్యంగా దీనిని ఎలా తయారు చేయాలి అంటే... గోరువెచ్చని పాలలో దాల్చిన చెక్క, యాలకులు, కుంకుమపువ్వు, పసుపు, జాజికాయ వంటివి వేసి తాగాలి. ముఖ్యంగా ఇవన్నీ కూడా తక్కువ పరిమణంలో వేయాలి. అలాగే పంచదార కలపకూడదు.. ఇలా తాగడం వల్ల కొద్ది రోజుల్లోనే మార్పు కనిపిస్తుందని తెలుస్తోంది. ఇది మెదడును ప్రశాంతంగా ఉంచి త్వరగా నిద్రలోకి జారుకునేటట్టు చేస్తుంది. అంతే కాకుండా మనసునే ప్రశాంతంగా ఉంచి ఒత్తిడిని దూరం చేస్తున్నారో తెలుస్తోంది...

అలాగే ఈ మూన్ మిల్క్ వల్ల ఎన్నో రకాల ఆరోగ్యం ప్రయోజనాలు ఉన్నాయని తెలుస్తుంది. జీవక్రియ మెరుగుపడటమే కాకుండా.. మరుసటి రోజు శరీరం ఎంతో రిలాక్స్డ్ గా అనిపిస్తుందని తెలుస్తోంది. అలాగే దీనిని రోజు అలవాటు చేసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. శరీరాన్ని ప్రశాంతంగా ఉంచి రోజంతా యాక్టివ్ గా ఉంచడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుందని తెలుస్తోంది..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.