మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు ఇవే..

పిల్లలు పుట్టకపోవడానికి కేవలం మహిళలు మాత్రమే కారణం కాదు, మగవారిలోనూ లోపం ఉంటుందని తెలుసుకోండి. వీర్య కణాల యొక్క నాణ్యత సంఖ్యపై పిల్లలు పుట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టని చాలా కేసులలో

మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు ఇవే..


పెళ్లే రెండేళ్లు అయినా పిల్లలు పుట్టకపోతే.. ఆ జంటకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఒకవేళ వాళ్లే కావాలని పిల్లలు ఇప్పుడే వద్దు అనుకుంటే.. ఓకే.. అలాకాకపోతే..సమస్య స్త్రీలోనే ఉంది అంటారు. సంతానం కలగడం లేదంటే..లోపం అబ్బాయిలో కూడా ఉండొచ్చు. స్త్రీలతో పోలిస్తే పురుషులు వంధ్యత్వానికి గురయ్యే అవకాశం అధికంగా ఉంటుంది. ఎండోక్రైన్ సమతుల్యతకు అంతరాయం కలగడం, వీర్యకణాల నాణ్యత, సంఖ్య లాంటి అనేక కారణాల వల్ల మగవారు వంధ్యత్వానికి గురవుతారు. వివాహిత గర్భం దాల్చకపోతే మొదటగా సమస్య ఎక్కడుందో తెలుసుకోవాలి. మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు ఇవే..

పిల్లలు పుట్టకపోవడానికి కేవలం మహిళలు మాత్రమే కారణం కాదు, మగవారిలోనూ లోపం ఉంటుందని తెలుసుకోండి. వీర్య కణాల యొక్క నాణ్యత సంఖ్యపై పిల్లలు పుట్టడం అనేది ఆధారపడి ఉంటుంది. పిల్లలు పుట్టని చాలా కేసులలో వంధ్యత్వానికి గురైన పురుషులకు వీర్య కణాలు తక్కువగా ఉండటం, లేదా నాణ్యమైన వీర్య కణాలు లేకపోవడమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలలో తేలింది.

పురుషులు 60 ఏళ్ల తరువాత సైతం తండ్రులు అవ్వగలరు. దానిని బట్టి మగవారిలో సంతానోత్పత్తిని వయస్సుకు అది సాక్ష్యమని భావించకూడదు. ఎంత వయసు వచ్చినా మగవారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయని అపోహ ఉంటుంది. ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత పురుషులలో వీర్యకణాల నాణ్యత తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 

మగవారిలో వయసు మీద పడ్డ తరువాత సంతానోత్పత్తిలో గర్భస్రావం మరియు 9 నెలలకు ముందుగానే పిల్లలు జన్మించడం లాంటి సమస్యలు వస్తాయి. వయసు విషయానికొస్తే పురుషులతో పోలిస్తే సంతానోత్పత్తి క్షీణించడం మహిళల్లో చాలా వేగంగా ఉంటుంది. మరోవైపు వయసు మీద పడిన తల్లిదండ్రుల పిల్లలు ఇతర చిన్నారులు అంత చురుకుగా ఉంటారని చెప్పలేము.

వీర్య కణాలు తక్కువైతే పిల్లలు పుట్టరు అనే అపోహలు సైతం మగవారిలో ఉంటాయి. దీనివల్ల కలిగే వంధ్యత్వ సమస్యకు చికిత్స చేయించుకోవచ్చు. వీర్యకణాల సంఖ్య, నాణ్యతను పరిశీలించిన తరువాత సంతానోత్పత్తి నిపుణులు మీకు చికిత్స అందిస్తారు. దానివల్ల వీర్యకణాలు నాణ్యత పెరిగి తండ్రి అయ్యే అవకాశాలు అధికంగా ఉంటాయి.

చాలా మంది నపుంసకత్వము, వంధ్యత్వం ఒకటేనని నమ్ముతారు. కానీ ఈ రెండింటి అర్ధాలు వేరు. వీటి లక్షణాలు, సమస్య వేరు అని తెలుసుకోండి. వంధ్యత్వం అంటే పిల్లలు పుట్టే అవకాశం లేనివారిని సూచిస్తుంది, అయితే నపుంసకత్వము అంటే అంగస్తంభన కలగని మగవారిని సూచిస్తుంది. అసలు మగవారి లక్షణాలు లేకపోవడం నపుంసకత్వం.

  ఈరోజుల్లో చాలా మంది మగవాళ్లకు వంధ్యత్వం 

ఆధునిక జీవనశైలితో వీర్యకణాల నాణ్యత ప్రభావితం అవుతుంది. తద్వారా అండాలపై సైతం దీని ప్రతికూల ప్రభావం ఉంటుంది. మద్యపానం, ధూమపానం, డ్రగ్స్ వాడకం, లోదుస్తులు బిగుతుగా ధరించడం, హానికరమైన రసాయనాలు వాడకం, లైంగిక సంక్రమణ వ్యాధులు పురుషులలో సంతానోత్పత్తిని ప్రభావితం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
చెడు అలవాట్లు సంతానోత్పత్తిపై కచ్చితంగా ప్రభావం చూపుతాయి. దీని ద్వారా వీర్యకణాల నాణ్యతతో పాటు వాటి సంఖ్య సైతం తగ్గి పిల్లలు పుట్టకపోవడం, లేదా వైకల్యం లాంటి సమస్యలతో చిన్నారులు జన్మించే అవకాశాలున్నాయి. కాబట్టి పిల్లలు పుట్టే వరకు అయినా.. మీ చెడు అలవాట్లను మానేయండి.. అటు అమ్మాయిలు కూడా స్మోకింగ్‌ చేస్తున్నారు.. మీరు కూడా స్మోకింగ్‌ చేయడం మానేస్తేనే.. పిల్లలు ఆరోగ్యంగా పుడతారు. టీనేజ్‌లో ఉన్నప్పుడు చెడు అలవాట్లకు యట్రాక్ట్‌ అవడం కామన్‌..కానీ ఒక వయసు వచ్చాక వాటిని వదిలేయాలి..!

మగవారిలో సంతానోత్పత్తికి సంబంధించి అపోహలు ఇవే..

వీర్య కణాలు తక్కువైతే పిల్లలు పుట్టరు అనే అపోహలు సైతం మగవారిలో ఉంటాయి. దీనివల్ల కలిగే వంధ్యత్వ సమస్యకు చికిత్స చేయించుకోవచ్చు. వీర్యకణాల సంఖ్య, నాణ్యతను పరిశీలించిన తరువాత సంతానోత్పత్తి నిపుణులు మీకు చికిత్స అందిస్తారు. 

చాలా మంది నపుంసకత్వము, వంధ్యత్వం ఒకటేనని నమ్ముతారు. కానీ ఈ రెండింటి అర్ధాలు వేరు. వీటి లక్షణాలు, సమస్య వేరు అని తెలుసుకోండి. వంధ్యత్వం అంటే పిల్లలు పుట్టే అవకాశం లేనివారిని సూచిస్తుంది, అయితే నపుంసకత్వము అంటే అంగస్తంభన కలగని మగవారిని సూచిస్తుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.