Osteoporosis : వయసు పెరుగుతుంటే ఒంగిపోతున్నారా! ప్రాణాల్ని హరించే ఆస్టియోపోరాసిస్ తో జాగ్రత్త..

నెమ్మదిగా మొదలై మనిషిని కుంగ తీసేసే వ్యాధి Osteoporosis . శరీరంలో ఎక్కడో ఒక దగ్గర ఎముక విరిగి దెబ్బ తగిలితే కానీ ఈ విషయాన్ని మనిషి గుర్తించలేరు. అయితే వయసు పెరుగుతున్న కొలది ఏ రకంగా అయితే..

Osteoporosis : వయసు పెరుగుతుంటే ఒంగిపోతున్నారా! ప్రాణాల్ని హరించే ఆస్టియోపోరాసిస్ తో జాగ్రత్త..
osteoporosis symptoms


Osteoporosis : వయసు పెరుగుతున్న కొలది ఎముకలు వంగిపోవడం చూస్తూనే ఉంటాము. అయితే ఈ సమస్యని తేలికగా తీసుకోకూడదని తెలుస్తోంది. ఎముకలు వంగిపోవడం, నడివయసులోనే నడుము వంగిపోవడం వంటివి తర్వాత ఎన్నో రకాల అనారోగ్యాలకు దారి తీస్తాయని తెలుస్తోంది.

సాధారణంగా 50 ఏళ్లు పైబడిన వారిలో ఇలాంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. పురుషుల్లో ఈ సమస్య మరింత ఎక్కువనే చెప్పవచ్చు. దీన్నే ఆస్టియో పోరాసిస్ అంటారు. ఈ స్థితిలో శరీరంలోని ఎముకలు పట్టుత్వాన్ని కోల్పోతాయి. దీని కారణంగానే ఎముకలు వంగిపోయి గూని తత్వం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ సమస్యలో ఎక్కడా బాధ కానీ ముందు సూచనలు కానీ కనిపించవు.

నెమ్మదిగా మొదలై మనిషిని కుంగ తీసేసే వ్యాధి ఆస్ట్రోపోరోసిస్. శరీరంలో ఎక్కడో ఒక దగ్గర ఎముక విరిగి దెబ్బ తగిలితే కానీ ఈ విషయాన్ని మనిషి గుర్తించలేరు. అయితే వయసు పెరుగుతున్న కొలది ఏ రకంగా అయితే షుగర్, రక్తపోటు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తాయో ఆస్ట్రోపోరోసిస్ కూడా అదే విధంగా వస్తుందని గుర్తించింది వైద్యరంగం.

వ్యాధికి కారణాలు ఏంటంటే..

సాధారణంగా ఈ వ్యాధిలో ఎముకలకు రంధ్రాలు ఏర్పడతాయి. ఏదో ఒకచోట మాత్రమే కాకుండా శరీరం మొత్తం వ్యాపించి ఉన్న అస్తిపంజరంలో చిన్న చిన్న రంధ్రాలు ఏర్పడి ఎముకలు బలహీనమైపోతాయి. ఈ క్రమంలోనే నిటారుగా ఉండలేక వంగిపోతూ ఉంటారు.

ఈ క్రమంలో ఎముకల్లో ఉన్న గుజ్జు అంతా కరిగిపోయి చిన్న చిన్న దెబ్బలకి ఎముకలు సైతం విరిగిపోయి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెన్నుపూస, తుంటి ఎముకలు, మోచేతి ఎముకలకు ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది

ఎవరికి వచ్చే అవకాశం ఉందంటే..

సాధారణంగా ఎక్కువగా కదలకుండా ఒకే చోట కూర్చునే వారికి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. అలాగే జన్మతః కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కొన్ని రకాల జీర్ణ సంబంధిత వ్యాధులు, కీళ్ల నొప్పులు, లివర్ వ్యాధి ఉన్నవారికి సైతం ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువగా మద్యం తీసుకోవటం, విటమిన్ డి శరీరానికి సరిగా అందకపోవటం, పొగ తాగడం, పోషకాహార లోపం, బలాన్ని తగ్గించే వ్యాధులు శరీరంలో ప్రబలడం వంటి వాటి వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది.

ఎలా గుర్తించాలంటే..

చిన్న చిన్న దెబ్బలకు ఎముకలు విరిగిపోవడం, క్రమంగా నడుము వంగిపోవడం, నడుముని నిటారుగా నిలబెట్టలేకపోవడం, ఎముకల్లో బలం తగ్గినట్టు అనిపించడం వంటివన్నీ సాధారణ లక్షణాలు.

నివారణకు ఏం చేయాలంటే..

సాధారణంగా వ్యాధి రాకుండా ఉండాలి అంటే నిత్య జీవితంలో చాలా మార్పులు చేసుకోవాలి. మద్యం, పొగతాగటం వంటి అలవాట్లు మానుకోవాలి. టీ, కాఫీలను తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ ఉండాలి. నువ్వుల నూనెను ఆహారంలో భాగం చేసుకోవాలి. చిన్న వయసు నుంచే పిల్లలకు కాల్షియం ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల వారికి తర్వాత ఈ వ్యాధి వచ్చే అవకాశం తగ్గుతుంది. విటమిన్ కె అధికంగా ఉండే ఆహార పదార్థాలు, ఆకుకూరలు, కూరగాయలు తరచు తీసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.