PCOD : మహిళలకు సవాల్ విసురుతున్న పీసీఓడీ సమస్య... పొత్తికడుపుపై భారం.. పీసీఓడీ

PCOD : సుమారుగా 12 నుంచి 45 వయస్సు గల మహిళలను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. 10 మంది మహిళల్లో కచ్చితంగా 5 గురు మహిళలు అవస్థపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు.

PCOD : మహిళలకు సవాల్ విసురుతున్న పీసీఓడీ సమస్య... పొత్తికడుపుపై భారం.. పీసీఓడీ
Burden on abdomen..PCOD


PCOD : అప్పట్లో వ్యాధులంటే 100 మందిలో ఒకరికో ఇద్దరికో వచ్చేవి. ఎందుకంటే పౌష్టికాహారం, శారీరక శ్రమ ఉండటంవల్ల వ్యాధులు దరిచేరేవి కాదు.. మరి ఇప్పుడో....ఇంక చెప్పనక్కర్లేదు. పదిలో 8 మందికి జబ్బులు వస్తున్నాయి. అందులో ఇప్పటి మహిళలకు సవాల్ విసురుతున్న సమస్య PCOD (పాలిసిస్టిక్ ఓవరియన్ డీసీజ్), దీనిని PCOS కూడా అంటారు.

సుమారుగా 12 నుంచి 45 వయస్సు గల మహిళలను ఈ సమస్య తీవ్రంగా వేధిస్తోంది. 10 మంది మహిళల్లో కచ్చితంగా 5గురు మహిళలు అవస్థపడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. కారణం.. మారుతున్న జీవనస్థితిగతులు, ఆహారనియామవళి.

పట్టణాల్లో ఉండే మహిళలకే పొంచి ఉందనుకున్న ఈ సమస్య....చాపకింద నీరులా గ్రామీణమహిళలనూ కాటేస్తోంది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో దీనిపై సరైన అవగాహన లేదు. పట్టణాల్లోనూ కొంతమంది స్త్రీలకే కొంచెం కొంచెంగా తెలుసు.

సాధారణంగా మహిళల్లో 28 రోజులకు ఒకసారి నెలసరి వస్తుంది. నెలసరి వచ్చిన 14 రోజులకు అండం విడుదల అవుతుంది. పీసీఓడీ ఉంటే మాత్రం... నెలసరి సక్రమంగా జరగదు సరికాదా.....సంతాన సమస్యలు సైతం చుట్టుముడతాయి. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలితో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దానివల్ల అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు లేదా గాలి బుడగలు ఏర్పడతాయి. ఈ బుడగలు విడుదలైన అండాన్ని అడ్డుకుని నెలసరి రాకుండా చేస్తాయి. అదే విధంగా అండాన్ని పెరగనివ్వకుండా చేస్తాయి. పొట్ట ఉబ్బరంగా తయారవుతుంది. రుతుక్రమం జరిగినా ఓక్కోసారి రక్తస్రావం సరిగా జరగకపోవడం, లేదా అధికంగా అయిపోతుంది. అదనపు ఇన్సులిన్ ఆండ్రోజెన్(పురుషుల్లో ఉండే హార్మోన్) ను ఉత్పత్తి చేస్తుంది. ఈ పీసీఓస్ ప్రభావం తీవ్రస్థాయికి చేరితే..మధుమేహం కూడా రావొచ్చు. పీసీఓడీకి సరైన చికిత్స అందుబాటులో లేదు.

అయితే విద్యార్థి దశ నుంచే పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాలి. వీలైతే పుస్తకాల్లో పాఠ్యాంశంగా చేర్పిస్తే మరీ మంచిది. ప్రత్యేకంగా అవగాహన కల్పించనక్కర్లేదు. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం కౌన్సిలింగ్ ఇవ్వాలి.

ఇప్పుడున్న ఆధునిక మహిళలు ఇంటిపని, ఆఫీస్ పనులతో సతమతమవుతున్నారు. అలాంటివారు ఆఫీస్ లో ఉండేప్పుడు అలా కూర్చుని పనే కాకుండా....మధ్యమధ్యలో ఏదో ఒక వ్యాపకం పెట్టుకుని నడవాలి. శరీరానికి సాంత్వన కలిగించేలా చిన్నపాటి వ్యాయామాలు చేస్తూ ఉండాలి.

పీసీఓడీ లక్షణాలు -

బరువు పెరగడం, మొటిమలు రావడం, చిరాకు, కోపం, ఒత్తిడి, అవాంఛిత రోమాలు, ఆకలివేయకపోవడం, నెలసరి గాడితప్పడం, అసలే నెలసరి రాకపోవడం, భోజనం సహించకపోవడం.

పీసీఓడీకి చెక్ పెట్టండి ఇలా:

  • మంచి జీవనశైలి, సరైన ఆహారం తీసుకుంటే పీసీఓడీకి ఇట్టే చెక్ పెట్టొచ్చు.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం
  • బరువు పెరగకుండా చూసుకోవాలి, నానపెట్టిన డ్రైఫ్రూట్స్ తినాలి
  • యోగా, ధ్యానం చేస్తూ ఉండాలి
  • పిండి, కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు, గుడ్డు, చేపలు తినాలి. తీపి తగ్గించాలి.
  • ఉదయపు అల్పాహారంలో రాగిజావ చేర్చుకుంటే బరువును నియంత్రించొచ్చు
  • సరైన సమయానికి ఆహారం తినాలి, చిరుతిళ్లు తగ్గించాలి, ముఖ్యంగా అర్థరాత్రులు తినకూడదు.
  • మరీ ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్ అసలే తినకూడదు
  • గంట గంటకు మంచి నీళ్లు తాగాలి.

వైద్యుల్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని మందులు వాడాలి, కొంతమందికి 3 నెలలు, మరికొంతమందికి 6 నెలలు మందులు వాడితే సరిపోతుంది. జీవనశైలి, ఆహారపు అలవాట్లు మార్చుకుంటే...మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.