కోవిడ్‌ నుంచి కోలుకున్నాకా ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకోవాలా..?

ఈరోజుల్లో గుండె వైఫల్యం బాగా ఎక్కువైంది.. చాలా మంది.. సడన్‌గా హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతున్నారు. చిన్న పెద్దా అని తేడా లేదు. మూడేళ్ల కిందట పరిస్థితి ఇలా ఉండేది కాదు.. కానీ ఇప్పుడే హార్ట్‌ అటాక్‌ అంటే..

కోవిడ్‌ నుంచి కోలుకున్నాకా ఎప్పటికప్పుడు గుండె పరీక్షలు చేయించుకోవాలా..?


ఈరోజుల్లో గుండె వైఫల్యం బాగా ఎక్కువైంది.. చాలా మంది.. సడన్‌గా హార్ట్‌ ఎటాక్‌తో చనిపోతున్నారు. చిన్న పెద్దా అని తేడా లేదు. మూడేళ్ల కిందట పరిస్థితి ఇలా ఉండేది కాదు.. కానీ ఇప్పుడే హార్ట్‌ అటాక్‌ అంటే.. పెద్దవాళ్లకు మాత్రమే కాదు.. స్కూల్‌పిల్లలకు వస్తుంది అనేలా తయారైంది.. కరోనా వచ్చినప్పటి నుంచి మనుషుల అన్నివిధాలా దెబ్బతిన్నారు. కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారిలో అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్లు సైంటిస్టులు చేప‌ట్టిన అధ్య‌య‌నాల్లో వెల్ల‌డైంది. దీన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తున్నారు. అంటే కోవిడ్ బారిన ప‌డి రిక‌వ‌రీ అయిన వారికి గుండె, ఇత‌ర భాగాల్లో స‌మ‌స్య‌లు వ‌స్తే దాన్ని లాంగ్‌-కోవిడ్ అని పిలుస్తారు. ప్ర‌స్తుతం ఈ బాధితుల సంఖ్య పెరుగుతుంద‌ని నిపుణులు అంటున్నారు.

లాంగ్-కోవిడ్ బారిన ప‌డిన అనేక మందిలో గుండె స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని సైంటిస్టులు తెలిపారు. కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారిలో ఎక్కువ‌గా గుండె, మెద‌డు, కిడ్నీల స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయ‌ని తెలిపారు.

కోవిడ్ నుంచి కోలుకున్న త‌రువాత కూడా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు చెప్తూనే ఉన్నారు..అయితే ప్ర‌స్తుతం ఇలాంటి బాధితుల సంఖ్య పెరిగింద‌ని నిపుణులు అంటున్నారు. చాలా మంది కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న త‌రువాత గుండె స‌మ‌స్య‌ల‌కు గురై హాస్పిట‌ళ్ల‌కు వ‌స్తున్నారు. అందుక‌ని కోవిడ్ నుంచి కోలుకున్న వారు త‌ప్ప‌నిస‌రిగా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో.. ఛాతిలో అసౌక‌ర్యం, ఎడ‌మ లేదా కుడి భుజాల నుంచి చేతుల‌కు నొప్పి వ్యాపించ‌డం, అసాధార‌ణ రీతిలో చెమ‌ట ప‌ట్టడం, అసాధార‌ణ రీతిలో గుండె కొట్టుకోవ‌డం, తీవ్ర‌మైన అల‌స‌ట, చిన్న ప‌నిచేసినా, అస‌లు ప‌నిచేయ‌క పోయినా బాగా అల‌సిపోయిన‌ట్లు అనిపించడం వంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. ఇలాంటి ల‌క్ష‌ణాలు ఉన్న ఎవ‌రైనా స‌రే ఏమాత్రం ఆల‌స్యం చేయ‌కుండా వెంట‌నే వైద్యుల‌ను సంప్రదించి ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని, అవ‌స‌రం అయిన మేర మందుల‌ను వాడాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటికే కొవిడ్‌ బారిన పడ్డవారికి, వ్యాక్సిన్‌ వేసుకున్న వాళ్లకు గుండె సంబంధిత వ్యాధులు వస్తున్నాయని చాలా మంది అంటున్నారు. ఇందులో ఎంత నిజముందో పక్కనపెడితే.. మనం అయితే లైట్‌ తీసుకోవడం ఎందుకు చెప్పండి.!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.