పీరియడ్స్‌లో బ్లీడింగ్ తక్కువగా అవుతుందా.. అయితే వీటిని తినండి.
బైక్ నడవాలంటే.. పెట్రోల్ కావాలి. లేదంటే అది ముందుకెళ్లదు.. అలాగా మనిషి ముందుకెళ్లాలంటే.. బాడీలో పెట్రోల్ అనే రక్తం కావాలి.

బైక్ నడవాలంటే.. పెట్రోల్ కావాలి. లేదంటే అది ముందుకెళ్లదు.. అలాగా మనిషి ముందుకెళ్లాలంటే.. బాడీలో పెట్రోల్ అనే రక్తం కావాలి. ఈ రక్తం సరిపడా ఉంటేనే.. అన్ని పార్ట్స్‌కు చేరి.. వాటిని పనిచేసేలా చేస్తుంది. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. ఒక ఆరోగ్యవంతమైన వ్యక్తి శరీరంలో 5 లీటర్ల రక్తం ఉంటుంది. రక్తం తక్కువగా ఉంటే చాలా సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పిరియడ్స్‌లో తక్కువ బ్లీడింగ్ అవుతుంది. తక్కువైతే ఏంటి సమస్య అనుకుంటారేమో.. ఆరోగ్యవంతమైన మహిళకు బ్లీడింగ్ కచ్చితంగా మూడు నుంచి ఐదు రోజులు ఉండాలి. మీకు ఒక రోజు, ఒకటిన్నర రోజు ఉందంటే.. మీలో రక్తం లేనట్లే.. రక్తహీనత భారిన పడ్డారని సంకేతం. రక్తహీనత వల్ల శరీరం చాలా బలహీనంగా కనిపిస్తుంది. ఎప్పుడూ అలసిపోతుంటారు. తరచుగా తలనొప్పి, గుండెదడ, ఆందోళన వస్తుంది. శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాల ఆహారం తీసుకోవడం వల్ల రక్తం బాగా పెరుగుతుంది. ఆ సూపర్ ఫుడ్స్ ఏంటంటే.
శరీరంలో రక్తం అభివృద్ధికి బీట్‌రూట్ చాలా సహాయపడుతుంది. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలోని మలినాలను తొలగిస్తుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
రోజుకో యాపిల్ తింటే ఆరోగ్యంగా ఉండొచ్చని చాలా మంది చెబుతుంటారు. యాపిల్‌కు అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. యాపిల్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్‌ని పెంచుతుంది.
ఎర్రగా కనిపించే దానిమ్మ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో సోడియం, మెగ్నీషియం, పొటాషియం, ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ దానిమ్మ పండును తింటే శరీరంలో రక్తం వృద్ధి పెరుగుతుంది.
ఖర్జూరం, బాదం, వాల్ నట్స్, అంజీరా వంటి డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిని తీసుకోవడం వల్ల రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్య క్రమంగా పెరుగుతుంది.
రక్తపోటు తక్కువగా ఉంటే, పాలకూరను తప్పనిసరిగా ఆహారంలో చేర్చుకోవాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.