ఈ చిట్కాలతో చెవి నొప్పి బలాదూర్

చెవికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మనకు తెలిసే మొట్టమొదటి లక్షణం చెవిపోటే. ఇది వస్తే ముందు మనం చేసే చెడ్డ పనెంటో తెలుసా....చెవిపోటు వచ్చిందంటే చాలు వెంటనే పుల్లలు గానీ పిన్నీసులు గానీ పెట్టేసి తిప్పేస్తుంటాం.

ఈ చిట్కాలతో చెవి నొప్పి బలాదూర్
Relieve ear pain with these tips


Ear pain : శరీరంలో ఎక్కడ నొప్పి వచ్చినా భరించగలం గానీ....శరీరంలో తాకలేని చోట నొప్పి వస్తే మాత్రం ఉంటది....... కూర్చోలేం, నిల్చోలేం. సరే పడుకుందామన్న నిద్ర కూడా పట్టదు.శరీరంలో తాకలేని చోట అంటే ముఖ్యంగా చెప్పుకోవల్సింది....చెవిపోటు. దీనివల్ల వచ్చే బాధ అంతా ఇంతా కాదు. ఒక్క చోట ఉండనివ్వదు. గట్టిగా శబ్ధం వినిపించినా భరించలేకపోతుంటాం. ఎవరితో మాట్లాడలన్నా విసుగ్గా అనిపిస్తుంది. ఒక్కోక్క నిమిషం నరకంగా అనిపిస్తుంది. చిన్న శబ్ధానికే చికాకు పడిపోతుంటాం. చెవి భాగంలో ఎక్కడ లోపం ఏర్పడినా....ముందు వచ్చే హెచ్చరిక చెవి నొప్పి.చెవికి సంబంధించి ఏ సమస్య వచ్చినా మనకు తెలిసే మొట్టమొదటి లక్షణం చెవిపోటే. ఇది వస్తే ముందు మనం చేసే చెడ్డ పనెంటో తెలుసా....చెవిపోటు వచ్చిందంటే చాలు వెంటనే పుల్లలు గానీ పిన్నీసులు గానీ పెట్టేసి తిప్పేస్తుంటాం. ఆ వెంటనే నూనె, నీళ్లు పోసేస్తాం. అప్పుడే మనలో డాక్టర్లు కూడా బయటికి వచ్చేస్తాం. వెంటనే నొప్పి తగ్గిపోవాలని ఏదేదో చేసేస్తాం. ఎందుకంటే ఆ వచ్చే నొప్పి అట్లుంటది. అది ముమ్మాటికీ తప్పని అంటున్నారు నిపుణులు.

చెవిపోటు ఎందుకొచ్చిందో తెలుసుకోకుండా మిడిమిడి జ్ఞానంతో సొంత వైద్యం చేస్తాం. కొండ నాలుకకు మందు వేస్తే ఉన్న నాలుక ఊడిపడినట్లు ఉంటది మన చేష్టలు. పెద్దవాళ్లు ఊరికే చెప్పరు సామెతలు. అసలు నొప్పి ఎలా ఉంది.....ఎందుకొచ్చిందో తెలుసుకోవాలి. ఎంత సేపైనా తగ్గకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఒకవేళ సహజంగా చెవినొప్పి వస్తే ఇంటి చిట్కాలు పాటించవచ్చు. అప్పటికీ తగ్గకపోతే వైద్యులను సంప్రదిస్తే మంచిది.


చెవినొప్పికి ఇంటి చిట్కాలు

వేడినీటిలో ముంచిన గుడ్డతో నొప్పిగా అనిపించిన స్థలంలో అద్దడం వల్ల చెవి నొప్పి తగ్గకపోయినా....... ఉపశమనంగా మాత్రం అనిపిస్తుంది. వెచ్చదనం వల్ల హాయిగా అనిపిస్తుంది. జలుబు వల్ల చెవి నొప్పి వచ్చినా తగ్గిస్తుంది.

కొద్దిగా ఆలివ్ నూనెను గోరువెచ్చగా చేసి..... 2, 3 చుక్కలు వేయడం వల్ల ఫలితం ఉంటుంది.

ఆలివ్ ఆయిల్ లేనప్పుడు ఆవ నూనెలో వెల్లుల్లి వేసి మరిగించాక 2, 3 చుక్కలు వేసుకుంటే బాగా రిలీఫ్ ఉంటుంది.

జలుబు వల్ల వచ్చిన నొప్పి అయితే..... ముక్కును శుభ్రం చేసుకుంటే సహజంగానే తగ్గిపోతుంది. అందుకు ఆవిరి కూడా పట్టినా ఉపశమనం ఉంటుంది.
చెవి నొప్పి ఉన్నప్పుడు ల్యావెండర్ నూనెను రాసి మర్దన చేయాలి

మరిగే నీటిలో కొద్దిగా యూకలిప్టస్ నూనె వేసి బాగా మరిగించాక ఆవిరి పడితే శ్వాసనాళాన్ని క్లియర్ చేస్తుంది.
చెవి నొప్పి ఉన్నప్పుడు చిన్న చిన్న ముఖానికి సంబంధించి వ్యాయామాలు చేసినా ఫలితం ఉంటుంది. నోరు పెద్దగా తెరిచి అటూ ఇటూ కదిలించాలి. అలాగే నోరూ మూసుకొని, ముందుకు వెనకకు గడ్డం కదిలించాలి.

సూదిగా ఉండేవి ఏవీ పెట్టకూడదు. కాటన్ ఇయర్ బడ్స్ కూడా పెట్టకూడదు. దానివల్ల దుమ్ముచేరే అవకాశం ఉంది.

కొన్నిసార్లు చెవినొప్పి వస్తే....తల, ముక్కు కూడా నొప్పి వచ్చేస్తుంది. అది చాలా పెద్ద సమస్య. ఆ సమయంలో వైద్యులను కచ్చితంగా సంప్రదించాలి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.