hair problems : జుట్టు సమస్యలా?......ఇలా చెక్ పెట్టండి

ఈ మధ్య Hair problems బాగా పెరిగిపోయాయి. చుండ్రు, జుట్టు రాలిపోవడం, పేనులు అయిపోవడం, జుట్టు తెల్లబడటం, జుట్టు నుంచి దుర్వాసన రావడం వంటివి సహజమై పోయాయి. ఎందుకు, ఏమిటంటే ఏమని చెప్పగలం.....వాటికి చాలా కారణాలున్నాయి.

hair problems : జుట్టు సమస్యలా?......ఇలా చెక్ పెట్టండి
Remedies for hair problems


Hair problems : ఈ మధ్య జుట్టు సమస్యలు బాగా పెరిగిపోయాయి. చుండ్రు, జుట్టు రాలిపోవడం, పేనులు అయిపోవడం, జుట్టు తెల్లబడటం, జుట్టు నుంచి దుర్వాసన రావడం వంటివి సహజమై పోయాయి. ఎందుకు, ఏమిటంటే ఏమని చెప్పగలం.....వాటికి చాలా కారణాలున్నాయి. కారణమేదైనా పరిష్కారాలు మాత్రం లేకపోలేదు. ఈ విశ్వంలో ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉన్నట్లే....జుట్టు సమస్యలకు పరిష్కారాలు చాలానే ఉన్నాయి.

వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు అందరికీ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తున్నాయి. ఎన్ని చేసినా తెల్ల వెంట్రుకలు పోవట్లేదు. జుట్టు తెల్లబడితే చుట్టుపక్కల కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. అది మనకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. జుట్టుకు సహజంగా నల్ల రంగును తెచ్చే మెలనిన్ చర్మం కింది భాగంలో ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మెలనిన్ ఉత్పత్తి తగ్గుతుంది. దానివల్ల తెల్లగా కనిపిస్తుంది.

జుట్టు తెల్లబడటానికి కారణాలు

  • మన శరీరంలో సరైన పోషకాలు లేకపోయినా జుట్టు తెల్లబడుతుంది.
  • థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచెయకపోయినా.... మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. హార్మోనుల అసమతుల్యత వల్ల తెల్ల జుట్టుకు కారణమవుతుంది.
  • జుట్టుకు రకరకాల షాంపూలు, రసాయనాలు ప్రొడక్ట్స్ వాడటం వల్ల కూడా జుట్టు నెరిసిపోతుంది.

  • వారసత్వం వల్ల జుట్టు తెల్లబడుతుంది. అమ్మ నాన్నలకు, తాత ముత్తాతలకు తొందరగా జుట్టు తెల్లబడితే.... పిల్లలకు కూడా త్వరగా వచ్చే అవకాశం ఉంది.
  • పని ఒత్తిడి, ఇళ్లు, ఆఫీస్ సమస్యలు, జీవనస్థితిగతులు, నిద్రలేమి, ఆహారంలో మార్పుల వల్ల కూడా జుట్టు తెల్లబడుతుంది.
  • విటమిన్ B-12 లేనప్పుడు జుట్టు కణాలకు రక్తం సరఫరా తగ్గిపోతుంది. దానివల్ల కూడా జుట్టు తెల్లబడే అవకాశాలు ఉన్నాయి.

జుట్టు సమస్యల దూరం కావాలంటే జాగ్రత్తలు, తినాల్సిన ఆహారం

  • క్యారెట్, నల్ల నువ్వులు, వాల్‌నట్స్, ఉసిరి, సాల్మన్ చేపలు, పుట్టగొడుగులు, మసూరి పప్పులు, చికెన్, ఆకుకూరలు ఎక్కువగా తినాలి.
  • మెంతులు, పెరుగు పేస్ట్ ను తలకు పెట్టాలి. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే ఫలితం కనిపిస్తుందని తెలిసింది.
  • మ‌నం తీసుకునే ఆహారంలో సొర‌కాయ చేర్చుకుంటే.... శ‌రీరానికి చ‌ల్లద‌నాన్ని ఇస్తుంది.
  • సొర‌కాయ‌ల‌తో జుట్టు రాల‌డాన్ని అరికట్టవ‌చ్చని నిపుణులు చెబుతున్నారు.
  • కొబ్బరి లేదా బాదం నూనెను వేడి చేసి జుట్టుకు మ‌ర్దనా చేసుకుంటే.....కుదుళ్లు గ‌ట్టిప‌డి జుట్టు రాల‌డం త‌గ్గుతుంది.
  • బ్రెయిన్ ఫుడ్ గా పిలిచే వాల్ నట్ జుట్టు పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇది మాడును ఆరోగ్యంగా ఉంచుతుంది.
  • పెరుగు, వాల్ నట్ పొడిని తలకు రాశాక.... 5 నిమిషాల తర్వాత షాంపూతో శుభ్రం చేసుకుంటే ఫలితం ఉంటుంది.
  • రోజూ వాల్‌నట్‌లను తింటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.