అవాంఛిత రోమాలను తొలగిస్తున్నారా..? ముడతలు వస్తాయేమో జాగ్రత్త

మనిషిని దేవుడు అంతా మంచిగానే డిజైన్‌ సెట్‌ చేశాడు, చక్కగా రెండు కళ్లూ, ముక్కు, రెండు చెవులు కాళ్లు అన్నీ ఇచ్చాడు. కానీ ఈ అవాంఛిత రోమాలు ఎందుకు అసలు.. అబ్బాయిలకు మీసాలు ఉంటే అందం.

అవాంఛిత రోమాలను తొలగిస్తున్నారా..? ముడతలు వస్తాయేమో జాగ్రత్త


మనిషిని దేవుడు అంతా మంచిగానే డిజైన్‌ సెట్‌ చేశాడు, చక్కగా రెండు కళ్లూ, ముక్కు, రెండు చెవులు కాళ్లు అన్నీ ఇచ్చాడు. కానీ ఈ అవాంఛిత రోమాలు ఎందుకు అసలు.. అబ్బాయిలకు మీసాలు ఉంటే అందం.. అదే మీసాలు అమ్మాయిలకు ఉంటే అందవిహీనం. ఫేషియల్, హెయిర్ రిమూవల్ వల్ల చర్మంపై కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. మహిళలకు ముఖంపై వెంట్రుకలు తొలగించడం వల్ల కలిగే నష్టాల గురించి తెలుసుకుందాం.

మహిళలకు ముఖం మీద వెంట్రుకలను తొలగించేందుకు వ్యాక్సింగ్, థ్రెడింగ్, షేవింగ్, లేజర్ ద్వారా జుట్టును తొలగిస్తారు. కాబట్టి జుట్టు తొలగింపునకు అనేక పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. ఫేషియల్ హెయిర్ రిమూవల్ అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. కృత్రిమ పద్దతిలో, యంత్రాలను ఉపయోగించి కాకుండా సహజమైన పద్దతిలో ముఖంపై వచ్చిన వెంట్రుకల్ని తొలగించడం వల్ల స్కిన్ పాడవదు. ముఖం మీద వెంట్రుకలను తొలగించేటప్పుడు మహిళలు ఎదుర్కొనే కొన్ని హానికరమైన దుష్ప్రభావాలు ఉన్నాయి.
చర్మం వెంట్రుకలు తొలగింపు తర్వాత చికాకు, అలెర్జీలు వస్తాయి. ముఖంపై వెంట్రుకలు తొలగించడం వల్ల కలిగే సాధారణ నష్టాలతో పాటు స్కీన్‌ మారిపోతుంది. అలాగే చర్మం బిగుతుగా ఉండదు. అనేక పద్ధతుల వల్ల చర్మంపై నుంచి జుట్టును తొలగిస్తారు. ఇలా చేయడం వల్ల స్కిన్ ఎర్రగా మారడం, చర్మంపై దురద వస్తుంది. దీంతో పాటు అసౌకర్యంగా ఉంటుంది. ముఖ్యంగా వ్యాక్సింగ్, థ్రెడింగ్ మంటను కలిగిస్తుంది. ఈ పద్దతిలో వెంట్రుకలు వేరు భాగం నుంచి తొలగిస్తారు. సున్నితమైన చర్మం ఉన్న స్త్రీలు దురద కూడా వస్తుంది.
చిరాకు, అలెర్జీల ప్రమాదాన్ని తగ్గించడానికి కొత్త హెయిర్ రిమూవల్ పద్ధతిని ప్రయత్నించే ముందు ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. ఇది చర్మం దెబ్బతినకుండా సహాయపడుతుంది. ఎక్కువ హెయిర్ రిమూవల్ చేస్తే చర్మం బిగుతుగా మారుతుంది. చర్మం బిగుతు పోతుంది. వెంట్రుకలు తీయడంతో అది మరింత పెరుగుతుంది. వెంట్రుకలు స్కిన్‌పై రాకుండా తిరిగి చర్మంలోకి పెరిగినప్పుడు ఇన్గ్రోన్ హెయిర్‌లు ఏర్పడతాయి. అసహ్యంగా ఉంటుంది. ఇది జుట్టు కుదుళ్లను అడ్డుకుంటుంది. హైపర్పిగ్మెంటేషన్ కారణం కావచ్చు. దీని వల్లే మొటిమలు, దురద వస్తాయి. 
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.