సైతల్యాసనం రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆసనం..

రోగనిరోధక శక్తి మనిషి ఎంత అవసరమో మనకు బాగా తెలుసు.. ఇమ్యునిటీ పవర్‌ పెంచుకోవడానికి మనం ప్రత్యేకంగా ఆహారాలు కూడా తింటుంటాం.. వైరస్‌ల హవా నడుస్తున్న ఈరోజుల్లో.. రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. మనం ఇన్‌ఫెక్షన్లు,

సైతల్యాసనం రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన ఆసనం..


రోగనిరోధక శక్తి మనిషి ఎంత అవసరమో మనకు బాగా తెలుసు.. ఇమ్యునిటీ పవర్‌ పెంచుకోవడానికి మనం ప్రత్యేకంగా ఆహారాలు కూడా తింటుంటాం.. వైరస్‌ల హవా నడుస్తున్న ఈరోజుల్లో.. రోగనిరోధక శక్తి ఎంత ఎక్కువగా ఉంటే.. మనం ఇన్‌ఫెక్షన్లు, వైరస్‌లు నుంచి అంత బాగా తప్పించుకోవచ్చు. ఒక చిన్న ఆసనం వేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చు అంటే మీరు నమ్మగలరా..? నిజం.. యోగాలో ఒక ఆసనం ఉంది. అది వేయడం వల్ల రోగనిరోధక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. ఆ ఆసనం పేరు సైతల్యాసనం. ఇది ఎలా వేయాలి, దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో చూద్దామా..!

రోగ నిరోధక శక్తిని పెంచే సైతల్యాసనం.. ఎలా వేయాలంటే..?


సైతల్యాసనం వేసే విధానం

ఎడమకాలును వెనక్కి మడిచి కుడిపాదాన్ని ఎడమతొడపై ఉంచి కూర్చోవాలి. శ్వాస తీసుకుంటూ, రెండు చేతుల్నీ పైకి తీసుకురావాలి. ఇప్పుడు చేతుల్ని చాపి నేల మీద ఉంచి.. శ్వాస వదులుతూ కుడిమోకాలి వైపు ముందుకు వంగాలి. గడ్డాన్ని కుడి మోకాలికి ఆనించే ప్రయత్నం చేయాలి. ఇలా 5 సెకన్ల పాటు ఉన్నాక, తిరిగి శ్వాస తీసుకుంటూ పైకి రావాలి. మళ్లీ శ్వాస వదులుతూ ముందుకు వంగాలి. ఇలా కుడివైపు ఆరు సార్లు చేయాలి. ఇదే విధంగా ఎడమ వైపు ఆరు సార్లు చేయాలి.

సైతల్యాసనం వేయడం వల్ల కలిగే లాభాలు


ఈ ఆసనం వేయడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా మారుతుంది.

శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. బీపీ తగ్గుతుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సీజనల్‌ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు. ఇన్ఫెక్షన్లను నివారించవచ్చు.

వెన్ను నొప్పి తగ్గుతుంది. వెన్ను దృఢంగా మారుతుంది. తొండ కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.

నాడీ మండల వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.

పొట్ట దగ్గర ఉండే కొవ్వు కరుగుతుంది. పొట్ట కండరాలు దృఢంగా మారుతాయి.

ఈ ఆసనం వేయడం చాలా తేలిక.. కాబట్టి.. ఎవరైనా ఈజీగా వేయొచ్చు. నిత్యం కంప్యూటర్ల ముందు కుర్చోనే వాళ్లు డైలీ ఈ ఆసనం వేయడం వల్ల మీకు వెన్నునొప్పి ఉండదు. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.