ఈ వ్యాయమంతో ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి.. చేయడం చాలా సులువు..! 

మీరు మరీ బయట ఆహారాలు తింటుంటే.. ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. Lungs  దెబ్బతింటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు.

ఈ వ్యాయమంతో ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి.. చేయడం చాలా సులువు..! 
Breathing Exercise for Healthy lungs


మనం ఎంత ఇంట్లో చేసిన ఆహారం తింటున్నా.. మన ఆరోగ్యం దెబ్బతింటూనే ఉంటుంది. ఎందుకంటే.. మీరు వాడే పదర్థాలు అన్నీ ఇంట్లో మీరు సొంతంగా చేసినవి కాదు.. బయట నుంచి తెచ్చినవే.. ఎరువులు, పురుగుమందులు, విషపదర్థాలు ఎన్నో ఉంటాయి.. నిత్యం మన శరీరం వాటిని క్లీన్‌ చేసుకుని తిన్న ఆహారంలో పోషకాలు ఎక్కడ ఉన్నాయా అని వెతుకుంటూనే ఉంటుంది. వీటికి తోడు.. మీరు మరీ బయట ఆహారాలు తింటుంటే.. ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. Lungs  దెబ్బతింటాయి. దీంతో శ్వాసకోశ సమస్యలు వస్తాయి. అయితే కింద తెలిపిన సులభమైన శ్వాస వ్యాయామం చేయడం వల్ల ఊపిరితిత్తులను శుభ్రం చేసుకోవచ్చు. మరి ఆ వ్యాయామాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందామా..!

పిరితిత్తులను శుభ్రం చేసే శ్వాస వ్యాయామం.. రోజూ చేస్తే ఊపిరితిత్తులు క్లీన్‌ అవుతాయి..!

  •  నేలపై వెల్లకిలా పడుకోవాలి.
  •  రెండు అర చేతులను తెచ్చి పొట్టపై పెట్టాలి.
  •  కళ్లు మూసుకుని రెండు నాసికా రంధ్రాల ద్వారా శ్వాసను పీలుస్తూ 5 వరకు లెక్కబెట్టాలి.
  •  రెండు సెకన్ల పాటు శ్వాసను బిగపట్టి ఉంచాలి. తరువాత శ్వాసను నెమ్మదిగా వదులుతూ మళ్లీ 5 వరకు లెక్కించాలి.

ఈ వ్యాయామాన్ని ఉదయాన్నే పరగడుపునే కనీసం 10 సార్లు చేయాలి.

దీన్ని అవసరం అనుకుంటే ఉదయం, సాయంత్రం కూడా చేయవచ్చు. ఈ వ్యాయామం చేయడం వల్ల శ్వాస కోశ సమస్యలు తగ్గుతాయి. ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ఊపిరితిత్తుల్లో ఉండే వ్యర్థాలు బయటకు పోయి ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి. దీన్ని చేయడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు.. కేవలం సమయాన్ని పెట్టాలి అంతే..!

ఈ జాగ్రత్తలు కూడా..!

  • అతి మధురం చూర్ణాన్ని అర టీస్పూన్‌ మోతాదులో రోజూ రాత్రి ఒక గ్లాస్‌ గోరు వెచ్చని పాలలో కలిపి తీసుకోవడం వల్ల కూడా ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.
  • ఉదయం పరగడుపునే రెండు టీస్పూన్ల అల్లం రసం సేవిస్తున్నా ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి.
  • పుదీనా ఆకులను నీళ్లలో వేసి మరిగించి రోజూ ఆ నీటిని తాగుతుంటే ఊపిరితిత్తులు శుభ్రమవుతాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.