కలబంద గుజ్జుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఇంట్లో ఉంటే ఈ సమస్యలు మాయం..! 

కలబంద అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుతో అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. కల‌బంద గుజ్జులో ఆరోగ్యకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. కలబంద చర్మ గాయాలకు చికిత్స

కలబంద గుజ్జుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో.. ఇంట్లో ఉంటే ఈ సమస్యలు మాయం..! 


కలబంద అందానికే కాదు.. ఆరోగ్యానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. కలబంద గుజ్జుతో అనేక రకాల రోగాలను నయం చేసుకోవచ్చు. కల‌బంద గుజ్జులో ఆరోగ్యకరమైన మొక్కల సమ్మేళనాలు ఉంటాయి. కలబంద చర్మ గాయాలకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది. సౌందర్య, ఔషధ, ఆహార పరిశ్రమలు కలబందను విస్తృతంగా ఉపయోగిస్తున్నాయి.

ఔషధ గుణాల కలబంద.. దీంతో ఏయే అనారోగ్యాలు తగ్గుతాయంటే..?

కల‌బంద గుజ్జులో విటమిన్లు, ఖనిజాలు, అమైనో ఆమ్లాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందువ‌ల్ల ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను అందిస్తుంది. కల‌బంద గుజ్జు బయోయాక్టివ్ సమ్మేళనాలను కలిగి ఉంటుంది.

కల‌బంద గుజ్జు యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి..కల‌బంద గుజ్జులో పాలీఫెనాల్స్ అని పిలువబడే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్ఫెక్షన్లకు కారణమయ్యే బాక్టీరియా పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి.

కల‌బంద గుజ్జులో యాంటీ బాక్టీరియల్, యాంటీ వైరల్, క్రిమినాశక లక్షణాలు ఉంటాయి.. అందువ‌ల్ల ఆ గుజ్జును రాస్తే గాయాలు, పుండ్లు త‌గ్గుతాయి. చ‌ర్మ స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. మొటిమ‌లు, మ‌చ్చ‌లు ఉండ‌వు. చ‌ర్మం కాంతివంతంగా మారుతుంది. ప‌లు ఫేస్ ప్యాక్‌ల‌లోనూ కల‌బంద గుజ్జును ఉప‌యోగిస్తారు.

కల‌బంద గుజ్జు చ‌ర్మంపై ఏర్ప‌డే దుర‌ద‌లు, ఎరుపుద‌నం, ఇన్ఫెక్షన్లను త‌గ్గిస్తుంది. ఇది దంత క్షయం, చిగుళ్ళ వ్యాధుల‌ను త‌గ్గిస్తుంది. అందుకు గాను క‌ల‌బంద గుజ్జును నీటిలో పోసి బాగా క‌లిపి ఆ మిశ్ర‌మంతో నోటిని పుక్కిలించాలి. దీంతో నోట్లోని బాక్టీరియా న‌శించి నోటి దుర్వాస‌న త‌గ్గుతుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. 

కల‌బంద గుజ్జులో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్ ల‌క్ష‌ణాల వ‌ల్లే దీన్ని అనేక మౌత్ వాష్‌ల త‌యారీలోనూ ఉప‌యోగిస్తారు.

నోట్లో పుండ్లు, పొక్కులు, పూత‌లు ఉన్న‌వారు క‌ల‌బంద గుజ్జును నీటిలో క‌లిపి పుక్కిలిస్తుంటే ఆయా స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

క‌ల‌బంద ర‌సాన్ని రోజూ ప‌ర‌గ‌డుపున 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే జీర్ణ స‌మ‌స్య‌లు ఉండవు. ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ద‌కం త‌గ్గుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపులోకి వ‌స్తాయి.

కలబంద గుజ్జు మంచిదే అయినప్పటికీ ఇది తాగడం వల్ల మీకు ఏదైనా అసౌకర్యంగా అనిపిస్తే తాగకండి..! మీకు కలబంద గుజ్జు పడకపోతే వదిలేయండి.!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.