Varicose veins : కాళ్లలో ఉబ్బిన సిరలు అవే తగ్గుతాయిలే అని వదిలేస్తున్నారా.. నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త సుమా..!

Varicose veins : సాధారణ పరిణామాలు ఒక రకంగా ఉంటే పరిస్థితి ఇబ్బందిగా మారినప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సాధారణ స్థితిలో కాళ్ళ పిక్కల భాగంలో నొప్పిగా ఉంటుంది ఈ నొప్పి రాత్రి సమయంలో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆకుపచ్చ, నీలి రంగులో సిరలు పైకి ఉబ్బి కనిపిస్తాయి.

Varicose veins : కాళ్లలో ఉబ్బిన సిరలు అవే తగ్గుతాయిలే అని వదిలేస్తున్నారా.. నడవలేని పరిస్థితి ఏర్పడుతుంది జాగ్రత్త సుమా..!
Swollen veins in the legs


Varicose veins లేదా ఉబ్బిన సిరలు ఇవి నరాలకు సంబంధించిన వ్యాధి.. రక్త నాళాలు లావుగా ఉబ్బిపోయి ఉండటాన్ని Varicose veins  అంటారు.. ఈ వ్యాధి సిరలపైన ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా దీనికి గల ప్రధాన కారణాలు రక్తనాళాల లోపల కవాటాల్లో ఇబ్బందులు ఏర్పడటం వల్ల రక్తం మళ్లీ తిరిగి వెనక్కి వస్తుంది. ఈ సందర్భంలోనే రక్తనాళాలు ఉబ్బిపోయి ఇబ్బంది కలిగిస్తాయి..

వెరికోస్ వెయిన్స్ సాధారణ పరిణామాలు ఒక రకంగా ఉంటే పరిస్థితి ఇబ్బందిగా మారినప్పుడు మరికొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా సాధారణ స్థితిలో కాళ్ళ పిక్కల భాగంలో నొప్పిగా ఉంటుంది ఈ నొప్పి రాత్రి సమయంలో మరింత ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. ఆకుపచ్చ, నీలి రంగులో సిరలు పైకి ఉబ్బి కనిపిస్తాయి. కాలు భాగం వాపుకు గురయ్యి నల్లగా మారుతుంది. 

కొన్ని సార్లు దురదగా అనిపించి మంట పుడుతుంది. అలాగే పాదాలు, యాంకిల్ భాగంలో వాపులు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ పరిస్థితిలో తగ్గుతుంది లే అంటూ అజాగ్రత్త చూపిస్తే పరిణామాలు మాత్రం విపరీత స్థాయికి చేరే అవకాశం ఉంటుంది. అందుకే వెరికోసమే విషయంలో ఎలాంటి అజాగ్రత్త పనికిరాదు..

ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నా అజాగ్రత్త వహిస్తే నొప్పి, వాపు విపరీతంగా పెరిగిపోతాయి. నడవలేని పరిస్థితి సైతం ఏర్పడుతుంది. చర్మంలో వాపు, దురద ఎక్కువయ్యి చర్మ సంబంధిత సమస్యలు వస్తాయి. ఎగ్జిమా, తామర సైతం వచ్చే అవకాశం ఉంది. కాళ్ళ భాగంలో పుండ్లు ఏర్పడి అవి మానకుండా ఇబ్బంది పెడతాయి. అల్సర్లు కూడా ఏర్పడే అవకాశం ఉంది. రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి సైతం ఏర్పడుతుంది. అందుకే ఈ వ్యాధిని ఎట్టి పరిస్థితుల్లోనూ అజాగ్రత్త చేయకుండా వైద్యుని సలహా మేరకు చికిత్స తీసుకుంటూ ఉండాలి. అలాగే రాత్రి సమయంలో పడుకునేటప్పుడు కాళ్ళను దిండుపైన ఉంచుకొని రక్త సరఫరా సక్రమంగా జరిగేటట్టు చూసుకోవాలి. సాగే సాక్సులను వేసుకుని నెమ్మదిగా నడవడం అలవాటు చేసుకోవాలి. అవసరమైతే లేజర్ చికిత్స సైతం వైద్యుని సలహా మేరకు తీసుకోవడం వల్ల పరిస్థితి అదుపులో ఉంటుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.