Body swelling : నిద్ర లేవగానే శరీరంలో వాపులు కనిపిస్తున్నాయా.. ఈ ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నట్టే!

Body swelling : ఉదయం నిద్ర లేవగానే కొందరికి ముఖం వాపుగా అనిపిస్తుంది. కొందరు రాత్రి నిద్ర లేదా అంటే మరి కొంతమంది నిద్ర ఎక్కువ అయ్యిందా అంటూ ఉంటారు.

Body swelling : నిద్ర లేవగానే శరీరంలో వాపులు కనిపిస్తున్నాయా.. ఈ ఆరోగ్య సమస్యలు మొదలవుతున్నట్టే!
swelling symptoms causes treatment


Body swelling : ఉదయం నిద్ర లేవగానే కొందరికి ముఖం వాపుగా అనిపిస్తుంది. కొందరు రాత్రి నిద్ర లేదా అంటే మరి కొంతమంది నిద్ర ఎక్కువ అయ్యిందా అంటూ ఉంటారు. అయితే వాపు ఏదైనా ప్రతిసారి అజాగ్రత్త చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు వైద్యులు.

శరీరంలో వాపు ఏదైనా ప్రమాదకరమే. కొందరిలో ముఖంలో వాపు కనిపిస్తే మరికొందరిలో కాళ్లు, చేతులు వాపులకు గురవుతాయి. మరికొందరిలో పొట్ట భాగంలో ఈ వాపు కనిపిస్తుంది. దెబ్బలు తగిలిన సమయంలో కనిపించే వాపు వేరు సాధారణంగా ఎప్పటికప్పుడు కనిపించే వాపు వేరుగా గుర్తించాల్సిన అవసరం ఉంది.

కొన్ని రకాల వాపులు ఎర్రగా ఉండి వేడిగా నొప్పి కలిగిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు దాని చుట్టూ చీము వంటివి చేరుతూ ఉంటాయి. మరి కొన్నిసార్లు నొప్పి లేకుండా చల్లగా ఉంటూనే ఏ రంగు లేకుండా ఉంటుంది. ఇవన్నీ దేనికి దానికి ప్రత్యేకమైన వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి.

కొన్నిసార్లు నొప్పి నెమ్మదిగా మొదలై క్రమంగా పెరుగుతూ ఉంటుంది. మరి కొన్నిసార్లు నొప్పి లేకుండా వాపు మాత్రమే కనిపిస్తుంది.

ముఖ్యంగా శరీరంలో వాపులు కనబడటానికి ఎక్కువ కారణం మూత్రపిండాలకు సంబంధించిన ఏవైనా సమస్యలు మొదలవటం. కొందరు మలమూత్రాలని అదిమిపెట్టే అలవాటు ఉంటుంది. ఇది ప్రతిసారి కొనసాగుతూ ఉంటే కచ్చితంగా మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ప్రసవం అనంతరం స్త్రీలు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే కూడా ఇలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అజీర్ణం, కడుపుకు సంబంధించిన సమస్యలు కలిగినప్పుడు కూడా ఇలాగే జరుగుతుంది. అలాగే కడుపు ఉబ్బరంగా అనిపించినప్పుడు, శరీరంలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు సెక్స్ జరపడం వల్ల కూడా ఇలా జరగవచ్చు. గుండె, మూత్రపిండాలు, లివర్ వంటి అవయవాల్లో ఏవైనా దీర్ఘకాలం సమస్యలు ఉంటే శరీరంలో వాపులు కనిపించే అవకాశం ఉంది.

మరి కొన్నిసార్లు వాపు ఉన్నచోట మెత్తగా ఉండి లోపల ద్రవం అటు ఇటు కదులుతున్నట్టు అనిపిస్తుంది. పైన చెయ్యి పెడితే వేడిగా తగులుతూ నొప్పిగా ఉండి కిందకి వంచితే నొప్పి అధికమవుతుంది. ఇలాంటి సమయంలో లోపల చీము చేరుతుందేమో చూసుకోవాలి. మరి కొన్నిసార్లు రోజు రోజుకీ కొద్ది కొద్దిగా పెరుగుతూ చల్లగా ఉండి ఏ రంగు లేకుండా సాధారణంగా ఉండే నొక్కితే సొట్టపడుతుంటే నీరు చేరుతున్నట్టు గుర్తించాలి.

మరికొన్నిసార్లు ఊపిరితిత్తుల్లో కూడా వాపు వస్తూ ఉంటుంది. తలలో వాపు కూడా వచ్చే అవకాశం ఉంది. కంటి పై భాగంలో వాపు, మూత్రపిండాల వాపు కూడా వస్తూ ఉంటాయి. ఇంకొన్నిసార్లు సమస్య తీవ్రతరమై గుండెవల్ల వాపు వచ్చే అవకాశం ఉంది.. ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే కాళ్ళ కింద వాపు కనిపిస్తే మూత్రపిండాలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయేమో పరీక్ష చేయించుకోవాలి.

ఇలాంటి వారు ముఖ్యంగా పోషకాహారం తీసుకుంటూ కారం వస్తువులను తగ్గించాలి. ఉప్పుని అధికంగా తీసుకోకూడదు. వాపు ఏదైనా ఆ జాగ్రత్త చేయకపోవడం మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.