Excercise : వ్యాయామం కూడా వ్యసనం లాంటిదే....బయటపడేదెలా?

మరికొందరు ఆరోగ్యంగా, ఫిట్‎గా ఉండాలని వ్యాయామాలు చేస్తారు. నాజుగ్గా ఉండాలంటే ఆ మాత్రం కసరత్తులు కావాలి మరి. అయితే Excercise  కూడా వ్యసనం లాంటిదే. కొందరు అదే పనిగా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అప్పుడే దాని పర్యావసనాలెంటో తెలుస్తాయి.

Excercise   : వ్యాయామం కూడా వ్యసనం లాంటిదే....బయటపడేదెలా?
Excercise


అతి మితిమీరితే అదోగతే. ఇది అందరికీ తెలిసిన జీవిత సత్యం.

ఆరోగ్యం కోసం ఎన్ని డైట్ లు పాటించినా....ఎన్ని వర్క్ అవుట్స్ చేసినా.... దానికంటూ కొన్ని హద్దులు ఉంటాయి. తొందరగా తగ్గిపోవాలని కొందరు ఆహారం తినడం మానేస్తారు. కొందరు ద్రవపదార్థాలు మాత్రమే తీసుకుంటారు. మరికొందరు టిఫిన్స్, ఫ్రూట్స్ తో సరిపెట్టేస్తారు.

మరికొందరు ఆరోగ్యంగా, ఫిట్‎గా ఉండాలని వ్యాయామాలు చేస్తారు. నాజుగ్గా ఉండాలంటే ఆ మాత్రం కసరత్తులు కావాలి మరి. అయితే Excercise  కూడా వ్యసనం లాంటిదే. కొందరు అదే పనిగా వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. అప్పుడే దాని పర్యావసనాలెంటో తెలుస్తాయి.

ఏదైనా ఒక పనిచేసినప్పుడు ఉపయోగకరంగా ఉండాలి. అంతేతప్ప దానివల్ల మనం నష్టపోకూడదు. వ్యాయామం కూడా అంతే. వ్యాయామాలు అతిగా చేయడం వల్ల మనలో శక్తి నెమ్మదిగా తగ్గిపోతుంది. మనం తినే ఆహారానికి, చేసే పనిని బట్టి కసరత్తులు చేయాలి.

క్రీడాకారులు, నటీనటులు రోజు వ్యాయామాలు చేస్తూనే ఉంటారు. కాకపోతే వాళ్లు మంచి డైట్ పాటిస్తుంటారు. కాబట్టి వాళ్లకు ప్రమాదమేమి ఉండదు. వచ్చిన సమస్యల్లా ఏంటంటే. ఆఫీస్ కు వెళ్లేవాళ్లు, ఇంట్లో ఉండే వాళ్లు.....కొంచెం తిన్నా లావెక్కి పోతారు. దానివల్ల స్నేహితుల వెక్కిరింపులు, చుట్టాల ఎగతాళి మాటలకు ఫీలవుతుంటాం. మనమీద మనకే తెలియని ఆత్మన్యూనత భావానికి గురవుతాం. అలాంటప్పుడే త్వరగా సన్నగా అయిపోవాలనే భావనకు వచ్చేస్తాం. దానివల్ల అతి వ్యాయామాలు చేసేస్తాం. అది కూడా ఒక మానసిక రుగ్మతగా చెప్పవచ్చు. ఇది చాలా ప్రమాదమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొందరు ఇంట్లోనే ఉండటం వల్ల చాలా ఒత్తిళ్లకు లోనవుతుంటాం, వ్యాయామాలు చేస్తే దాని నుంచి బయటపడతామని అనుకుంటాం. అలా అదొక వ్యసనంగా మారిపోతుంది.

కొంతమంది ఒక్కరోజూ వ్యాయామం చేయకపోయినా ఏదో కోల్పోయామనే భావనకు వచ్చేస్తారు. వ్యాయామం అధికమైతే వేరే విషయాలపై దృష్టి పెట్టలేరు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు వ్యాయామాలు మంచిదికాదని వైద్యులు చెబుతున్నారు.

వ్యాయామం అనే వ్యసనానికి బానిసైన వాళ్లు త్వరగా బయటపడాలి. లేదంటే అనారోగ్యం బారిన పడక తప్పదని హెచ్చరిస్తున్నారు నిపుణులు.

కచ్చితంగా వ్యాయామ సమయాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి.

క్రమశిక్షణా విధానం చాలా అలవర్చుకోవాలి

అనవసరపు ఆలోచనలు మానుకోవాలి అన్ని సమస్యలకు ఓపిక, సహనం తప్పనిసరి

ఏమైనా సమస్యలుంటే వైద్యులను సంప్రదించి మందులు వాడాలి, వ్యాయామం కూడా చేయాలని చెప్తే.....ఎంత సమయం చేయాలి, ఎలా చేయాలో కనుక్కోండి. సొంత నిర్ణయాలు అసలు పనికిరాదు

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.