Cholesterol : కొలెస్ట్రాల్ పెరగకుండా కడుపు నింపుకోవాలా.. ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే

Cholesterol అన్ని విధాల చెడే చేస్తుందని చెప్పలేము. మంచి Cholesterol కూడా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి ఇది ఎంతో అవసరం. కానీ చెడు కొలస్ట్రాలు శరీరంలో పెరిగితేనే పలు సమస్యలకు దారితీస్తుంది.

Cholesterol : కొలెస్ట్రాల్ పెరగకుండా కడుపు నింపుకోవాలా.. ఈ ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే
Best food without cholesterol


శరీరంలో cholesterol పెరిగిపోతే ఎన్నో సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా ఈ రోజుల్లో వచ్చే చాలా heart problems కు కారణం కొలెస్ట్రాల్. కేవలం గుండెను మాత్రమే కాకుండా పలు అవయవాలని దెబ్బతీసే శక్తి కొలెస్ట్రాల్ కి ఉంటుంది. దీని అదుపు చేయాలంటే మంచి ఆహారపు అలవాట్లు తో మాత్రమే సాధ్యం.

కొలెస్ట్రాల్ ను అదుపు చేయాలంటే కచ్చితంగా కొన్ని రకాల ఆహార పదార్థాలు మానేయాలి. మరికొన్ని ఆహార పదార్థాలు తీసుకోవాలి. అయితే కొలెస్ట్రాల్ అన్ని విధాల చెడే చేస్తుందని చెప్పలేము. మంచి కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది. ఆరోగ్యవంతమైన శరీరానికి ఇది ఎంతో అవసరం. కానీ చెడు కొలస్ట్రాలు శరీరంలో పెరిగితేనే పలు సమస్యలకు దారితీస్తుంది.

కొలెస్ట్రాలను పెంచే పదార్థాలలో నూనె పదార్థాలు, తీపి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే బయట దొరికే ఆహార పదార్థాలు, వేపుళ్ళు వంటి వాటిని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుంది. జీడిపప్పును తగిన మోతాదులో కాకుండా ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ విపరీతంగా పెరిగిపోయి సమస్య ఉంటుంది.

మాంసాహారాన్ని అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం కొలెస్ట్రాల్ పెరగడానికి కారణాలు. కొన్నిసార్లు ఇది వంశపారపర్యంగా కూడా వస్తూ ఉంటుంది.

అలాగే పాల సంబంధిత పదార్థాలు కొలెస్ట్రాలను పెంచుతాయి. మిగడా, పాలు, పెరుగు, వెన్న వంటివి కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణం. బయట దొరికే చాక్లెట్లు, బిస్కెట్లు కూడా వీటిని పెంచుతాయి. అందుకే వీటన్నిటికీ కచ్చితంగా దూరంగా ఉండాలి. నూనె ఉపయోగించి చేసే వేపుళ్ళు నిల్వ ఉంచిన పదార్థాలు తీసుకోవడం మానేయాలి.

కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచుకోవాలి అంటే పీచు పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. చిక్కుడు జాతికి చెందిన అన్ని రకాల కాయగూరలను తీసుకోవాలి. గోరుచిక్కుళ్ళు, చిక్కుళ్ళు, పందిరి చిక్కుళ్ళు వంటివి చాలా మేలు చేస్తాయి. తోటకూర, ఆకుకూరలు తీసుకోవాలి. బియ్యాన్ని వాడినప్పుడు ఎర్ర బియ్యం వాడటం మంచిది. అలాగే గోధుమ రొట్టె, బార్లీ కూడా మేలు చేస్తాయి. వెల్లుల్లిని రోజు ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. ఉల్లి కూడా ఇదే మేలు చేస్తుంది.

ఉసిరి, మిరియాలు వంటివి తీసుకోవాలి. సి విటమిన్ అధికంగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ కరిగిపోతుంది. నిమ్మ కూడా కొలెస్ట్రాల్ ను కరిగించే ఆహారంలో ముందు ఉంటుంది. రోజు ఉదయాన్నే పరగడుపున గోరువెచ్చని నీళ్లలో నిమ్మకాయ కలుపుకొని తాగడం వల్ల శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వు కరిగిపోతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.