కొంతమంది పీజీలు చేసి ఉద్యోగాలు చేస్తున్నా.. వారిని కొత్తవారు చూస్తే.. ఏ క్లాస్ అంటారు.. అంత యవ్వనంగా ఉంటారు. ఇంకొంత మంది ఉంటారు.. డిగ్రీ, బీటెక్‌లే చదువుతారు.. కానీ ఏజ్‌డ్ లుక్‌లో కనిపిస్తారు. మీరు మీ వయసుకంటే చాలా పెద్దవారిలా కనిపిస్తున్నారంటే.. మీలో పోషకాహార లోపం గట్టిగా ఉంది. సరైన లైఫ్‌స్టైల్‌ను మీరు పాటించడం లేదు, సరైన తిండి తినడం లేదని అర్థం. ఎప్పుడు యవ్వనంగా కనిపించాలంటే.. మీరు ఈ ఫ్రూట్స్‌ను తింటే చాలు. ఇవేం అరుదైనవి కాదు. అలా అని ఖరీదైనవి అంతకంటే కాదు. ఇంతకీ ఆ పండ్లు ఏంటో చూద్దామా..!
నారింజ తరచూ తింటూ ఉంటుంటే ఎన్నో ఫలితాలను పొందవచ్చు. మంచి ఆరోగ్యంతో పాటు చర్మం మెరిసేలా చేస్తుంది. నారింజాను తిన్న అనంతరం మిగిలిపోయిన తొక్కలను ముఖం మీద అప్లై చేసినా, లేక వాటిని ఎండ బెట్టి ఫేస్ ప్యాక్‌లలో ఉపయోగించినా.. అది మీ చర్మాన్ని ప్రకాశవంతంగా చేస్తుంది.
యాపిల్- యాపిల్స్ లో ఉండే విటమిన్ ఏ, సీలతో పాటు యాంటీ యాక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్ మీ చర్మానికి రక్షణ ఇస్తుంది.
పుచ్చకాయ : మంచి టేస్ట్‌తో పాటు దాదాపు 92 శాతం నీరు ఉంటుంది. పుచ్చ కాయలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాకుండా ఇందులోని విటమిన్ సీ, ఏ, బీ1 చర్మానికి కాంతిని చేకుర్చుతాయి. వయసుతో పాటు చర్మంపై వచ్చే ముడతలకు చెక్ పెట్టి యవ్వనంగా కనబడేలా చేస్తుంది.
నిమ్మకాయ : నిమ్మకాయలు కూడా చర్మానికి ఎంతగానో ఉపయోగపడతాయి. నిమ్మను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది. అంతేకాకుండా వీటి ద్వారా చర్మం డీహైడ్రేట్‌కు గురికాకుండా ఉంటుంది. నిమ్మరసాన్ని జ్యూస్‌గా తాగడంతో పాటు దాన్ని ముఖానికి అప్లై చేసుకుంటే మెటిమలు, మచ్చలు తగ్గుతాయి.
కీర దోసకాయ- ఇక ఇదైతే చర్మానికి చాలా మంచిది. పైగా బ్యూటీ టిప్స్‌లో తెగ వాడతారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్‌లు, విటమిన్ సీ, కేలు చర్మం ప్రకాశవంతంగా మెరవడానికి దోహదపడతాయి. కళ్ళ కింద ఏర్పడిన నల్లటి బ్లాక్ సర్కిళ్లను తొలగించడానికి ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి. డైలీ ఒక కీరాదోసకాయను తింటూ.. ఫేస్‌కు జస్ట్ ఒక ముక్క కట్ చేసి స్లోగా మసాజ్ చేసుకుని కొద్దిసేపటికీ క్లీన్ చేసుకోండి చాలు. మంచి ఫలితం ఉంటుంది.