తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి ఉన్న పిల్లలకు వచ్చే వ్యాధి తల సేమియా.. మరి ఈ వ్యాధితో ప్రెగ్నెన్సీ లో ఎలా జాగ్రత్త పడాలంటే!

మానవ శరీరం కాలానికి తగ్గట్టు మార్పుకు లోనవుతూ ఉంటుంది. మన శరీరంలో శీతాకాలం అనుసరించి కొన్ని మార్పులు, వేసవికాలం అనుసరించి మరికొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శీతాకాలంలో జలుబు దగ్గు వంటి

తల్లిదండ్రుల్లో ఏ ఒక్కరికి ఉన్న పిల్లలకు వచ్చే వ్యాధి తల సేమియా.. మరి ఈ వ్యాధితో ప్రెగ్నెన్సీ లో ఎలా జాగ్రత్త పడాలంటే!


మానవ శరీరం కాలానికి తగ్గట్టు మార్పుకు లోనవుతూ ఉంటుంది. మన శరీరంలో శీతాకాలం అనుసరించి కొన్ని మార్పులు, వేసవికాలం అనుసరించి మరికొన్ని మార్పులు సంభవిస్తూ ఉంటాయి. శీతాకాలంలో జలుబు దగ్గు వంటి సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అదే విధంగా వేసవికాలంలో పలు రకాల సమస్యలతో మానవ శరీరం ఇబ్బంది పడుతూ ఉంటుంది.

ముఖ్యంగా ఈ రోజుల్లో ఈ వ్యాధుల నుండి రక్షణకు మానవుడు చాలావరకు ఔషధాలను, టీకాలను కనుగొన్నాడు. కొన్ని రకాల వ్యాధులు సర్వసాధారణంగా కాలానికి తగ్గట్టు సంభవించగా మరికొన్ని వ్యాధులు అంటువ్యాధుల ద్వారా సంభవిస్తూ ఉంటాయి. వీటిని సులభంగానే మనిషి ఎదుర్కొంటున్నాడు. వీటితో పాటుగా జన్యు పరంగా వచ్చే సమస్యలు కూడా శరీరానికి సంభవిస్తూ ఉంటాయి.

ఈ విధంగా జన్యుపరంగా సంభవించే వ్యాధులలో తల సేమియా ఒకటి. ఇది సర్వసాధారణంగా తల్లిదండ్రుల నుంచి పిల్లలకు సంక్రమిస్తూ ఉంటుంది. శరీరంలో తగినంత హీమోగ్లోబిన్ ఉత్పత్తి కాకపోతే వచ్చే సమస్య తలసీమియా. ఇది కొన్ని సందర్భాలలో ప్రెగ్నెన్సీని ప్రభావితం చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రుల్లో ఒక్కరికి ఉన్నప్పటికీ వారి పిల్లలకు కూడా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

రక్తహీనత కలగడం, పుట్టే పిల్లలు తక్కువ బరువుతో పుట్టడం వంటివి సంభవిస్తూ ఉంటాయి. కానీ తల సేమియా కంట్రోల్ చేయగలిగిన వ్యాధి..  రక్త మార్పిడి, సరైన ట్రీట్మెంట్ తీసుకోవడం వలన పిల్లలకు కలగకుండా చూసుకోవచ్చని ఈ విషయమై తల్లిదండ్రులు అత్యంత జాగ్రత్త వహిస్తూ ముందుకు సాగాలని నిపుణులు వారికి సలహా ఇస్తున్నారు.

అయితే ప్రెగ్నెన్సీ సమయంలోనే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల తల సేమియా వ్యాధి పిల్లలకు రాకుండా జాగ్రత్త పడవచ్చు అవి ఏంటంటే..

తల సేమియా ఉన్నవారికి గర్భధారణ సమయంలో తరచూ బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉంటారు. ఈ సమయంలోనే రక్తంలో ఐరన్ స్థాయిలను కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఈ మేరకు వైద్యులు తగినంత చికిత్స అందిస్తారు.

అలాగే తల్లిదండ్రుల ఏ ఒక్కరికి తల సేమియా వ్యాధి ఉన్న పిల్లలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో ముందుగానే జాగ్రత్త పడాలి. ఈ విషయాన్ని పూర్తిగా డాక్టర్కు తెలియజేయాలి లేదంటే పుట్టే బిడ్డ పెను ప్రమాదాన్ని ఎదుర్కొనే అవకాశం ఉండటంతో పాటు గర్భధారణ అత్యంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.