Ayurveda Tips : అమృతకాడ మొక్క నిజంగా అమృతమే.. ఈ సమస్యలన్నీ మాయం..!

Ayurveda Tips : ఈ మధ్య గార్డెనింగ్‌ మీద ప్రజలకు ఆసక్తి ఎక్కువైంది.. చుట్టు పచ్చదనం కోరుకుంటున్నారు. ఇంట్లో కూడా గ్రీన్‌ కలర్‌ ఎక్కువగా ఉండేలా ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించుకుంటున్నారు. వాల్స్‌కు గ్రీన్‌ మ్యాట్‌, చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడం మీరు చూసే ఉంటారు. ఇక కాస్త స్థలం ఎక్కువగా ఉంటే.

Ayurveda Tips : అమృతకాడ మొక్క నిజంగా అమృతమే.. ఈ సమస్యలన్నీ మాయం..!


Ayurveda Tips : ఈ మధ్య గార్డెనింగ్‌ మీద ప్రజలకు ఆసక్తి ఎక్కువైంది.. చుట్టు పచ్చదనం కోరుకుంటున్నారు. ఇంట్లో కూడా గ్రీన్‌ కలర్‌ ఎక్కువగా ఉండేలా ఇంటీరియర్‌ డిజైన్‌ చేయించుకుంటున్నారు. వాల్స్‌కు గ్రీన్‌ మ్యాట్‌, చిన్న చిన్న మొక్కలు పెంచుకోవడం మీరు చూసే ఉంటారు. ఇక కాస్త స్థలం ఎక్కువగా ఉంటే..రకరకాల మొక్కలు తెచ్చి పెంచుకుంటారు. ఆ మొక్కలతో పాటు కొన్ని కలుపు మొక్కలు ఆటోమెటిగ్‌గా వచ్చేస్తాయి..అందులో ఒకటి కాడ మొక్క.. దీన్ని మీరు చూసే ఉంటారు. ఇది పొలాల్లో కూడా విపరీతంగా ఉంటుంది. కలుపు మొక్కగా భావించి మనం పీకేస్తాం. ఈ మొక్క‌లో ఉండే ఔష‌ధ గుణాలు అన్నీ ఇన్నీ కావు. దీనిని వెన్న దేవి, నీరు క‌సు, అమృతకాడ అని కూడా అంటారు. ఆసియా, ఆఫ్రికా దేశాల‌లో ఈ మొక్క ఎక్కువ‌గా కనిపిస్తుంది. ఈ మొక్క ఆకుల‌ను కూర‌గా వండుకుని తింటారు. ఇలా కూర‌గా వండుకుని తిన‌డం వల్ల మనం అనేక ర‌కాల అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ప‌శువులు కూడా ఈ మొక్క‌ను ఎంతో ఇష్టంగా తింటాయి.

అమృతకాడ మొక్క వల్ల లాభాలు..

దీనిని తిన‌డం వ‌ల్ల పశువుల్లో పాల ఉత్ప‌త్తి పెరుగుతుంది. 
నీరు నిల్వ ఉండే చోట‌, చేలల్లో, రోడ్డుకు ఇరువైపులా.. ఇలా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ ఈ మొక్క మ‌న‌కు క‌న‌బ‌డుతుంది. ఈ మొక్క ఆకులల్లో విట‌మిన్ సి అధికంగా ఉంటుంది. త‌ల‌నొప్పిని, కుష్టును, కామెర్లను, మ‌ల‌బ‌ద్ద‌కాన్ని, మూర్ఛ‌ను, జ్వ‌రాన్ని త‌గ్గించ‌డంలో ఈ అమృత‌కాడ మొక్క ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. 
చ‌ర్మాన్ని ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఈ మొక్క స‌హాయ‌ప‌డుతుంది. 
స్త్రీల‌లో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా అమృత‌కాడ మొక్క దోహ‌ద‌ప‌డుతుంది. 
ఈ మొక్క ఆకుల‌ను పేస్ట్ గా నూరి గాయాల‌పై రాయ‌డం వ‌ల్ల గాయాలు త్వ‌ర‌గా మానుతాయి.
అమృత‌కాడ మొక్క వేర్ల‌ను జ్యూస్‌గా చేసుకుని తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి. 
నిద్ర‌లేమి, రేచీక‌టి, క‌ళ్ల క‌ల‌క వంటి వాటిని తగ్గించ‌డంలో కూడా ఈ మొక్క‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు. 
అమృత కాడ మొక్క ఆకులు యాంటీ ఇన్ ఫ్లామేట‌రీ ల‌క్ష‌ణాల‌ను క‌లిగి ఉంటాయి. 
శ‌రీరంలో వ‌చ్చే నొప్పుల‌ను, వాపుల‌ను ఈ మొక్క తగ్గిస్తుంది. 
చెవి, క‌ర్ణ‌భేరి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డానికి, పంటి నొప్పిని త‌గ్గించ‌డానికి, పాము కాటుకు విరుగుడుగా కూడా ఈ మొక్క‌ను ఆయుర్వేదంలో ఉప‌యోగిస్తారు. 
కలుపు మొక్క‌గా భావించే ఈ అమృత‌కాడ మొక్క మ‌న‌కు వ‌చ్చే అనేక ర‌కాల వ్యాధుల‌ను న‌యం చేయ‌డంలో ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు.

అమృతకాడ మొక్కతో స్త్రీలకు ఎన్ని లాభాలో..

స్త్రీల‌లో వ‌చ్చే సంతాన లేమి స‌మ‌స్య‌ల‌ను న‌యం చేయ‌డంలో కూడా అమృత‌కాడ మొక్క దోహ‌ద‌ప‌డుతుంది. 
అమృత‌కాడ మొక్క వేర్ల‌ను జ్యూస్‌గా చేసుకుని తాగ‌డం వ‌ల్ల జీర్ణాశ‌య సంబంధిత స‌మ‌స్య‌లు న‌యం అవుతాయి. 
శ‌రీరంలో వ‌చ్చే నొప్పుల‌ను, వాపుల‌ను ఈ మొక్క తగ్గిస్తుంది.
చెవి సమస్యలను కూడా తగ్గిస్తుంది.
నిద్ర‌లేమి, రేచీక‌టి, క‌ళ్ల క‌ల‌క వంటి వాటిని తగ్గించ‌డంలో కూడా ఈ మొక్క‌ను ఔష‌ధంగా ఉప‌యోగిస్తారు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.