పెళ్లి అయ్యాక కూడా పక్క చూపులు చూస్తున్నారా.. కారణాలు ఇవే..!
పెళ్లికి ముందు ఎన్ని వేషాలు వేసినా.. పెళ్లి అయ్యాక మాత్రం పద్దతిగా ఉండాలి.. వివాహ బంధంలో ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆకర్షణ ఉండాలి.. లేకపోతే.. వేరొకరిపై ఆకర్షణ పెరుగుతుంది..ఈరోజుల్లో చాలా వరకు బంధాలు విడిపోవడానికి కారణం..
పెళ్లికి ముందు ఎన్ని వేషాలు వేసినా.. పెళ్లి అయ్యాక మాత్రం పద్దతిగా ఉండాలి.. వివాహ బంధంలో ఒకరిపై ఒకరికి ప్రేమ, ఆకర్షణ ఉండాలి.. లేకపోతే.. వేరొకరిపై ఆకర్షణ పెరుగుతుంది..ఈరోజుల్లో చాలా వరకు బంధాలు విడిపోవడానికి కారణం.. పెళ్లి తర్వాత కూడా అఫైర్ నడపడమే..! అసలు ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే.. పెళ్లికి ముందే వేరొకరిని ప్రేమిస్తారు.. పోనీ వాళ్లను పెళ్లి చేసుకుంటారా అంటే.. కుదరదు.. ఏవేవో కారణాల వల్ల వారిని పెళ్లి చేసుకోరు.. మ్యూచ్‌వల్ అండర్స్టాడింగ్తోనే ఉంటారు. పెళ్లి తర్వాత కూడా అదే వ్యక్తితో అదే రిలేషన్మెయింటేన్ చేస్తారు.. మీ భార్య లేనప్పుడు లేదా మీ భర్త లేనప్పుడు మనం కలుసుకుందాం..మన బంధం ఇలానే కంటిన్యూ చేద్దాం అంటారు.. అంటే పాపం మధ్యలో వచ్చినవాళ్లు వెర్రిపప్పలా..! వాళ్లకు తన భర్త లేదా తన భార్య ఇలా అని తెలిస్తే.. తట్టుకుంటారా..? దీనివల్లే కదా గొడవలు..! అసలు పెళ్లి అయిన తర్వాత కూడా వేరొకరిపై ఆకర్షితులవుతున్నారంటే.. మీ బంధంలోనే ఏదో తేడా ఉంది.. అదేంటో మానసిక నిపుణులు చెప్తున్నారు.. చూడండి..!
ఏ సంబంధంలో అయినా ఇద్దరి అభిప్రాయాలు, అభిరుచులు ఒకే రకంగా ఉంటే చాలు.. వాళ్లు కలకాలం కలిసి ఉంటారు అనుకుంటారు.. అసలు వాళ్లే త్వరగా వీడిపోతారు.. మీరు ఎంతసేపు నా అభిరుచులకు, నా అలవాట్లకు, నా మైండ్ సెట్‌కు సరిపోయే వాళ్లు కావాలి అనుకోవడం మానేయండి.. ఎందుకంటే.. మీకు లాగే అవతలి వాళ్లు ఉంటే..ప్రతి స్విచ్చువేషన్లో వాళ్లు మీకులానే ఆలోచిస్తారు.. ఎక్కడా రాజీపడరు.. సాధారణంగా పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాలు కలిగి ఉండి, ఇద్దరిలో ఎవరో ఒకరు సర్దుకుపోయే గుణం కలిగి ఉన్న వారి మధ్యనే బంధాలు చిరకాలం కొనసాగుతాయని మనస్తత్వవేత్తలు అంటున్నారు.
ఒకరిని జీవిత భాగస్వామిని కలిగి ఉండి పక్కచూపులు చూసేవారు సమాజంలో చాలా మందే ఉంటారు. అందుకు కారణాలు వారు పుట్టిపెరిగిన నేపథ్యం, వారి తల్లిదండ్రులు, వారు గతంలో అనుభవించిన చేదు ఘటనలు, చిన్ననాటి గాయాలు, అణిచివేసిన భావోద్వేగాలు, ఇష్టంలేని పెళ్లి, నమ్మకద్రోహం ఇలాంటివి ఎన్నో జంటల అనుబంధంలో పాత్ర వహిస్తాయి. అలాంటపుడు భాగస్వామి వారితో సఖ్యతతో మెలిగినా, కోరినవన్నీ తెచ్చిపెట్టి ప్రేమగా చూసుకున్నా వారికి జీవితంలో సంతృప్తి అనేది ఉండదు. ఇదే సమయంలో వారు కోరుకునేది మరొకరి నుంచి లభిస్తుందంటే అప్పుడు కొందరిలో మనసు మాట వినదు.
ఎలాంటి సందర్భాలలో జంటలు పక్కచూపులు చూస్తారంటే..
క్లిష్టమైన తల్లిదండ్రులు గలవారు
ఒకరి బాల్యంలో వారి తల్లిదండ్రులు తమను ఎప్పుడూ చీదరించుకుంటూ, ఏ పనిచేసినా ప్రశంసించకుండా కేవలం విమర్శలతోనే పెరిగినపుడు వారు అదే లోకంలో ఉంటారు. ఆ తర్వాత పెళ్లయ్యాక వారి భాగస్వామి తరచూ ప్రశంసిస్తూ ఉంటే దానిని వారు అబద్ధంగా భావిస్తారు. ఇదే సమయంలో ప్రశంసలతోనే పెరిగినవారు, తమ భాగస్వామి కూడా వారిని ప్రశంసించాలని కోరుకుంటారు. అలా లేని పక్షంలో తమపై ప్రేమ లేదని భావిస్తారు. ఇలాంటపుడు సర్దుకుపోయే భాగస్వామి ఉండటం చాలా అవసరం.
భావోద్వేగంతో ఏకం కాలేని భాగస్వాములు
బాల్యంలో తల్లిదండ్రులకు దూరంగా పెరిగిన వారు, ఎలాంటి ప్రేమలకు నోచుకోకుండా పెరిగిన వారు స్వేచ్ఛను, ఏకాంతంను ఎక్కువగా కోరుకుంటారు. వీరికి పెద్దగా ఎవరిపై అటాచ్మెంట్ ఉండదు. తమ జీవిత భాగస్వామి నుంచి ఈ స్వేచ్ఛా, ఏకాంతాలు కరువైనపుడు వారి నుంచి దూరంగా ఉండాలని ఆలోచనలు చేస్తారు. కాబట్టి భాగస్వామి ఇలా ఉంటే వారికి తగిన స్వేచ్ఛని ఇస్తూ, ప్రేమను పంచుతూ దగ్గర కావాలి.
విశ్వసనీయత లేనివారు
గతంలో ప్రేమ విషయంలో, బంధాల విషయంలో ఎదురుదెబ్బలు తిన్నవారికి ఎవరిపైనా నమ్మకం, విశ్వసనీయత ఉండదు. అసలు ముందు ఒక రాంగ్ పర్సన్‌తో రిలేషన్షిప్ స్టాట్ చేస్తారు.. దానివల్ల బాగా దెబ్బతింటారు.. అక్కడే మీ నమ్మకాలు, మీ ప్రేమను కోల్పోతారు.. ఆ తర్వాత జీవితంలోకి ఒక కరెక్ట్ పర్సన్ వచ్చినా.. మీరు మళ్లీ ప్రేమ అనే పెట్టబడిని పెట్టలేరు.. ఇదే నేడు చాలామంది బాధపడే సమస్య.. ఒకసారి లవ్‌లో ఫేయిల్ అయ్యాక..తిరిగి మీ జీవితంలోకి మరో వ్యక్తి వస్తున్నారంటే.. మీరు భయపడతారు.. వారిపై నమ్మకం ఉంచలేరు..ముందు మోసం చేసిన వారిని మర్చిపోలేక.. ఇప్పుడు కావాలి అని వస్తున్న వారిని అంగీకరించలేక నానా తంటాలు పడతారు.. ప్రతి చిన్నవిషయానికి అనుమానాన్ని కలిగి ఉంటారు. ఇదే వారి భాగస్వామిపై చూపించవచ్చు. అయితే అందరూ గత జ్ఞాపకాలలో గడపరు, కొత్త భాగస్వామితో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. కానీ ఆ విశ్వాసం భాగస్వామి ఇవ్వలేకపోతే, అది అనర్థాలకు దారితీస్తుంది.
ద్రోహం చేసే భాగస్వాములు
ఇక ఇది పూర్తిగా వేరే కోణం. వీరి ప్రవర్తన, ధోరణిలోనే ద్రోహం చేసే ధోరణి కనిపిస్తుంది. తమ బంధంపై విశ్వాసం నమ్మకం లేనివారు, ఎదుటి వారు నిబద్ధత చూపినా వారు పట్టించుకోరు.. వీరికి వీరి జీవితమే ముఖ్యం. వీరి సుఖసంతోషాలు ముఖ్యం అనే స్వార్థపూరిత ఆలోచనలు కలిగిన వారు ఎప్పుడూ అవకాశం దొరికినా కొత్త బాంధాలను ఏర్పర్చుకునేందుకు సిద్ధంగా ఉంటారు. వీరి జీవితంలో ఏదైనా బలమైన సంఘటన జరిగినపుడు వీరిలో మార్పు వస్తుంది.
ఇద్దరు వ్యక్తులు రెండు విభిన్న ప్రాంతాలు, వాతావరణంలో పుట్టి పెరిగినపుడు వారి మనస్తత్వాలు, వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందనేది వారికి మాత్రమే తెలిసి ఉంటుంది. వారిరువురూ వివాహ బంధంతో ఏకమైనపుడు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగాలి. ఇద్దరి మధ్య భావోద్వేగపూరితమైన బంధం అనేది ఏర్పడాలి. ఎమోషనల్ అటాచ్మెంట్ లేకుండా హార్ట్‌కు తీసుకోకుండా ఉన్నంత కాలం మీరు మీ భాగస్వామితో ప్రేమగా ఉండలేరు.