నిద్రను చెడగొట్టే అత్యంత హానికర ఐదు పదార్థాలు ఇవే.. నిత్యం మనం తినేవే!

ఈరోజుల్లో చాలామందికి నిద్ర కరువైపోతుంది కంటి నిండా నిద్ర పోలేక సతమతం అయిపోతున్నారు ఎన్ని విధాల ప్రయత్నించినా ఈ సమస్యకు పరిష్కారం దొరకటం లేదు అయితే నిత్యం మనం తీసుకునే కొన్ని ఆహార పదార్థాలు నిద్రను చెడగొట్టి మానసిక ప్రశాంతతను దూరం చేస్తాయని తెలుస్తోంది మరి అవి ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

చీజ్.. 

చీజ్ ను ఎక్కువ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది ఇందులో ఉండే కొన్ని రకాల పోషకాలు నిద్రలో చెడగొట్టటమే కాకుండా మానసికంగా కల్లోలం కలిగిస్తాయని తెలుస్తోంది ముఖ్యంగా రాత్రి సమయంలో చీజ్ తీసుకోకపోవడమే మంచిది.

సాస్.. 

నూడిల్స్, ఫాస్ట్ ఫుడ్, పిజ్జా, బర్గర్ వంటి వాటిలో ఎక్కువగా ఉపయోగించే సాసులు సైతం నిద్రకు చెడు చేస్తాయని తెలుస్తోంది. ఇవి తయారు చేసినప్పుడు ఉపయోగించే కొన్ని రకాల పదార్థాలు శరీరంలో మార్పులను గురిచేసి నిద్రను దూరం చేస్తాయి.

పాస్తా..  

దీన్ని చాలా రకాలుగా వండుతూ ఉంటారు. పాస్తా తో నూడిల్స్ పకోడీ స్వీట్స్ వంటివి తయారు చేస్తూ ఉంటారు. అందరూ ఇష్టంగా తినే పాస్తాలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి నిద్రలేమికి కారణం అవుతాయి. అందుకే పాస్తాను ఎక్కువగా తీసుకోకూడదు.

చాక్లెట్..  

చాక్లెట్లో కెఫిన్ ఎక్కువగా ఉంటుంది. ఇది మెదడుని ఆక్టివ్ గా ఉంచడానికి సహాయపడుతుంది. అందుకే నిద్రలేమి సమస్యతో బాధపడేవారు చాక్లెట్లకు దూరంగా ఉండాలి. అలాగే కాఫీలో కూడా టిఫిన్ ఎక్కువగా ఉంటుంది ఎక్కువగా నిద్రలేమిటో బాధపడేవారు కాఫీ ని తగ్గించాలి ముఖ్యంగా సాయంత్రం రాత్రి సమయాల్లో కాఫీ ని తీసుకోకపోవడం మంచిది.

చిప్స్..

 ఆలూ చిప్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి వాటిలో ఉండే కొన్ని పదార్థాలు జీర్ణశక్తి సమస్యలను ఇస్తాయి అలాగే కడుపుని ఉబ్బరంగా మారేటట్టు చేస్తాయి. ముఖ్యంగా ఇందులో నూనె శాతం ఎక్కువగా ఉంటుంది. దీని వలన నిద్రలేమి సమస్య అధికమవుతుంది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.