కిడ్నీల ఆరోగ్యం కోసం వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.. ఎన్ని ప్రయోజనాలో..

మానవ శరీరంలోని రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో కిడ్నలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.. వాటిని ఆరోగ్యంగా ఉంచడం మన బాధ్యత.. కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి

కిడ్నీల ఆరోగ్యం కోసం వీటిని ఆహారంలో చేర్చుకోవాలి.. ఎన్ని ప్రయోజనాలో..


మానవ శరీరంలోని రక్తాన్ని శుద్ధి చెయ్యడంలో కిడ్నలు ముఖ్య పాత్రను పోషిస్తాయి.. వాటిని ఆరోగ్యంగా ఉంచడం మన బాధ్యత.. కిడ్నీల ఆరోగ్యం కోసం మంచి ఆహారాన్ని తీసుకోవాలి.. మూత్ర పిండాల ఆరోగ్యం దెబ్బ తినడానికి కారణాలు ఎన్నో ఉన్నాయి. మూత్రపిండాలు సరిగ్గా పని చేయకపోతే అది ఇతర అవయవాల పని తీరుపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. మూత్రపిండాల వ్యాధులను సమర్థవంతంగా నియంత్రించడానికి కొన్ని రకాల పౌష్టికాహారాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉండడానికి ఎలాంటి ఆహారపదార్థాలను తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..


కిడ్నీల ఆరోగ్యం కోసం ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలి.. వీలైనంతవరకు ఆయిల్ ఫుడ్స్ ను తగ్గించాలి.. అలాగే జంక్ ఫుడ్ ను తీసుకోవడం పూర్తిగా మానెయ్యడం మంచిది.. ఆకుకూరలు, ఫ్రెష్ కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం మంచిది.. కాలీఫ్లవర్ మన మూత్రపిండాలకు ఎంతో మేలు చేస్తుంది.. కాలీఫ్లవర్ యాంటీ ఆక్సిడెంట్లకు గొప్ప మూలం. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. వీటిని తింటే మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే బ్లూబెర్రీ లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. స్ట్రాబెర్రీలు,బ్లూబెర్రీస్ వంటి బెర్రీలలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్ సి తో పాటు ఫైబర్ వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉన్నాయి..

World Kidney Day: The link between water intake and kidney health |  HealthShots

రోజూ వీటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండడంతో పాటు కిడ్నీ వ్యాధులు కూడా దూరం అవుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే క్యాబేజీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీనిలో విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ బి ఎక్కువగా ఉంటాయి. క్యాబేజీని తింటే గుండె సంబంధిత సమస్యలు, మూత్ర పిండాల ఆరోగ్య సమస్యలు దూరం అవుతాయి. ఇంకా చెప్పాలంటే రెడ్ క్యాప్సికంలో పొటాషియం చాలా తక్కువగా ఉంటుంది..వీటిని తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరగడమే కాదు.. గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది.. కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఆల్కహాల్ తీసుకోవడం చాలా వరకు తగ్గించాలి..చూసారుగా ఇలా తీసుకోవడం వల్ల కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి..

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.