గర్భం రావాలంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..?

చాలా దంపతులకి శృంగారం విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. ఏ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొంటే పిల్లలు పుడతారు....వద్దనుకుంటే ఎప్పుడు కలవాలి. ఇలా చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోండి.

గర్భం రావాలంటే ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోవాలి..?


చాలా దంపతులకి శృంగారం విషయంలో అనేక సందేహాలు ఉంటాయి. ఏ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొంటే పిల్లలు పుడతారు....వద్దనుకుంటే ఎప్పుడు కలవాలి. ఇలా చాలా సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలకు సమాధానాలు తెలుసుకోండి.శృంగారంలో పాల్గొనడం మాత్రమే కాదు.. కొన్ని పద్ధతులను కూడా దంపతులు పాటించాలి. అప్పుడే సానుకూల ఫలితాలు అవేంటాయి. అసలు అండం ఎప్పుడు విడుదల అవుతుందో ముందు తెలుసుకోవాలి. అమ్మాయిల్లో అండం విడుదలకు 4 లేక 5 రోజులు ముందు గానీ, అండం విడుదలకు ముందు సెక్స్‌లో పాల్గొంటే గర్భం వస్తుంది.

Pregnancy: 'Safety bubble' of pregnant women expands during third  trimester, study finds | The Independent

ఫలదీకరణం అండం విడుదల సమయంలో పాల్గొంటే శుక్రకణాలు ఎక్కవ సమయం అండంతో ఫలదీకరణం చెంది గర్భం రావడానికి అవకాశాలు ఉంటాయి. ఆడవారు నెలసరి అయిన 12 రోజులు నుంచి 16 రోజులలోపు అండం విడుదల అవుతుంది. ఈ టైమ్‌లో సెక్స్‌లో పాల్గొంటే గర్భం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.

అదే విధంగా చాలా మంది దంపతులు పిల్లల కలగట్లేదని.. ఒత్తిడిగా ఫీల్ అవుతారు. మీరు మీ సమయాన్ని ఎంజాయ్ చేయండి.. అంతేకానీ, ఒత్తిడిగా ఫీల్ అవ్వొద్దు.. వీటితో పాటు యోగా, వ్యాయామం చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

శృంగారం జరిగిన వెంటనే మహిళలు మూత్ర విసర్జనకు వెళ్లడం.. శుభ్రపరుచుకోవడం లాంటిది చేయకూడదు కాసేపు అలానే ఉండాలి. ఇలా ఉండడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు పెరుగుతాయి. దంపతులు ఎప్పుడూ కూడా ఆనందంగా సెక్స్‌లో పాల్గొనాలి. అంతే కానీ, ఏవేవో ఆలోచనలతో ఆ పని చేయొద్దు దీని వల్ల ప్రతికూల ఫలితాలే తప్పా అనుకూలంగా ఉండవు. కాబట్టి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. దంపతులు ఎంతసేపు పిల్లలు కావాలని దగ్గర కావడం కాకుండా ఉన్న సమయాన్ని తాము ఆస్వాదిస్తున్నారా.. తమ పార్టనర్ ఎంజాయ్ చేస్తున్నారా అనేది ఆలోచించాలి. తమ ఏకాంత సమయాన్ని ఆనందంగా గడపుతూ అన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మానసికంగా ప్రశాంతంగా ఉంటేనే సానుకూల ఫలితాలు ఉంటాయి.....ఇది ప్రతి ఒక్క జంట ఆలోచించాలి. ఏదో తూతూ మంత్రంగా శారీరకంగా లబ్ధి కోసమో.....కేవలం పిల్లలకోసమో చేస్తే ప్రయోజనం ఉండదు. ఎంజాయ్ చేస్తూ....ఇద్దరు ఆస్వాదిస్తూ ఉంటేనే ఒక లాభం ఉంటుంది.

గర్భవతి అయ్యేందుకు ప్రయత్నిస్తున్న స్త్రీ ముందుగానే తనకు అండోత్సర్గము జరిగే రోజులను అంచనా వేసి ఆ రోజులలో భర్తతో కలిస్తే గర్భం ధరించే అవకాశాలు ఎక్కువ. మీకు పీరియడ్స్ మొదలయ్యే రోజును మొదటి రోజుగా భావించండి. ఆ రోజు నుంచి సరిగ్గా ఎనిమిదవ రోజు నుంచి 21వ రోజు మధ్య అండోత్సర్గము జరిగే అవకాశం ఉంది.

పెళ్లయిన జంటలన్నీ పిల్లల్ని కనేందుకు సిద్ధంగా ఉంటాయి. కానీ ఏ సమయంలో లైంగికంగా కలిస్తే గర్భం ధరించే అవకాశం ఉందో చాలా తక్కువ మందికే అవగాహన ఉంది. ముందుగా స్త్రీ శరీరంలో జరిగే ఓవులేషన్ గురించి తెలుసుకుంటే ఎప్పుడు కలిస్తే గర్భం ధరించడం సులువో అర్థం చేసుకోవచ్చు. దీని వల్ల మీరు కోరుకున్న సమయంలో పిల్లల్ని కనవచ్చు. అంతేకాదు అవాంఛిత గర్భాలను కూడా నిరోధించవచ్చు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.