పిల్లలు పుట్టక పోవడానికి ప్రధాన కారణం థైరాయిడ్.. ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే!

ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య థైరాయిడ్. గొంతుకు దగ్గర ఉండే ఈ గ్రంధి శరీరంలో ఎన్నో రకాల పనుల్ని క్రమబద్దీకరిస్తుంది. ముఖ్యంగా దీన్ని గాయిటర్ అంటారు. ఈ గ్రంధి హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తే హైపోథైరాయిడ్ వస్తుంది.

పిల్లలు పుట్టక పోవడానికి ప్రధాన కారణం థైరాయిడ్.. ఈ వ్యాధిని ఎలా గుర్తించాలంటే!


ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య థైరాయిడ్. గొంతుకు దగ్గర ఉండే ఈ గ్రంధి శరీరంలో ఎన్నో రకాల పనుల్ని క్రమబద్దీకరిస్తుంది. ముఖ్యంగా దీన్ని గాయిటర్ అంటారు. ఈ గ్రంధి హార్మోన్లను ఎక్కువగా విడుదల చేస్తే హైపోథైరాయిడ్ వస్తుంది. అలాగే తక్కువగా పనిచేస్తే ఎండోక్రైనా వస్తుంది.

4 Annoying Symptoms That Are Signs of a Healthy Pregnancy

మన శరీరంలో విడుదలైన హార్మోన్లు శరీర పనితీరుకి సరిపెడేట్టు మాత్రమే ఉండాలి. అవి ఎక్కువగా విడుదలైన తక్కువగా విడుదలైన ఎటు పోయే అవకాశం ఉండదు కాబట్టి శరీరంలో మిగిలిన అవయవాల పైన కచ్చితంగా ప్రభావం చూపిస్తాయి.

థైరాయిడ్ లక్షణాలు ఏంటంటే..

సాధారణంగా శరీరంలో థైరాయిడ్ గ్రంధి పనితీరులో ఏవైనా మార్పులు వస్తే వెంటనే మనకి తెలిసిపోయే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా జుట్టు ఎక్కువగా ఊడిపోవడం, అధికంగా బరువు పెరగటం లేదా సన్నబడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అలాగే నరాల బలహీనత, ఆకలి ఎక్కువగా వేయడం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. చెమట ఎక్కువగా పట్టడం, దాహం వేయటం, థైరాయిడ్ లక్షణాలు వీటితోపాటు పల్స్ రేట్ పెరగటం కూడా జరుగుతుంది.

ఎప్పుడు మత్తుగా అనిపించడం, చర్మం పొడి బారటం, అజీర్ణం, చలికి తట్టుకోలేకపోవడం, గుండె జబ్బులు, పిల్లలు పుట్టకపోవడం, రుతుక్రమంలో మార్పులు రావడం, ఎక్కువ రోజులు రక్తస్రావం కనిపించడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

ముఖ్యంగా థైరాయిడ్ ను తేలికగా తీసుకోకూడదు దీని వలన పిల్లలు పుట్టకపోవడం అనే సమస్య చాలా మందిని వేధిస్తూ ఉంటుంది అందుకే థైరాయిడ్ కు తప్పకుండా చికిత్స తీసుకోవాలి. 

థైరాయిడ్ ఉన్నవారు పెరుగును ఎక్కువగా తీసుకోకూడదు కమ్మని మజ్జిగను వాడటం మంచిది. అలాగే ఆకుకూరలో మునక్కాడలు మెంతికూర పాలకూర వంటివి తీసుకోవడం మంచిది. కాకరకాయ పొట్లకాయ బీట్రూట్ క్యారెట్ వంటి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.