చిన్నపాటి Headache అయితే అందరికీ వస్తుంది.. కాస్త ఎక్కువగా చదివినా, పని ఒత్తిడి వల్ల, ఎండలో తిరిగినా తలనొప్పి వస్తుంది. తలనొప్పి ముదిరితే మైగ్రేన్ అవుతుంది. ఇంది ఇంకా డేంజర్.. తలనొప్పిని తగ్గించుకోవడానికి టాబ్లెట్ వేసుకుంటారు చాలామంది.. అయితే తలనొప్పిని కొన్ని ఇంటి చిట్కాల ద్వారా చేత్తో తీసేసినట్లు ఈజీగా తగ్గించుకోవచ్చు. అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
తలనొప్పిని తగ్గించేందుకు ఆవు నెయ్యి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది మన శరీరంలో వేడిని బాగా తగ్గిస్తుంది. అలాగే నాడీ మండల వ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది. శరీరంలో రక్త సరఫరాను పెంచుతుంది. దీంతో తలకు బాగా రక్తం సరఫరా అవుతుంది. ఫలితంగా తలనొప్పి తగ్గుతుంది. అలాగే తడి సున్నం కూడా తలనొప్పిని తగ్గిస్తుంది. ఇక ఈ రెండింటినీ కలిపి మిశ్రమంగా తయారు చేసి వాడితే తలనొప్పి తగ్గుతుంది.
ఒక చిన్న బౌల్‌లో అర టీస్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని తీసుకోవాలి. అందులోనే ఒక పావు టీస్పూన్ మోతాదులో తడి సున్నం కలపండి.. ఈ రెండింటినీ బాగా కలిపేసి పేస్ట్‌లా చేయండి.. దీన్ని నుదుటిపై రాయాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై రాసిన తరువాత 2 నిమిషాలపాటు సున్నితంగా మర్దనా చేయండి..తరువాత 5 నిమిషాలు అలాగే ఉండాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే.. 10 నుంచి 15 నిమిషాల వరకు ఆగాల్సి ఉంటుంది. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
తలనొప్పి బాగా ఉన్నవారు సాయంత్రం ఒక బకెట్‌ను తీసుకుని అందులో సగం వరకు గోరు వెచ్చని నీళ్లను పోయాలి. అందులో కాస్త ఎప్సం సాల్ట్‌ను వేయాలి. తరువాత ఆ బకెట్‌లో కాళ్లను పెట్టాలి. పాదాలు మునిగేలా పెట్టండి.. ఇలా 20 నిమిషాల పాటు ఉండాలి. ఇలా చేసినా కూడా శరీరంలో రక్త సరఫరా పెరిగి తద్వారా తలనొప్పి తగ్గుతుంది. ఈ విధంగా ఈ రెండు చిట్కాలను పాటిస్తే
తలనొప్పి నుంచి బయట పడవచ్చు. ఇంట్లో ఎప్పుడూ ఆవునెయ్యి, సున్నం ఉంచుకుంటే.. టాబ్లెట్‌తో పని లేకుండా తలనొప్పిని తగ్గించుకోవచ్చు.
తలనొప్పిని ఐదునిమిషాల్లో తగ్గించే చిట్కా..
ఒక చిన్న బౌల్‌లో అర టీస్పూన్ మోతాదులో ఆవు నెయ్యిని, ఒక పావు టీస్పూన్ మోతాదులో తడి సున్నం కలపండి.. ఈ రెండింటినీ బాగా కలిపేసి పేస్ట్‌లా చేయండి.. దీన్ని నుదుటిపై రాయాలి. ఈ మిశ్రమాన్ని నుదుటిపై రాసిన తరువాత 2 నిమిషాలపాటు సున్నితంగా మర్దనా చేయండి..తరువాత 5 నిమిషాలు అలాగే ఉండాలి. దీంతో తలనొప్పి తగ్గుతుంది. అయితే నొప్పి తీవ్రత ఎక్కువగా ఉంటే.. 10 నుంచి 15 నిమిషాల వరకు ఆగాల్సి ఉంటుంది. దీంతో తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.