ఎండకు మీ ముఖం, చేతులు నల్లగా మారాయా?.. ఇవి ట్రై చేస్తే ఫుల్ గ్లో!

మండుతున్న ఎండల కారణంగా..  చర్మ రంగు మారుతుంది.  ముఖం, చేతులు సహా ఎండకు గురైన ఇతర శరీర భాగాలు నల్లగా లేదా ముదురు రంగులోకి మారిపోతాయి. దీనినే ట్యానింగ్ అంటారు. ట్యానింగ్ అంటే..  చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ.

ఎండకు మీ ముఖం, చేతులు నల్లగా మారాయా?.. ఇవి ట్రై చేస్తే ఫుల్ గ్లో!


మండుతున్న ఎండల కారణంగా..  చర్మ రంగు మారుతుంది.  ముఖం, చేతులు సహా ఎండకు గురైన ఇతర శరీర భాగాలు నల్లగా లేదా ముదురు రంగులోకి మారిపోతాయి. దీనినే ట్యానింగ్ అంటారు. ట్యానింగ్ అంటే..  చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ.  సూర్యుని నుండి వచ్చే UV రేడియేషన్ల నుంచి  చర్మాన్ని రక్షించడానికి మన శరీరంలో ఉండే మెలనిన్ చర్మ కణాల ఉపరితలంపైకి వస్తుంది. మెలనిన్ చేరటం వల్ల సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాల్లో ట్యానింగ్ అవుతుంది. చర్మంపై ఈ రంగు మార్పు  7 నుంచి 10 రోజుల వరకు ఉంటుంది. అది చర్మ రకం, చర్మ సంరక్షణపై ఆధారపడి ఉంటుంది. సరైన సంరక్షణ లేకుంటే ట్యానింగ్  చాలా కాలం పాటు అలాగే ఉంటుంది.

Фото Девушка стоит в лучах солнца

అయితే ఈ టాన్‌ను సహజంగా తొలగించడాని కొన్ని చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. అవి ఏంటంటే.. 

కలబంద..  

కలబంద జెల్ లో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని మెరిసేలా, ఆరోగ్యంగా కనిపించేలా చేస్తుంది. ఇందులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ల్ఫమేటరీ గుణాలు ఉంటాయి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది, టాన్ తొలగించడంలో సహాయపడుతుంది. 

బంగాళాదుంప..

మీ చర్మంపై బంగాళాదుంప ముక్కలను రుద్దడం వలన సన్ టాన్ లేదా డార్క్ పిగ్మెంటేషన్‌ను పోతుంది.  ఇది చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. 

స్ట్రాబెర్రీలు..

స్ట్రాబెర్రీలు ఎంత రుచికరంగా ఉంటాయో, సన్ ట్యాన్‌ను తొలగించడానికి కూడా అంతే గొప్ప ఔషధంగా పనిచేస్తాయి. వీటిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. అందువల్ల, స్ట్రాబెర్రీలు చర్మాన్ని సహజంగా ప్రకాశవంతం చేసే లక్షణాలను కలిగి ఉంటాయి.  దాని పేస్ట్ నల్లగా మారిన చర్మానికి అప్లై చేసి 20 నిమిషాల  తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేస్తే..   చర్మం రంగును కాంతివంతం చేస్తుంది. చర్మానికి తేమను కూడా అందిస్తుంది.

పైనాపిల్ గుజ్జు..

పైనాపిల్ గుజ్జును తేనెతో కలిపి టాన్ అయిన ప్రదేశంలో పూయలి. 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఈ పండులో విటమిన్ ఎ, విటమిన్ సి  ఉన్నందున ఇది మీ చర్మాన్ని కాంతివంతం చేస్తుంది.

నిమ్మకాయ..

నిమ్మకాయలో ఉండే అధిక స్థాయి సిట్రిక్ యాసిడ్, విటమిన్ సి చర్మంలోని మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. టాన్‌కు కారణమయ్యే మెలనిన్‌ను కూడా తొలగిస్తుంది.  నిమ్మరసానికి కొద్దిగా తేనె కలిపి రాస్తే ఇంకా మంచిది. 

పెరుగు..

ఒక చెంచా శనగపిండిలో పెరుగు కలిపి మందపాటి పేస్ట్‌గా తయారు చేయండి. ఈ మిశ్రమాన్ని మీ శరీరమంతా అప్లై చేసి, 20 నిమిషాల  తర్వాత  స్నానం చేస్తే మంచిది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.