Shiny hair : జుట్టుకు ఈ చిట్కాలు ట్రై చేయండి.. మెరిసిపోతుంది..

Shiny hair : జుట్టు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది.అలాంటప్పుడు జుట్టు సమస్యలన్నీ అంత తేలిగ్గా వదిలిపెడతారా..? ఛాన్సే లేదు..ఈ చిట్కాలు పాటిస్తే..జుట్టు మెరిసిపోతుంది

Shiny hair : జుట్టుకు ఈ చిట్కాలు ట్రై చేయండి.. మెరిసిపోతుంది..
shiny hair


Shiny hair : జుట్టు లేకపోతే.. ఆ బాధ ఎలా ఉంటుందో పాపం అది లేని వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా అబ్బాయిలకు అయితే..ఎక్కడ బట్టతల వచ్చేస్తుందా అని భయం.. జుట్టు ఆడవారి అందాన్ని రెట్టింపు చేస్తుంది... మహిళలు అందంగా ఉండేందుకు వాళ్ల దగ్గర ఉన్న ఆఖరి రూపాయి వరకూ ఖర్చుపెడతారు.. అలాంటప్పుడు జుట్టు సమస్యలన్నీ అంత తేలిగ్గా వదిలిపెడతారా..? ఛాన్సే లేదు.. ఏవేవో ప్రొడెక్ట్స్‌ రాసేసి ఉన్న ఆ కాస్త నాలుగు వెంట్రుకలకు మూడా ముప్పు తెస్తారు.? అన్నీ మంచివి అని కాదు..కానీ చాలా వరకూ ప్రొడెక్ట్స్‌లో కెమికల్స్‌ ఉంటాయి.. ఈ చిట్కాలు పాటిస్తే..hair shiny అవుతుంది.
కొద్దిగా క‌ల‌బంద గుజ్జును తీసుకుని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా బాగా మ‌ర్ద‌నా చేయాలి. త‌రువాత 30 నిమిషాల పాటు జుట్టును అలాగే ఉంచాలి. అనంత‌రం త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేసినా చాలు.. జుట్టు నిగ‌నిగలాడుతూ మెరుస్తుంది.

 
రాత్రి పూట గుప్పెడు మెంతుల‌ను నీటిలో నాన‌బెట్టాలి. మ‌రుస‌టి రోజు ఉద‌యం వాటిని పేస్ట్‌లా చేసి త‌ల‌కు బాగా రాయాలి. అర గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. ఇలా వారంలో 2 సార్లు చేస్తే శిరోజాలు కాంతివంతంగా మారుతాయి. జుట్టు రాలే సమస్య కూడా పోతుంది.
స‌గం అర‌టి పండు, 2 టీస్పూన్ల తేనె, ఒక టీస్పూన్ కొబ్బ‌రినూనెల‌ను తీసుకుని బాగా క‌ల‌పాలి. ఈ మిశ్ర‌మాన్ని జుట్టు కుదుళ్ల‌కు త‌గిలేలా ప‌ట్టించాలి. ఒక గంట త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. దీంతో జుట్టు మృదువుగా మారుతుంది. కాంతి చేకూరుతుంది. అందంగా క‌నిపిస్తుంది.
ముల్తానీ మ‌ట్టిని కొద్దిగా తీసుకుని అందులో ఆవ‌నూనెను కొద్దిగా వేసి పేస్ట్‌లా క‌లుపుకోవాలి. దాన్ని శిరోజాల‌కు బాగా రాయాలి. గంట సేప‌య్యాక త‌ల‌స్నానం చేయాలి. ఈ విధంగా చేస్తుంటే శిరోజాల స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. జుట్టు నిగ‌నిగలాడుతూ క‌నిపిస్తుంది.
పెరుగును కొద్దిగా తీసుకుని దాన్ని ఒక వ‌స్త్రంలో చుట్టి అందులో ఉండే నీటిని పూర్తిగా పిండేయాలి. అనంత‌రం గ‌ట్టిగా అయిన పెరుగును జుట్టుకు రాయాలి. గంట సేప‌టి త‌రువాత త‌ల‌స్నానం చేయాలి. దీంతో జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. చుండ్రు నుంచి విముక్తి ల‌భిస్తుంది. శిరోజాలు కాంతివంతంగా మారి మెరుస్తాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.