Fine lines and wrinkles : కళ్ళ కింద నల్లటి చారలు.. ముఖంపై మడతలు రాకూడదంటే!

Fine lines and wrinkles : సాధారణంగా యుక్త వయసులో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ముఖంపై మడతలు రావడం మొదలైన ఇబ్బంది తర్వాత పెరిగి ముఖంపై ముడతలు కళ్ళ కింద చారులు వంటివి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి.

Fine lines and wrinkles : కళ్ళ కింద నల్లటి చారలు.. ముఖంపై మడతలు రాకూడదంటే!
Tips to remove wrinkles and fine lines under eyes


Fine lines and wrinkles : ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ అందంగా ఆకర్షణీయంగా ఉండటానికి ఎంతగానో పరితపిస్తున్నారని 
చెప్పాలి. సాధారణంగా యుక్త వయసులో హార్మోన్ల హెచ్చుతగ్గుల వల్ల ముఖంపై మడతలు రావడం మొదలైన ఇబ్బంది
తర్వాత పెరిగి ముఖంపై ముడతలు కళ్ళ కింద చారులు వంటివి ఎన్నో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ ముఖాన్ని
అందవిహీనంగా తయారు చేస్తాయి. అయితే వీటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.

సాధారణంగా టీనేజ్ పిల్లల్లో ముఖంపై మొటిమలు, దురద, మంట వంటి లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవి తగ్గిన తర్వాత నల్లని మచ్చలు ఏర్పడతాయి. సాధారణంగా కొందరిలో 20 ఏళ్ళు వచ్చాక తగ్గిపోయినప్పటికీ మరికొందరిలో మాత్రం ఇవి పెరుగుతూ ఉండి ఇబ్బంది పెడతాయి.

సాధారణంగా టీనేజ్ లో ఉన్నప్పుడు యండ్రాజిన్ అనే హార్మోన్ స్థాయి శరీరంలో పెరుగుతూ ఉంటుంది. దీని వలన మొటిమల సమస్య వస్తూ ఉంటుంది. మరికొన్నిసార్లు తల్లిదండ్రుల నుంచి కూడా ఈ హార్మోన్ ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. నూనె శరీరతత్వం ఉన్నవారిలో ఈ లక్షణాలు మరింత ఎక్కువగా ఉంటాయి.

అయితే సాధారణంగా ముఖంపై మడతలు, మచ్చలు వంటివి రాకుండా ఉండాలి అంటే మార్కెట్లో దొరికే పలు రకాల సబ్బులు, పౌడర్లు వాడకూడదు. వీటి వలన శరీరం సహజత్వాన్ని కోల్పోయి అవకాశం ఉంది. అలాగే అధికంగా మాయిశ్చరైసర్లు ఫౌండేషన్స్ కూడా వాడకూడదు.. ముఖాన్ని చర్మాన్ని ప్రతిసారి చేత్తో తాగకూడదు. ఎందుకంటే చేతిలో పలు రకాల క్రీములు ఉంటూ ఉంటాయి. దాని వలన చర్మం పాడైపోయే అవకాశం కూడా ఉంటుంది.

మేకప్ వేసుకోవలసి వస్తే వెంటనే దాన్ని తొలగించుకోవాలి. రాత్రి మేకప్ పూర్తిగా తొలగించాక మాత్రమే నిద్రపోవడం వల్ల శరీరం అందంగా ఉంటుంది. నువ్వుల నూనె, పచ్చి పాలు వంటి వాటితో మేకప్ ను తొలగించుకోవడం వల్ల చర్మం పాడవకుండా ఉంటుంది.

నీళ్లను మరిగించి ఆవిరి పెట్టడం వల్ల స్వేద గ్రంధులు తెరుచుకొని చర్మం శుభ్రపడుతుంది. పాలమిగడలో పసుపు నువ్వుల నూనె కలిపి రాసుకొని పావుగంట తర్వాత కడిగేయడం వల్ల చర్మం సున్నితంగా మారుతుంది.

మొటిమలు ఎలా తగ్గించుకోవాలంటే..

  • నీరు ఎక్కువగా తాగాలి..
  • బయట దొరికే జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ వంట వాటికి దూరంగా ఉండాలి.
  • కొవ్వు పదార్థాలు తీసుకోకూడదు..
  • క్రీమ్లు ఫౌండేషన్ పౌడర్లు ఎక్కువగా వాడకూడదు..
  • దిండ్లు దుప్పట్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.