Sciatica nerve : కాళ్లు కదపనివ్వని నరాల బాధ సయాటికా.. ఆధునిక వైద్యంలో చికిత్స లేదు. మరి ఎలా తగ్గించుకోవాలంటే!

 Sciatica nerves : నిజానికి Sciatica అనేది మన శరీరంలోనే అతి పెద్ద నరం.  ఇది నడుము నుండి ప్రారంభమై పిరుదులు దాటి ఉంటుంది. వెన్నుపూసల చివర ఉన్న నాలుగు ఐదు పూసలతో పాటు నడుము

Sciatica nerve : కాళ్లు కదపనివ్వని నరాల బాధ సయాటికా.. ఆధునిక వైద్యంలో చికిత్స లేదు. మరి ఎలా తగ్గించుకోవాలంటే!
Treatment for Sciatica nerves problem


 Sciatica nerves : నిజానికి Sciatica అనేది మన శరీరంలోనే అతి పెద్ద నరం.  ఇది నడుము నుండి ప్రారంభమై పిరుదులు దాటి ఉంటుంది. వెన్నుపూసల చివర ఉన్న నాలుగు ఐదు పూసలతో పాటు నడుము కింద భాగాలకి తొడలు, కాళ్లు, అరికాళ్ళ వరకు స్పర్శని తెలియచేసే నరం సయాటికా. ఈ నరం విషయంలో ఎలాంటి తేడా ఎదురైనా భరించలేని కాలు నొప్పి మొదలవుతుంది.

శరీరంలో అత్యంత బలమైన నరం సయాటికా అని చెప్పవచ్చు. దీనికి పలు రకాల నరాలు అనుసంధానంగా ఉంటాయి. ఇవన్నీ కలిసి మోకాళ్ళ కింది కండరాలకు, పాదాలు, కాలివేళ్ల కండరాలికి స్పర్శని తెలియజేస్తాయి.

సయాటికా నొప్పి ఎలా ఉంటుందంటే..

సాధారణంగా తుంటి నుండి వెనకవైపు మొదలై పక్కల్లో విపరీతమైన నొప్పి వస్తుంది. తిమ్మిరిగా ఉండటం, రెండు కాళ్ల కండరాలు బలహీన పడటం జరుగుతూ ఉంటుంది. సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది. 

నడుము చివరి భాగంలో మొదలై తొడలలో నుండి పాకి మోకాళ్ళ కింద నుంచి పిక్కలతో కలిపి మొత్తం కాళ్ల భాగం లాగినట్టు అనిపిస్తుంది. కాళ్లు కదపటం కష్టమవుతుంది. కాళ్ళని ఎన్ని రకాలుగా మార్చిన నొప్పి తగ్గదు.

కారణాలు.. 

సయాటికా నరం లోపల ఎలాంటి నొప్పి వచ్చిన తట్టుకోలేనంత కష్టంగా ఉంటుంది. ఈ నరం చుట్టూ ఉండే పొర, నరం మూల మీద ఏదైనా ఒత్తిడి కలిగినప్పుడు ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే పూర్తిగా ఇప్పటివరకు ఈ వ్యాధికి చికిత్స లేదని చెప్పవచ్చు. విశ్రాంతి మాత్రమే ఈ నొప్పి నుంచి ఉపశమనం ఇస్తుంది.

ఎలా తగ్గించుకోవాలంటే..

నిజానికి ఆధునిక వైద్యంలో సయాటికాకు సరైన వైద్యం లేదు కానీ ఆయుర్వేదంలో మాత్రం సయాటికా నొప్పిని తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు చెబుతూ ఉంటారు.

నువ్వుల నూనెతో నడుము కింద భాగం నుండి సున్నితంగా మర్దన చేయడం వల్ల ఈ నొప్పి నుండి ఉపశమనం దొరుకుతుందని తెలుస్తోంది. అలాగే ఉల్లిపాయల రసం, ఆవనూనె సమ భాగాలుగా తీసుకొని మర్దన చేయడం వల్ల కూడా ఈ నొప్పి నుండి ఉపశమనం కలుగుతుందని తెలుస్తోంది.

ధన్వంతరి తైలం, కర్పూర తైలం వీటిలో దేనినైనా తీసుకొని సున్నితంగా మర్దన చేసి వేడినీళ్ల స్నానం చేయడం వల్ల ఈ నొప్పి నుండి ఉపశమనం దొరుకుతుందని తెలుస్తోంది.

సయాటికా నొప్పి ఉన్నవారు వేరుశెనగ నూనె, తీపి పదార్థాలు తీసుకోకూడదు. అలాగే చన్నీళ్ళతో స్నానం చేయడం కూడా తగదని తెలుస్తోంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.