గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ ఆరు చేస్తే చాలు..!!
ఈ మధ్యకాలంలో గుండె సమస్యల భారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇంట్లో ఎవరైన గుండె నొప్పి వచ్చి చనిపోతే.. ఆ ప్రభావం కుటుంబసభ్యుల మీద బాగా ఉంటుంది. వాళ్లకు కూడా అలానే గుండెసమస్య వచ్చి.. సడన్‌గా చనిపోతామేమో

ఈ మధ్యకాలంలో గుండె సమస్యల భారిన పడే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. ఇంట్లో ఎవరైన గుండె నొప్పి వచ్చి చనిపోతే.. ఆ ప్రభావం కుటుంబసభ్యుల మీద బాగా ఉంటుంది. వాళ్లకు కూడా అలానే గుండెసమస్య వచ్చి.. సడన్‌గా చనిపోతామేమో అనే భయం వెంటాడుతుంది. గుండె ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటున్నా.. వాళ్లు ఈ భయం నుంచి బయటపడలేకపోతున్నారు. గుండె ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏవేవో చేయక్కర్లేదు.. సింపుల్‌గా ఈ ఆరుపనులు చేస్తే చాలు.. మీ గుండె సేఫ్.!
వర్కౌట్...
మీకు ఇష్టమైన ఏదైనా ఓ వర్కౌట్ చేయండి. రోజుకి 30 నుంచి 60 నిమిషాల వరకూ ఎక్సర్‌సైజ్ చేయడం అలవాటుగా పెట్టుకోండి.. నడవడం, కార్డియో, డ్యాన్స్ ఏదైనా సరే చేయండి. దీని వల్ల కేలరీలు కరిగి బరువు తగ్గడమే కాకుండా మీ బాడీ కూడా ఫ్లెక్సీబుల్‌గా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా వర్కౌట్ చేయండి. ఇందుకోసం జిమ్‌కే వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో కూడా చేయొచ్చు. యోగా, ధ్యానంతో మానసికంగా ప్రశాంతంగా ఉండొచ్చు..
బరువు తగ్గడం..
బరువు అనేది.. అనేక ఆరోగ్య సమస్యలకి మూలం. కాబట్టి, ముందుగా ఈ సమస్యని దూరం చేసుకోవాలి. ముఖ్యంగా, బెల్లీ ఉన్నవారికి ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. బెల్లీ ఫ్యాట్, హై బ్లడ్ ప్రెజర్ రెండింటికి లింక్ ఉంది. కాబట్టి, మీరు బరువు పెరగకుండా ముఖ్యంగా బెల్లీ రాకుండా చూసుకోవడం మంచిది.
ఫుడ్..
మంచి ఆహారం.. మంచి ఆరోగ్యాన్నిస్తుంది. అందుకే తాజా కూరగాయలు, పండ్లు తినండి. బయట ఉండే... జంక్‌ఫుడ్‌కి దూరంగా ఉండండి. యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. వీటితో పాటు ఫైబర్ ఫుడ్ కూడా హెల్ప్ చేస్తుంది. మాయో క్లినిక్ ప్రకారం, ఫైబర్ ఫుడ్ తినడం వల్ల చెడు కొలెస్ట్రాల్ దూరమవుతుంది.
ఇష్టమైన పనులు..
మీ మనస్సుని ఆనందంగా ఉంచుకునేలా చూడండి. ఇందుకోసం మీకు ఇష్టమైన పని చేయొచ్చు. అల్లడం, కుట్టడం, పెయిటింగ్ ఇలాంటి పనులు చేయడం వల్ల మీకు కొద్దిగా తృప్తితో పాటు ఒత్తిడి దూరమై ఆనందంగా ఉంటారు. జీవితంలో ఒత్తిడిని మించిన శత్రువు ఇంకోటి ఉండదని గుర్తుపెట్టుకోండి. అదే విధంగా చక్కని మ్యూజిక్‌ని కూడా ఆస్వాదించొచ్చు. దీని వల్ల చాలా వరకూ గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మీరు ఎప్పుడూ ఒక లెక్కను గుర్తుపెట్టుకోండి.. నేను ఇది చేయడం వల్ల నాకు ఏం వస్తుంది.. మీరు చేసే పని వల్ల మీకు డబ్బు, సంతోషం, విలువ , సంతృప్తి ఇలా ఏదో ఒకటి రావాలి.. ఇలా ఏవి రాకుండా ఉండే పనులు చేయడం మానేయండి.. ప్రశాంతంగా ఉండొచ్చు.
పొగకి దూరం..
పొగాకు, పొగ త్రాగడం ఇవి రెండు కూడా ఆరోగ్యానికి హానికరం. దీని వల్ల మీ గుండె ఆరోగ్యంపై ఎఫెక్ట్ పడుతుంది. అందుకే, ముందునుంచి ఈ అలవాటుకి దూరంగా ఉండాలి. మీకు సిగిరెట్, పొగాకు ఇలా ఏ అలావాటు ఉన్నా వాటిని వదిలించుకునే ప్రయత్నం చేయండి.. ఒక్కరోజులో సాధ్యం కాకపోవచ్చు.. కానీ చేయాలనుకుంటే మాత్రం జరుగుతుంది...
మంచి నిద్ర..
ఇక అన్నింటికంటే ముఖ్యమైననది సుఖమైన నిద్ర.. సరైన నిద్ర లేకపోతే ఏ పని మీద కూడా శ్రద్ధ ఉండదు.. మంచి నిద్ర తర్వాత మీ బ్రెయిన్ షార్ప్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. కాబట్టి కంటి నిండా నిద్రపోండి.