మహిళల్లో ఎముకలు బలంగా ఉండాలంటే
ఏ వయసు వారైన ధృడంగా ఉంటాలంటే ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా లేకపోతే మాత్రం చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. చిన్న పనికి కూడా అలసిపోయే ప్రమాదం ఉంది. ఎముకల బలహీనత అనేది...పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. కారణం మహిళలు ఎక్కువగా బయటకు వెళ్లకపోవడం..ఇంట్లోనే ఉండి సరైన ఆహారం తీసుకోకపోవడం.

ఏ వయసు వారైన ధృడంగా ఉంటాలంటే ఎముకలు బలంగా ఉండాలి. ఎముకలు బలంగా లేకపోతే మాత్రం చాలా అవస్థలు పడాల్సి ఉంటుంది. చిన్న పనికి కూడా అలసిపోయే ప్రమాదం ఉంది. ఎముకల బలహీనత అనేది...పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువగా ఉంటుంది. కారణం మహిళలు ఎక్కువగా బయటకు వెళ్లకపోవడం...ఇంట్లోనే ఉండి సరైన ఆహారం తీసుకోకపోవడం. బయటకు రాకపోవడం వల్ల సూర్యరశ్మి తగలక డి విటమిన్ తగ్గి ఎముకలు బలహీనంగా తయారవుతాయి. ఒక్కసారి ఎముకలు బలాన్ని కోల్పోతే మాత్రం.....దాని నుంచి బయటపడటానికి చాలా సమయమే పట్టేస్తుంది.
కాబట్టి మహిళలు ముఖ్యంగా చిన్నప్పటి నుంచి 25 ఏళ్ల మధ్య జాగ్రత్తలు తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, ఆలుగడ్డలు, తృణధాన్యాలు, చేపలు, గుడ్లు, మాంసం, పాల ఉత్పత్తులు వంటి వాటిని తీసుకోవాలి. బరువులకు సంబంధించి వ్యాయామం వల్ల కూడా ఎముకలు గట్టిగా తయారవుతాయి.
ఎముకలు బలంగా ఉండాలంటే కాల్షియం చాలా అవసరం. ఈ కాల్షియం అనేది పాలు, నువ్వులు, బాదం పప్పు, ఆకు కూరలు వంటివి తీసుకోవడం వల్ల సహజంగానే మనకు కావాల్సిన కాల్షియం లభిస్తుంది. కండరాలు బలంగా ఉండటానికి విటమిన్-డి ఉపయోగపడుతుంది. ఎండతో పాటు కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల మనకు విటమిన్-డి లభిస్తుంది.
ఒకేసారి బరువు పెరగడం, ఒకేసారి బరువు తగ్గడం వల్ల ఆస్టియోపొరోసిస్, ఎముకలు విరిగే ప్రమాదం ఉంది. అసలు ఆస్టియోపొరోసిస్ అంటే...ఎముకలు బలాన్ని కోల్పోయి బలహీనంగా మారడం. బలహీన పడటం వలన చిన్నచిన్న ప్రమాదాలకే ఎముకలు విరిగే ముప్పు ఎక్కువగా ఉంటుంది. జారిపడినప్పుడు పెద్దవాళ్ల తుంటి ఎముకలు విరగడం కూడా ఎముకలు బలహీనపడటం వల్లే జరుగుతుంది.
మహిళల్లో రుతుక్రమం ఆగిపోయిన తర్వాత సరైన బరువు ఉన్నప్పటికీ, ఎముకలను రక్షించే ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గిపోయే అవకాశం ఉంది. ఎక్కువ బరువు ఉండడం మాత్రం ఎముకలకు మంచిది కాదు. అది కేవలం ఎముకలు విరిగిపోవడం వంటి ప్రమాదాలనే కాకుండా, మరిన్ని ఆరోగ్య సమస్యలకు కూడా కారణంగా కావొచ్చు. ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి. వ్యాయామం, మంచి ఫుడ్ తీసుకోవాలి. శరీరానికి అవసరమైన మేరకు విటమిన్ డి అందేలా కొద్దిసేపు ఎండలో తిరిగేలా చూసుకోవాలి.
ఎముకలు బలంగా ఉండాలంటే
అతి బరువు ఎముకలకు మంచిది కాదు
జీవన శైలిలో అవసరమైన మార్పులు చేసుకోవాలి
వ్యాయామం, మంచి ఫుడ్ తీసుకోవాలి
విటమిన్ డి అందేలా కొద్దిసేపు ఎండలో తిరగాలి
కాల్షియం, విటమిన్ డి, ఉండే ఆహారం తీసుకోవాలి