ఈరోజు వరల్డ్ థైరాయిడ్ డే.. కాబట్టి మనం థైరాయిడ్ గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఆస్తమా, సైనస్, థైరాయిడ్.. వంటి సమస్యలు ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. దీంతో అవస్థలు పడుతున్నారు. వీటికి మందులు వాడటం ఒక పద్ధతి అయితే.. యోగా ద్వారా కూడా రోగాలను నయం చేసుకోవచ్చు.. అవును కొన్ని ఆసనాలు వేయడం వల్ల థైరాయిడ్‌తో పాటు ఆస్తమా,సైనస్ వంటి సమస్యలను తగ్గించుకోవచ్చు. అదే.. ఉష్ట్రాసనం. దీన్ని రోజూ వేయడం వల్ల ఎలాంటి శ్వాసకోశ సమస్య అయినా సరే తగ్గిపోతుంది. అలాగే థైరాయిడ్ గ్రంథులు బాగా పనిచేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్య నుంచి కూడా బయట పడవచ్చు. మరి ఈ ఆసనాన్ని ఎలా వేయాలంటే..
ఉష్ట్రాసనం వేసే విధానం..
ముందుగా నేలపై మోకాళ్ల మీద కూర్చోవాలి. తరువాత వెన్నెముకను నిటారుగా ఉంచి మోకాళ్ల మీదే ఉండి నిలబడాలి. రెండు అర చేతులను వెనుక పిరుదులపై ఉంచాలి. పిరుదులపై ఉంచిన చేతుల సపోర్ట్‌తో వెనక్కి వంగాలి. ముఖంతో పైకి చూడాలి. తరువాత పిరుదులపై ఉన్న చేతులను తీసేసి వాటితో రెండు పాదాలను పట్టుకోవాలి. ఈ భంగిమలో 6 నుంచి 10 సెకన్ల పాటు సౌకర్యంగా ఉన్నంత వరకు ఉండాలి. తరువాత మళ్లీ యథాస్థితికి రావాలి.
ఇలా ఉష్ట్రాసనాన్ని రోజూ కనీసం 5 నిమిషాల పాటు అయినా సరే చేయాలి. దీని వల్ల అనేక సమస్యలను తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా ఆస్తమా, సైనస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే థైరాయిడ్ గ్రంథుల పనితీరు మెరుగు పడుతుంది. థైరాయిడ్ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఉష్ట్రాసనం వల్ల ఉపయోగాలు..
ఈ ఆసనం వేయడం వల్ల మెదడుకు రక్త సరఫరా పెరుగుతుంది. దీంతో ముఖం కాంతివంతంగా మారుతుంది.
కాళ్లు, తొడలు, చేతులు, భుజాలు దృఢంగా మారుతాయి.
గొంతు సమస్యలు తగ్గుతాయి.
అలర్జీల నుంచి ఉపశమనం లభిస్తుంది.
గుండె, నడుం, ఛాతి, గర్భాశయం దృఢంగా మారుతాయి.
ఈ ఆసనాన్ని రోజూ వేయడం వల్ల ఊపిరితిత్తుల పనితీరు మెరుగు పడుతుంది.
ఊపిరితిత్తులు శుభ్రంగా మారుతాయి. ఇలా అనేక లాభాలు కలుగుతాయి.
గమనిక; ఈ ఆసనాన్ని గర్భిణీలు వేయరాదు.