బరువు తగ్గేందుకు మెంతులను ఇలా వాడండి చాలు..

మెంతులల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. Over weight ను త‌గ్గించ‌డంలోనూ మెంతులు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. Diabetes స‌మ‌స్య ఉన్న‌వారు కూడా రోజూ మెంతుల‌ను తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

బరువు తగ్గేందుకు మెంతులను ఇలా వాడండి చాలు..
Use Fenugreek to lose weight


మెంతుల వంటకాల్లో చాలా తక్కువగా వాడతారు. కానీ మెంతులు ల్లో ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. Over weight ను త‌గ్గించ‌డంలోనూ మెంతులు చ‌క్క‌గా ఉప‌యోగ‌ప‌డ‌తాయి. Diabetes స‌మ‌స్య ఉన్న‌వారు కూడా రోజూ మెంతుల‌ను తీసుకుంటే షుగ‌ర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి. మెంతుల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. దీని వ‌ల్ల పిండి ప‌దార్థాలు నెమ్మ‌దిగా జీర్ణం అవుతాయి. ఫ‌లితంగా బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ నియంత్ర‌ణ‌లో ఉంటాయి. అధిక బ‌రువు పెరుగుతున్నామ‌ని, బ‌రువు అధికంగా ఉన్నామ‌ని దిగులు చెందేవారు రోజూ మెంతుల‌ను తీసుకోవాలి. అందుకుగాను మెంతుల‌ను ఇలా వాడండి. 

అధిక బ‌రువు త‌గ్గేందుకు రోజూ మెంతుల నీళ్ల‌ను తాగాలి. ముందు రోజు రాత్రి మెంతులను నానపెట్టి.. రోజూ ఉదయం పరగడుపున ఆ నీటిని తాగాలి. నానిన మెంతులును కూడా తినొచ్చు. మీకు చేదుగా ఉంటాయేమో అని భయం ఉండొచ్చు. అస్సలు ఉండవు. అధిక బ‌రువు త‌గ్గుతారు.

ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో ఒక టీస్పూన్ మెంతుల‌ను వేసి బాగా మ‌రిగించాలి. నీరు బాగా మ‌రిగాక దాన్ని వ‌డ‌క‌ట్టి గోరు వెచ్చ‌గా ఉండ‌గానే క‌ప్పు మోతాదులో తాగేయాలి. ఈ నీటిని రోజుకు రెండు సార్లు తాగాలి. బ‌రువు త‌గ్గుతారు.

ఒక పాత్ర‌లో నీటిని తీసుకుని అందులో మెంతులు, అల్లం, దాల్చిన చెక్క వేసి బాగా మ‌రిగించాలి. అనంత‌రం ఆ నీటిలో కొద్దిగా తేనె క‌లిపి తాగాలి. ఇలా వారంలో 3 సార్లు తాగితే మంచి ప్ర‌యోజ‌నం ఉంటుంది.

మెంతుల‌ను మొల‌కెత్తించి కూడా తిన‌వ‌చ్చు. మొల‌కెత్తిన మెంతుల‌ను రోజూ గుప్పెడు మోతాదులో ప‌ర‌గ‌డుపునే తింటే బ‌రువు త‌గ్గుతారు.

ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపునే ఒక టీస్పూన్ మెంతుల‌ను కొద్దిగా తేనెతో క‌లిపి తినేయాలి. ఇలా రోజూ చేసినా అధిక బ‌రువును త‌గ్గించుకోవ‌చ్చు.
 
మెంతులతో పాటు మెంతి ఆకులు కూడా ఆరోగ్యానికి చాలా విధాలుగా మేలు చేస్తాయి.. మెంతి ఆకుల పొడి లేదా ఆకులతో కూరలు చేసుకుంటే.. బరువు తగొచ్చు. మధుమేహం ఉన్నవారు మెంతులను డైలీ ఒక స్పూన్‌ చొప్పున తిన్నా.. షుగర్‌ లెవల్స్‌ కంట్రోల్‌లో ఉంటాయి. 

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.