Weight loss with Milk : రోజు పాలు తాగితే.. బరువు ఈజీగా తగ్గొచ్చట..!

Weight loss with milk : అసలు పాలు తాగితే weight పెరుగుతారా అంటే అది కేవలం అపోహ మాత్రమే.. పాలు తాగితే బరువు తగ్గుతారట.. డైలీ ఒక గ్లాస్‌ పాలు తాగితే.. వెయిట్‌ కరెక్టుగా ఉంటుంది. బరువు తగ్గొచ్చు.! ఒక గ్లాసు పాల‌ను తాగితే 8 గ్రాముల మేర ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల పాల‌ను తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.

Weight loss with Milk : రోజు పాలు తాగితే.. బరువు ఈజీగా తగ్గొచ్చట..!
Weight loss with milk


Weight loss with Milk : చిన్నప్పుడు డైలీ ఒక గ్లాస్‌ milk తాగడం చాలామందికి అలవాటుగా ఉంటుంది. అదే అలవాటు నేటికి కొనసాగించే వారు మాత్రం తక్కువ. పాలు మనల్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పాలు తాగితే ఒంటికి బలం అని పెద్దొళ్లు అంటారు. దాంతో పాలు తాగితే weight పెరిగిపోతామేమో అని భయం అటు ఇటుగా లావుగా ఉన్నవాళ్లకు ఉంటుంది. అసలు పాలు తాగితే weight పెరుగుతారా అంటే అది కేవలం అపోహ మాత్రమే.. పాలు తాగితే బరువు తగ్గుతారట.. డైలీ ఒక గ్లాస్‌ పాలు తాగితే.. వెయిట్‌ కరెక్టుగా ఉంటుంది. బరువు తగ్గొచ్చు.! ఒక గ్లాసు పాల‌ను తాగితే 8 గ్రాముల మేర ప్రోటీన్లు ల‌భిస్తాయి. అందువ‌ల్ల పాల‌ను తాగితే అనేక ప్ర‌యోజ‌నాలు పొంద‌వ‌చ్చు.

వ్యాయామం చేసిన‌వారు పాల‌ను తాగ‌డం వ‌ల్ల శ‌క్తి ల‌భిస్తుంది. కండ‌రాలు మ‌ర‌మ్మ‌తుల‌కు గుర‌వుతాయి. పాల‌ను ఉద‌యం తాగితే రోజంతా క‌డుపు నిండినట్లు ఉంటుంది. ఆక‌లిని త‌గ్గించే హార్మోన్లైన జీఎల్‌పీ-1, పీవైవై, సీసీకే వంటి హార్మోన్ల స్థాయిలు పెరుగుతాయి. ఆక‌లిని పెంచే హార్మోన్ అయిన గ్రెలిన్ స్థాయిలు త‌గ్గుతాయి. దీంతో ఎక్కువ సేపు ఉన్నా ఆక‌లి వేయ‌దు. ఫ‌లితంగా ఆహారాన్ని త‌క్కువ‌గా తీసుకుంటారు. ఇది బ‌రువు త‌గ్గేందుకు ఉపయోగపడుతుంది.

న్యూట్రిష‌నిస్టులు చెబుతున్న ప్ర‌కారం.. రోజూ రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చని పాల‌ను తాగితే నిద్ర చ‌క్క‌గా ప‌డుతుంది. నిద్ర‌లేమి స‌మ‌స్య నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. పాల‌లో ట్రిప్టోఫాన్‌, మెగ్నిషియం, మెల‌టోనిన్ అనే పోష‌కాలు ఉంటాయి. ఇవి నిద్ర స‌మ‌స్య‌ల‌ను త‌గ్గిస్తాయి. నిద్ర చ‌క్క‌గా ప‌ట్టేలా చేస్తాయి.

పాల‌లో ప్రోటీన్లు ఎక్కువ‌గా ఉంటాయి. పాల‌ను రాత్రి నిద్ర‌కు ముందు తాగితే శ‌రీర మెట‌బాలిజం పెరుగుతుంది. క్యాల‌రీలు వేగంగా ఖ‌ర్చ‌వుతాయి. దీంతో బ‌రువు త‌గ్గుతారు. బాడీలో మెటబాలిజం బాగుంటే.. బరువు ఈజీగా తగ్గొచ్చు.. అన్నింటికి ఒకదానికి ఒక కనక్షన్‌ ఉంటుందిలే. పాల‌లో కాల్షియం, విటిమిన్‌ డి, లినోలీనిక్ యాసిడ్ వంటి పోష‌కాలు ఉంటాయి. ఇవి మెట‌బాలిజంను పెంచి బ‌రువు త‌గ్గేందుకు స‌హాయ ప‌డ‌తాయి.

రాత్రి పాల‌ను తాగితే బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. పోష‌కాలు ల‌భిస్తాయి. హైబీపీ కూడా త‌గ్గుతుంది. అందువ‌ల్ల రాత్రి నిద్ర‌కు ముందు ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని పాల‌ను తాగ‌డం అల‌వాటు చేసుకోవాలి. పాల‌లో కొవ్వు తీసిన పాలు అయితే ఇంకా బెటర్‌.. అందులో కొద్దిగా తేనె లేదా ప‌సుపు లేదా మిరియాల పొడి వంటివి క‌లిపి తాగితే అద‌న‌పు ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.