పద్మాసనం వేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తొడల దగ్గర కొవ్వు తగ్గించాలా..?

ఈ రోజుల్లో నేలపై కుర్చోనే అలవాటు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరికీ లేదు.. మనం చిన్నప్పుడు చాలాసార్లు కింద కుర్చోనే తినే వాళ్లం.. ఇక స్కూళ్లలో అయితే సాయంత్రం వరకూ కిందే కుర్చునే వాళ్లం.. అప్పుడు బెంచీలు ఎక్కడ ఉన్నాయి..

పద్మాసనం వేయడం వల్ల ఎన్ని ప్రయోజనాలో.. తొడల దగ్గర కొవ్వు తగ్గించాలా..?


ఈ రోజుల్లో నేలపై కుర్చోనే అలవాటు.. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎవరికీ లేదు.. మనం చిన్నప్పుడు చాలాసార్లు కింద కుర్చోనే తినే వాళ్లం.. ఇక స్కూళ్లలో అయితే సాయంత్రం వరకూ కిందే కుర్చునే వాళ్లం.. అప్పుడు బెంచీలు ఎక్కడ ఉన్నాయి.. కానీ నేడు డైనింగ్‌ టేబుల్స్‌, మంచాల మీద కూర్చుని భోజనం చేస్తున్నారు. స్కూళ్లలో బెంచీలు వచ్చాయి.. భోజనం చేసేటప్పుడు కింద కూర్చోలేకున్నా రోజులో ఏదో ఒక సమయంలో పద్మాసనం వేసి కాసేపు కూర్చోవచ్చు. దీని వల్ల పలు లాభాలు కలుగుతాయి..

Benefits of Doing Padmasana Daily

పద్మాసనం వేయడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయంటే..

పద్మాసనం వేయడం వల్ల తొడలలో ఉండే అదనపు కొవ్వు కరుగుతుంది. పిరుదుల వద్ద ఉండే కొవ్వు కూడా కరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. వెన్నెముక దృఢంగా మారతుంది. కంప్యూటర్ల ఎదుట కూర్చుని పనిచేసేవారు ఈ ఆసనం వేస్తే నొప్పులు తగ్గుతాయి. మెడ నొప్పి, కండరాల నొప్పులు ఉండవు.

పద్మాసనం వేసే విధానం

రెండు కాళ్లను చాపి కూర్చోవాలి. ముందుగా కుడికాలి పాదం ఎడమకాలి తొడపై, ఎడమ కాలి పాదాన్ని కుడి కాలి తొడపై ఉంచి కూర్చోవాలి. రెండు చేతులను కాళ్లపై ఉంచి నిటారుగా ఎలాంటి ఆలోచనలు లేకుండా శ్వాసపై ఏకాగ్రత, దృష్టి నిలపాలి. ఈ ఆసనంలో ఎంత సేపు వీలైతే అంత సేపు ఉండవచ్చు. తరువాత కాళ్లను నెమ్మదిగా చాపి విశ్రాంతి తీసుకోవాలి.

రాత్రి పూట నిద్రించేముందు ఐదు నిమిషాల పాటు ఈ ఆసనంలో ఉంటే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ఉదయం ఈ ఆసనం వేస్తే ఏకాగ్రత పెరుగుతుంది. యాక్టివ్‌గా ఉంటారు.

మీకు ఉదయం కుదరకపోయినా.. రోజు మొత్తంలో ఏదో ఒక సమయంలో వేయండి.. ఈ ఆసనాన్ని వేయడానికి ప్రత్యేకంగా ఎలాంటి సమయం లేదు.. ఎప్పుడైనా వేయొచ్చు. తినేప్పుడు కింద కుర్చోని తినండి.. ఇంకా మంచిది.. టీవీ చూసేప్పుడు కాసేపు ఈ ఆసనంలో ఉండి చూడండి.. మీరు వేయాలని అనుకుంటే.. ఎలా అయినా వేయొచ్చు..!

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.