ఉడికించిన కోడి గుడ్డుతో పాటూ బరువును తగ్గించే మిగిలిన ఆహార పదార్థాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!

ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వారంతా బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తూ కష్టపడడతో పాటు... తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. కొన్ని తినాలనిపించినా.. నోరు కట్టేసుకోక తప్పని పరిస్థితి. అయితే... ఏఏ పదార్థాలు తీసుకుంటే బరువు పెరుగుతారన్న విషయం తెలిసే ఉంటుంది కానీ.

ఉడికించిన కోడి గుడ్డుతో పాటూ బరువును తగ్గించే మిగిలిన ఆహార పదార్థాలు ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే!


ప్రస్తుతం చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. వారంతా బరువును నియంత్రణలో ఉంచుకునేందుకు తీవ్రంగా కసరత్తులు చేస్తూ కష్టపడడతో పాటు... తీసుకునే ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తలే తీసుకుంటూ ఉంటారు. కొన్ని తినాలనిపించినా.. నోరు కట్టేసుకోక తప్పని పరిస్థితి. అయితే... ఏఏ పదార్థాలు తీసుకుంటే బరువు పెరుగుతారన్న విషయం తెలిసే ఉంటుంది కానీ... బరువును తగ్గించే ఆహార పదార్థాలూ ఉన్నాయి. ఆరు రకాల ఈ పదార్ధాల వల్ల మీరు బరువు పెరగరని నిపుణుల మాట. మరి వాటి గురించి.. మీరూ తెలుసుకోండి. 

Weight Loss With Egg: గుడ్డుతో ఈ మూడింటిని కలిపి తింటే కిలోల కొద్ది బరువు  హాంఫట్.. అవేంటో తెలుసుకోండి - Telugu News | 3 Egg combinations that can  help you to reduce weight lose egg with

ఉడికించిన కోడిగుడ్డు తింటే బరువు తగ్గుతారంట. అవును మీరు చదువుతుంది కరెక్టే. ఉడికించిన గుడ్డులో ల్యూసిన్ అనే అమైనో యాసిడ్ బరువును తగ్గించడంలో సహాయపడుతుందంటా. అలాగే దానిమ్మ గింజలు సైతం మంచే చేస్తాయంటున్నారు నిపుణులు. వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. ఫలితంగా మరింత ఆహారం తీసుకోవాలని అనిపించదు.

ఆ తీరుగా అధిక బరువును నియంత్రిస్తాయి దానిమ్మ గింజలు. వీటిలో విటమిన్స్ అధికంగా ఉండి ఫ్యాట్ అసలు ఉండదు దీని ద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలు అన్ని అందుతాయి కానీ కొవ్వు మాత్రం కరుగుతుంది.

అలాగే.. వంటలకు వినియోగించే ఆయిల్ విషయంలో జాగ్రత్తగా ఉండమంటున్నారు. ఇతర ఆయిల్స్ ను పక్కకుపెట్టి.. ఆలివ్ ఆయిల్ను ఉపయోగిస్తే మంచిదని చెబుతున్నారు. ఈ నూనెలోని మోనో శాచ్యురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను కాపాడతాయి. కాబట్టి బరువు పెరిగే సమస్యే లేదంటున్నారు. 

ఇక మాంసాహార ప్రియులైతే.. అధిక కొవ్వు అనే కారణంగా మాంసం జోలికిపోకుండా ఉండిపోతుంటారు. ఇలాంటి వారికి చేపలు బెస్ట్ ఛాయిస్. ఎందుకంటే చేపల్లో కొప్పు ఉండదు. పైగా క్యాలరీలు చాలా తక్కువ. కాబట్టి... బరువు తగ్గించుకోవాలి అనుకునే వాళ్లు చేపలు తింటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. వీటితో పాటు.. పచ్చని కాయగూరలు, ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం వల్ల త్వరగా కడుపు నించినట్లు అనిపించి... ఎక్కువ ఆహారం తీసుకోకుండా నియంత్రణలో ఉంటాయి. కాబట్టి... ఈ ఆహార పదార్ధాల్ని ఎలాంటి సందేహాలు లేకుండా తీసుకోవచ్చని సలహా ఇస్తున్నారు ఆహార నిపుణులు.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.