కిడ్నీలు మన శరీరంలో అసలు ఏం పని చేస్తాయి..? పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

మాత్రపిండాల గురించి మనం ఇప్పటి వరకూ చాలానే విని ఉంటాం. ఇవి శరీరంలో ముఖ్యమైన అవయవాలని, వ్యర్థాలను తొలగిస్తాయని, రక్తాన్ని శుద్ధి చేస్తాయని. ఈరోజు మనం అసలు ఈ మూత్రపిండాలు శరీరంలో

కిడ్నీలు మన శరీరంలో అసలు ఏం పని చేస్తాయి..? పూర్తిగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే


మాత్రపిండాల గురించి మనం ఇప్పటి వరకూ చాలానే విని ఉంటాం. ఇవి శరీరంలో ముఖ్యమైన అవయవాలని, వ్యర్థాలను తొలగిస్తాయని, రక్తాన్ని శుద్ధి చేస్తాయని. ఈరోజు మనం అసలు ఈ మూత్రపిండాలు శరీరంలో ఏం ఏం పనులు చేస్తాయి, మనిషి ఆరోగ్యంగా ఉండటంలో వీటి పాత్ర ఏంటో క్లియర్‌గా చూద్దాం.. మనకు మన శరీరంలో ఉండే ప్రతి అవయవం మీద పూర్తి అవగాహన ఉండాలి, ఏదో నామ్‌కేవాస్తే నాలుగు ముక్కలు కాదు. పూర్తిగా తెలిసినప్పుడే మనమే చిన్న చిన్న సమస్యలకు డాక్టర్ల దగ్గరకు పోకుండా కావాల్సిని తింటే సరిపోతుంది. తెలిసి తెలియకు చేసే తప్పులను కూడా తగ్గించుకోవచ్చు. మూత్ర పిండాల విలువ తెలిస్తే అయినా మనం తప్పులు చేయకుండా ఉంటాం.
The Structure and Function of the Kidneys
మ‌న శ‌రీరంలో ముఖ్య‌మైన అవ‌యవాల్లో మూత్ర‌పిండాలు కూడా ఒక‌టి. ఇవి రోజుకు గంట‌కు రెండు సార్లు 5 లీట‌ర్ల ర‌క్తాన్ని శుద్ది చేస్తూ శ‌రీరంలోని మ‌లినాల‌ను, విష ప‌దార్థాల‌ను తొల‌గిస్తూ ఉంటాయి. రోజూ 48 సార్లు 5 లీట‌ర్ల ర‌క్తాన్ని ఇవి శుద్ది చేస్తూ ఉంటాయి.
మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో ఎక్కువ‌గా ఉండే నీటిని మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తుంది. అలాగే ఈ మూత్రంతో శ‌రీరంలోని వ్య‌ర్థాల‌ను, టాక్సిన్స్‌ను కూడా రోజూ బ‌య‌ట‌కు పంపిస్తాయి. అదే విధంగా ర‌క్తంలో ఆమ్ల‌త‌త్వం పెర‌గ‌కుండా నిరోధించ‌డంలో కూడా మూత్ర‌పిండాలు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. శ‌రీరంలో నీటి శాతం త‌క్కువ‌గా ఉన్న‌ప్పుడు మిగిలిన నీరు కూడా మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పోకుండా శ‌రీరం మ‌రింత డీహైడ్రేష‌న్‌కు గురికాకుండా కాపాడ‌డంలో కూడా మూత్ర‌పిండాలు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. 
 
ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో కూడా మూత్ర‌పిండాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి. రక్త‌పోటును అదుపులో ఉంచే హార్మోన్ల‌ను మూత్రపిండాలే విడుద‌ల చేస్తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తిన్న వారికి బీపీ అదుపులో ఉండ‌దు. ఎండ వ‌ల్ల మ‌న శ‌రీరానికి అందిన మ‌న విట‌మిన్ డి మ‌న శ‌రీరానికి ప‌ట్టేలా చేయ‌డంలో కూడా మూత్ర‌పిండాలు ముఖ్య‌పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు దెబ్బ‌తిన్న వారిలో ర‌క్తం ఉత్ప‌త్తి త‌గ్గి ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌లెత్తుతుంది. మ‌నం వాడే మందుల్లో ఉండే ర‌సాయ‌నాల‌ను, విష ప‌దార్థాల‌ను 80 శాతం వ‌ర‌కు మూత్రపిండాలు మూత్రం ద్వారా బ‌య‌ట‌కు పంపిస్తాయి. 
మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే ర‌సాయ‌నాలు, పురుగు మందులను కూడా విఛ్చినం చేసి మూత్ర‌పిండాలు బ‌య‌ట‌కు పంపిస్తాయి. మూత్ర‌పిండాల ఆరోగ్యం దెబ్బ‌తింటే ఈ విష ప‌దార్థాలు, ర‌సాయ‌నాల్ని కూడా శ‌రీరంలో పేరుకుపోతాయి. ర‌క్తంవిష పూరిత‌మ‌వుతుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలను అదుపులో ఉంచ‌డంలో కూడా మూత్ర‌పిండాలు మ‌నకు దోహ‌ద‌ప‌డ‌తాయి.
ర‌క్తంలో మిన‌ర‌ల్స్ స్థాయిలు త‌గ్గ‌కుండా మిన‌ర‌ల్స్ స్థాయిల‌ను క్ర‌మ‌బ‌ద్దీకరించ‌డంలో కూడా మూత్ర‌పిండాలు స‌హాయ‌ప‌డ‌తాయి. ఇలా అనేక ర‌కాల విధుల‌ను మూత్ర‌పిండాలు మ‌న శ‌రీరంలో చేస్తాయి. వీటి ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం చాలా అవ‌స‌రం. 
డ‌యాబెటిస్, హైబీపీ వంటి స‌మ‌స్య‌లు మూత్ర‌పిండాల ఆరోగ్యాన్ని ఎక్కువ‌గా దెబ్బ‌తీస్తాయి. ఇటువంటి అనారోగ్య స‌మ‌స్య‌ల బారిన ప‌డ‌కుండా చూసుకోవాలి. అలాగే ఈ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారు వీటిని ఎల్ల‌ప్పుడూ అదుపులో ఉంచుకోవాలి. ఉప్పును త‌క్కువ‌గా తీసుకోవాలి. నిల్వ ప‌చ్చ‌ళ్ల‌ను తీసుకోకూడ‌దు. రోజూ 4 నుంచి 5 లీట‌ర్ల నీటిని తాగాలి. ఈ నియ‌మాల‌ను పాటించ‌డం వ‌ల్ల మ‌నం జీవించినంత కాలం మూత్ర‌పిండాలు దెబ్బ‌తినకుండా కాపాడుకోవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.