Flurona : ఫ్లూరోనా లక్షణాలు ఏ ఒక్కటి మీలో కనిపించినా వెంటనే ఇలా చేసేయండి..!
Flurona ఇప్పుడు ఒమిక్రాన్ పాటు.. ఫ్లూరోనా కూడా ట్రెండింగ్ లో ఉంది. ఈ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు జలుబు, గొంతులో అన్ ఈసీగా ఉంటుంది, బాడీ పెయిన్స్ తోపాటు జ్వరం, కఫం, శ్లేష్మాలు కూడా ఎక్కువ పట్టేస్తుంటాయి. అందుకే వైరస్ ను ఫ్లూను కలిపి ఫ్లూరోనా అని పేరు

Flurona : ఇప్పుడు ఒమిక్రాన్ పాటు.. ఫ్లూరోనా కూడా ట్రెండింగ్ లో ఉంది. సీజనల్ గానే ఫ్లూ ఇన్ఫెక్షన్ చాలా సహజంగా అందిరిలో వస్తుంది. ఈ ఇన్ఫెక్షన్ మనకు వచ్చినప్పుడు జలుబు, గొంతులో అన్ ఈసీగా ఉంటుంది, బాడీ పెయిన్స్ ఉంటాయి. వీటిపాటు జ్వరం, కఫం, శ్లేష్మాలు కూడా ఎక్కువ పట్టేస్తుంటాయి. ఇవన్నీ ఒమిక్రాన్ కు, డెల్టా ప్లస్ వైరస్ కు, వచ్చే లక్షణాలే. కాబట్టి చాలా మందికి ఇవి సరిగ్గా ఏ లక్షణాలు అనేవి తెలియటంలేదు. అందుకే వైరస్ ను ఫ్లూను కలిపి ఫ్లూరోనా అని పేరు పెట్టారు. ఇలాంటివి వచ్చినప్పుడు ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఈ ఫ్లూ ఎక్కువైనా, వైరస్ ఎక్కువైనా..లంగ్స్ లో శ్లేష్మాలు ఎక్కువగా తయారు చేసి, ఒత్తిడి ఎక్కువగా కలిగించి నిమోనియా కూడా కలిగించే అవకాశం లేకపోలేదు.
కొంతమందిలో ఇన్పెక్షన్ ఎక్కువై ఆక్సిజన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. జలుబు, దగ్గు అనేవి ఈ సీజన్ లో కామన్.. మనకు ఒకవేళ ఇలాంటివి వచ్చినా..సాధారణ జలుబు, దగ్గే కదా అని అశ్రద్ధ చేస్తుంటారు. కానీ పైన చెప్పిన ఓ ఒక్క లక్షణం కనిపించినా..వైరస్ అనుకునే భావించి..చికిత్స చేయడం ఉత్తమం. ఈ లక్షణాలు కనిపించినప్పుడు త్వరగా ఉపశమనం రావాలంటే ఏం చేయాలో చూద్దాం.
ఇలాంటి లక్షణాలు ఏవి మీలో కనిపించినా.. లైట్ తీసుకోకుండా.. కాస్త శ్రద్ధపెట్టి.. ఎక్కువ ఫుడు తినకుండా అవసరమైనంత తినండి..
బాడీకీ బాగా రెస్ట్ ఇవ్వండి. మనకు వచ్చిన ట్రబుల్ ను తగ్గించడానికి రక్షణవ్యవస్థ రంగంలోకి దిగుతుంది. అప్పుడు మీరు పొట్టకు రెస్ట్ ఇస్తే.. అది అనేక రెట్లు ఎక్కువ ఫోర్స్ తో వైరస్ పై దాడి చేస్తుంది.
కాబట్టి ఫ్లూరోనా లక్షణాలు ఏవి మీలో కనిపించినా.. ఒక రెండు రోజులు తినటం మానేసి... తేనె, నిమ్మరసం నీళ్లతో పాస్టింగ్ చేయాలి.
రోజులో 5-6 సార్లు ఒక గ్లాసు నీళ్లలో 5స్పూన్ల తేనె, ఒక నిమ్మకాయ పిండుకుని తాగండి.
మధ్యలో అవసరమైతే కొబ్బరినీళ్లు తాగండి. తేన, నిమ్మరసం నీళ్లు తాగిన కొద్దిసేపటికి తాగాలనిపిస్తే.. వాటర్ తాగండి.
లక్షణాలు కనిపించినప్పుడే ఇది మొదలుపెడితే..వైరస్ తీవ్రతరం కాకుండా..శరీరం ఇన్పెక్షన్ పై పోరాడి తేలిగ్గా లంగ్స్ లోకి ఆ ఇన్పెక్షన్ వెళ్లి దాడి చేయకుండా రక్షించే అవకాశం ఉంటుంది. ఇలా చేయగలిగితే.. ఫ్లూరోనా నుంచి తేలిగ్గా బయటపడొచ్చు. లక్షణాలు తీవ్రతరం అయితే.. అప్పుడు డాక్టర్ ను సంప్రదించవచ్చు. మీరు జలుబు, దగ్గు ఉన్నప్పుడే ఇలా చేస్తే వైరస్ ను అడ్డుకట్ట వేసినట్లే అవుతారు.
జలుబు, దగ్గు ఉంటే.. ముందు టెస్ట్ చేయించుకుని ఈ లక్షణాలు తగ్గేవరకూ ఇలా చేయండి. దీంతోపాటు..ఫేషియల్ స్ట్రీమ్ రోజు రెండు మూడు సార్లు తీసుకోండి. ఇంట్లో ఆక్సీమీటర్లు ఉండే రోజుకు రెండుసార్లు చెక్ చేసుకోండి. 94-95 పైన ఉంటే.. అసలు ఏమీ కంగారు పడాల్సిన అవసరం లేదు. అంతకంటే తగ్గినప్పుడు వైద్యులను సంప్రదించండి.
కామన్ గా వచ్చే ఈ ఫ్లూ లక్షణాలు ఉన్నప్పుడు మనవంతు పని మనం చేసినప్పుడు రక్షణవ్యవస్థ ఆ వైరస్ పై దాడి చేసి క్రిములను చంపడంతోపాటు వాటికి సంబంధించిన యాంటీబాడీస్ ను బాగా పుష్కలంగా మనకు అందించే అవకాశం ఉంటుందని ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
- Triveni Buskarowthu