శృంగారం చేస్తున్నట్లు వచ్చే కలలకు మీనింగ్‌ ఏంటి..? ఇలాంటి వ్యక్తులతో అలాంటి కలలు ఎందుకు వస్తున్నాయి..?

ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవి సంభోగం చేస్తుంది. అది మనిషి అయినా, మృగం అయినా సరే.. సెక్స్‌ వల్ల వచ్చే కిక్‌ను ఎంజాయ్‌ చేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల సెక్స్‌లో అందరూ సంతృప్తి చెందకపోవచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి.. అప్పుడప్పు సెక్స్‌కు సంబంధించిన కలలు కూడా వస్తాయి

శృంగారం చేస్తున్నట్లు వచ్చే కలలకు మీనింగ్‌ ఏంటి..? ఇలాంటి వ్యక్తులతో అలాంటి కలలు ఎందుకు వస్తున్నాయి..?


Relation : ఈ సృష్టిలో ప్రాణం ఉన్న ప్రతి జీవి సంభోగం చేస్తుంది.  అది మనిషి అయినా, మృగం అయినా సరే.. సెక్స్‌ వల్ల వచ్చే కిక్‌ను ఎంజాయ్‌ చేస్తారు. అయితే కొన్ని కారణాల వల్ల సెక్స్‌లో అందరూ సంతృప్తి చెందకపోవచ్చు. మనం నిద్రపోతున్నప్పుడు ఎన్నో కలలు వస్తుంటాయి.. అప్పుడప్పు సెక్స్‌కు సంబంధించిన కలలు కూడా వస్తాయి. మరి సెక్స్‌ డ్రీమ్‌కు మీనింగ్‌ ఏంటో చూద్దామా..? డ్రీమ్‌లో సెక్స్‌ చేసే వ్యక్తులు ఎవరెవరో ఉంటారు.. మరీ వారిని బట్టి వాటికి అర్థాలేంటో చూసేయండి..!
Fear Of Breakup May End Your Romantic Relationship

సెక్స్ కలలు, వాటి అర్థాలు

అపరిచితులతో సెక్స్

కొంతమందికి కలలో శృంగారం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది.  కానీ చేసేవారి ముఖంమీకు కనిపించదు. సెక్స్ గురించి కలలు కనడం తెలియని వ్యక్తి పట్ల మీ ప్రేమను సూచిస్తుంది. తెలియని వాటిని అన్వేషించాలనే కోరిక చాలా మందికి ఉంటుంది. మీరు పబ్లిక్‌లో అపరిచితుడి పట్ల ఆకర్షితులవుతున్నట్లు అనిపిస్తే, మీ నిద్రలో అలాంటి కలలు వస్తాయట.

తెలిసిన వారితో సెక్స్

మన జీవితంలో ఫ్రెండ్స్‌, కోలీగ్స్‌, క్రష్‌ చాలా మంది ఉంటారు.. వారి మీద మీకు లైంగిక కోరికలు ఉండొచ్చు.. కానీ అవి వారికి డైరెక్టుగా చెప్పలేరు. చెప్తే చెప్పు తీసుకుంటారని భయపడొచ్చు..తప్పులేదు.. అలాంటి సందర్భాల్లో మీకు అవి కోరికలు రూపంగా వస్తాయి. తెలిసిన వారి గురించి లైంగిక కలలు కనడం  అంటే మీరు ఆ వ్యక్తి పట్ల లైంగికంగా లేదా ప్రేమపూర్వకంగా భావాలను పెంచుకున్నారని అర్థం.

మాజీతో సెక్స్

సాధారణంగా సెక్స్ కలలలో మన మాజీ కూడా రావొచ్చు.. ఇలాంటి కలలు వస్తే.. మీ మాజీతో మీరు సరిగా చేయలేదని, ఆ జంట మధ్య విషయాలు ఇంకా సరిగ్గా జరగలేదని సూచిస్తుంది. సంబంధాలు అసంపూర్తిగా ముగిసిపోవడంలాంటివి ఈ సెక్స్ కలలకు దారి తీస్తుందని అర్థం.. సెక్స్ అనేది సాన్నిహిత్యానికి అత్యున్నత రూపం.. మీ మాజీ గురించి ఇంకా కలలు కనడం చేస్తున్నారంటే.. ఇంకా వారిపై మనసులో ఏదో ఓ మూలన మీకు కోరిక ఉందని చెప్పవచ్చు.

ప్రముఖులతో సెక్స్

సాధారణమైన సెక్స్ కలలలో ప్రముఖులు కూడా రావొచ్చు.. మీకు ప్రభాస్‌, మహేష్‌ బాబు, విజయ్‌ దేవరకొండా ఇష్టం ఉండొచ్చు. వారి బాడీ మీకు బాగా నచ్చొచ్చు..అలాగే అబ్బాయిలకు కూడా హీరోయిన్ల మీద ఇష్టం ఉంటుంది.. ఆ ఇష్టం వల్ల.. మీ కలలో వారు వస్తుంటారు. సెక్స్‌లో పాల్గొనాలని మీరు తరచుగా కలలు కనే సెలబ్రిటీతో మీకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలో గుర్తించొచ్చు. ఇది మీ మానసిక స్థితిని బట్టి కూడా మారవచ్చు.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.