Newborn care : శిశువు పుట్టిన వెంటనే ఏం చేయాలి అంటే.. 

Newborn care : అప్పుడే పుట్టిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది అందుకే వీరికి కచ్చితంగా చేయవలసిన చేయకూడని పనులు ఉంటాయి.. బిడ్డ పుట్టిన వెంటనే శుభ్రమైన, మెత్తని పొడిగుడ్డతో మొత్తం శరీరం అంతా తుడవాలి...

Newborn care : శిశువు పుట్టిన వెంటనే ఏం చేయాలి అంటే.. 
What to do immediately after the birth of the baby


Newborn care : బిడ్డ పుట్టిన వెంటనే కచ్చితంగా చేయవలసిన కొన్ని పనులు ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా రోజు ఎందరో పుడుతూనే ఉన్నా ఎన్నో ఏళ్లుగా మనకి తెలిసి ఉన్నా కానీ చిన్న చిన్న విషయాల్లో తప్పులు చేస్తూ ఉంటాము అయితే ఎంత సున్నితంగా ఉండే చిన్నపిల్లల విషయంలో మరింత జాగ్రత్త అవసరం అందుకే అసలు ఒక బిడ్డ పుట్టి పుట్టగానే ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం.. 

అప్పుడే పుట్టిన పిల్లలు చాలా సున్నితంగా ఉంటారు. వాళ్ళ శరీరం చాలా సుకుమారంగా ఉంటుంది అందుకే వీరికి కచ్చితంగా చేయవలసిన చేయకూడని పనులు ఉంటాయి.. బిడ్డ పుట్టిన వెంటనే శుభ్రమైన, మెత్తని పొడిగుడ్డతో మొత్తం శరీరం అంతా తుడవాలి...

అలాగే బిడ్డను తల్లి పొట్టపై స్థానాలు మధ్యగా పడుకోబెట్టి పొడి బట్టను కప్పాలి.. అయితే బిడ్డ శరీరం పైన ఉన్న రక్తపు మరకలు లాంటివిని తుడవాల్సిన అవసరం లేదు.. బిడ్డ శరీరం పైన ఉండే రక్తపు మరకలు, వెర్నిక్స్ తుడవాల్సిన అవసరం లేదు.. ఇందులో ఉండే కొన్ని రకాల ఎంజైములు సూక్ష్మక్రిముల నుంచి కాపాడుతాయి.. 

ఆ పసి బిడ్డకు స్నానం చేయించినప్పుడు బాగా మరిగించిన నీళ్లను చల్లగా అయిన తర్వాత చేయించాలి అలా కాకుండా కొందరు సగం వేడి నీళ్లు కలిపి చేయిస్తారు ఇలా చేయించడం వల్ల సూక్ష్మ క్రిములు పూర్తిగా నశించవు అలాగే పిల్లల కోసం మార్కెట్లోకి వచ్చిన కొత్త రకాల సబ్బులు షాంపూలు వంటి వాటిని ప్రయత్నించకుండా నిపుణుల సలహా మేరకు తెలిసినవి ఉపయోగించడం మేలు.. అయితే పసిబిడ్డ పుట్టిన వెంటనే స్నానం చేయించాల్సిన అవసరం లేదు..  మారీ తప్పనిసరి అనుకుంటే ఆరు గంటలు దాటిన తర్వాత చేయించాలి.. అప్పటివరకు కూడా నీళ్లల్లో ముంచటం, నూనె రాయటం వంటి పనులు చేయకపోవడం మంచిది... స్నానం చేయించకపోతే కొన్ని గంటలు అయిన తర్వాత నూనెలో ముంచిన మెత్తని తువ్వాలు తో శరీరం మొత్తం తుడిచి బట్టలు తొడగాలి..  అలాగే తలా, కాళ్లు, చేతులు అన్నింటిని కప్పే విధంగా ఏదో ఒకటి వేయాలి.. దాదాపు ఐదు రోజుల తర్వాత బొడ్డుతాడు పూర్తిగా ఎండిపోయి రాలిపోతుంది.. అప్పటివరకు వేడి నీటిలో ముంచిన వస్త్రంతో తుడిచి ఇలా బొడ్డుతాడు రాలిపోయాక స్నానం చేయించడం మంచిది

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.