Women needs from their husband : ఆడవారు తమ భర్త నుంచి ఏం కోరుకుంటారంటే... !
భార్యాభర్తల మధ్య ఎప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సాధారణ విషయమే. అయితే భార్య భర్తల మధ్య వచ్చే గొడవల్లో ఎక్కువగా women needs from their husband అర్థం కావడం లేదని..

భార్యాభర్తల మధ్య ఎప్పుడు చిన్న చిన్న గొడవలు రావడం సాధారణ విషయమే. అయితే భార్య భర్తల మధ్య వచ్చే గొడవల్లో ఎక్కువగా women needs from their husband అర్థం కావడం లేదని.. వారి కోసం ఎంత చేసిన ఇంకా ఏదో అసంతృప్తిలో ఉంటారని చెబుతూ ఉంటారు. అయితే భార్య భర్త నుంచి ఏం కోరుకుంటారో చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు..
ఆడవారు ఏ విషయాన్ని మనసు విప్పి చెప్పరు. ప్రతి విషయాన్ని భర్త అర్థం చేసుకోవాలని కోరుకుంటారు. అయితే మగవారికి అంత ఆసక్తి ఉండదు. ముఖ్యంగా సంపాదన, కుటుంబ బాధ్యతల్లో పడి ప్రతి విషయాన్ని అంతగా పట్టించుకునే తీరిక ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకొని భార్యలు కొన్ని సందర్భాల్లో భర్త తమ విషయంలో అజాగ్రత్త వహిస్తున్నాడని అనుకుంటారు. అలాగే అశ్రద్ధ చూపిస్తున్నాడని అపోహ పడే అవకాశం ఉంటుంది. ఇలా కాకుండా భార్య భర్తలు ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉంటే ఎలాంటి గొడవలు రావని తెలుస్తోంది. అంతేకాకుండా ఎక్కువగా భార్యలు భర్తల నుంచి ఏం కోరుకుంటారో కూడా చెబుతున్నారు..
భార్య ముఖ్యంగా ప్రేమ, ఆప్యాయత కోరుకుంటుంది. అలాగే తన విషయంలో శ్రద్ధ చూపించాలని తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని గుర్తుంచుకోవాలని అనుకుంటుంది. ముఖ్యంగా ఇంటి పట్టున ఉండే ఆడవారిలో ఇది మరింత ఎక్కువగా కనిపిస్తుంది. వారికి భర్త ఇల్లు మాత్రమే ప్రపంచం అవ్వడం వల్ల భర్త ఏ మాత్రం అశ్రద్ధ చూపించిన వారు తట్టుకోలేరు..
భార్యా భర్తల మధ్య కమ్యూనికేషన్ ఉండటం చాలా అవసరం. అలాగే తీరిక దొరికినప్పుడల్లా కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. మనసులో ఉన్న అపోహలు, అనుమానాలు పోగొట్టుకోవాలి. ఒకరి మీద మరొకరికి ఉండే ప్రేమను వ్యక్తపరుచుకోవాలి. అలాగే భర్త కనీసం భార్యను సెలవు రోజుల్లో అయినా బయటకు తీసుకువెళ్లడం, ప్రేమగా కాసేపు మనసు విప్పి మాట్లాడటం వంటివి చేయాలని భార్య కోరుకుంటున్నట్లు తెలుస్తోంది..
అలాగే ప్రతి విషయంలో తన భర్త తనకు సహకారంగా ఉండాలని.. ముఖ్యంగా అత్తవారి ఇంటి నుంచి వచ్చే కొన్ని విషయాలు ఆడవారికి ఇబ్బంది కలిగిస్తాయని.. వాటిలో భర్త తనకు తోడు ఉండాలని కోరుకుంటునట్లు తెలుస్తోంది. కొత్త ప్రపంచంలో తనకు ఏమీ అర్థం కాని పరిస్థితుల్లో భర్త ప్రోత్సాహం తప్పనిసరిగా భార్య కోరుకుంటుందని చెబుతున్నారు నిపుణులు..
అలాగే భార్యకు నమ్మకాన్ని ఇవ్వాలని ఎలాంటి కష్టంలోనైనా తనకు తోడుగా మీరు నిలబడతారని హామీ ఇవ్వాలని తెలుస్తోంది. అలాగే భర్త పూర్తి ప్రేమ తనకు మాత్రమే సొంతమని భార్య నమ్మేటట్టు భర్త తీరు ఉండాలని.. ఇది ప్రతి ఒక్క భార్య కోరుకుంటున్నట్టు తెలుస్తోంది...
అలాగే పరాయి స్త్రీలతో భర్త మాట్లాడటం, చనువుగా ఉండటం వంటివి భార్య తట్టుకోలేదని.. అంతేకాకుండా ఇలాంటి విషయాలు దాచిపెట్టడం సైతం వారికి ఇబ్బంది కలిగిస్తాయని తెలుస్తోంది.
అలాగే భార్య ఆలోచనలను గౌరవించాలని.. ఆమెకు కొంత స్వేచ్ఛను ఇవ్వాలని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రతి విషయాన్ని ఆమెతో పంచుకోవాలని.. ముఖ్యంగా ఆర్థిక సంబంధమైన విషయాలు ఆమె దగ్గర దాయటం కష్టంగా అనిపిస్తుందని.. ఇలాంటి విషయాలు అన్ని భార్యలతో పంచుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు రావని తెలుస్తోంది..