వైట్ డిశ్చార్జ్ అవుతుందా లేడీస్.. ఉసిరి విత్తనాలతో ఇలా చేయండి..
ఉసిరికాయలను తినడం లేదా వాటి జ్యూస్‌ను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉసిరికాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను

ఉసిరికాయలను తినడం లేదా వాటి జ్యూస్‌ను తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఉసిరికాయల్లో అనేక పోషకాలు ఉంటాయి. జలుబు, ఫ్లూ వంటి సమస్యలను తగ్గించడంతోపాటు రోగ నిరోధక శక్తి పెరిగేందుకు ఈ కాయలు బాగా ఉపయోగపడతాయి.. ఇక ఆడవాళ్లకు పిరియడ్స్‌కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక సమస్య ఉంటుంది. అవి లేవంటే.. చాలామంది మహిళల్లో కొన్నిసార్లు వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ముఖ్యంగా పిరియడ్స్ వచ్చే ముందు ఇలా జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి నొప్పి ఉండదు కానీ.. ఇలా జరగడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి.. అయితే మనం ఈరోజు ఉసిరికాయతో వైట్ డిశ్చార్జి సమస్యను ఎలా తగ్గించుకోవాలో చూద్దాం..!
ఉసిరి కాయల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది నారింజల్లో ఉండే విటమిన్ సి కన్నా 20 రెట్లు ఎక్కువ. అలాగే ఉసిరిలో వివిధ రకాల ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇవి జ్ఞాపకశక్తిని పెంచుతాయి. వీటిల్లో ఉండే విటమిన్ బి5, బి6, కాపర్, మాంగనీస్, పొటాషియంలు మనకు పోషణను అందిస్తాయి. ఉసిరికాయలను మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు. వైట్ డిశ్చార్జి అయ్యే మహిళలు మాత్రం ఉసిరి విత్తనాలను పొడి చేసి తీసుకోవాలి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.
ఉసిరి విత్తనాల పొడి మనకు మార్కెట్‌లో లభిస్తుంది. లేదా దాన్ని నేరుగా కూడా తయారు చేసుకోవచ్చు. అందులో సరిపడా తేనె లేదా బెల్లంను కలిపి మెత్తని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. దీన్ని గాలి చొరబడని సీసాలో నిల్వ చేసుకోండి.
ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఉసిరి విత్తనాల మిశ్రమాన్ని ఒక టేబుల్ స్పూన్ మోతాదులో కలిపి రోజూ ఉదయాన్నే తాగాలి. కొందరు మహిళలకు తెలుపు రంగులో కాకుండా పసుపు లేదా గ్రీన్ కలర్‌లో కూడా డిశ్చార్జి అవుతుంది. ఇది సహజమే. అయితే కొందరికి ఈస్ట్రోజన్ హార్మోన్ అసమతుల్యతలు లేదా ఇన్‌ఫెక్షన్ల కారణంగా ఈ సమస్య వస్తుంటుంది. ఇన్‌ఫెక్షన్ ఎక్కువగా ఉంటే డిశ్చార్జి ఎక్కువగా అవుతుంది. అయితే ఒకసారి ఈ సమస్య తగ్గితే మళ్లీ మళ్లీ వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఉసిరికాయ విత్తనాలను పై విధంగా వాడుకుంటే వాపులు తగ్గడంతోపాటు ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. దీంతో ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. ఈ మిశ్రమాన్ని కనీసం ఒక వారం పాటు తీసుకుంటే చక్కని ఫలితం కనిపిస్తుంది.
వీళ్లకు వద్దు..
రక్తాన్ని పలుచగా చేసే మందులను వాడేవారు లేదా శస్త్ర చికిత్స అయిన వారు ఈ మిశ్రమాన్ని వాడరాదు. ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు లేదా గర్భం దాల్చాలని చూస్తున్న మహిళలు కూడా ఈ మిశ్రమాన్ని వాడరాదు.