మహిళలను వెంటాడుతున్న సమస్యలు..

Women health : ఇంట్లో పనులు చేసుకుంటూనే బయటిపనులు కూడా చక్కదిద్దుకుంటున్నారు. ప్రతి రంగంలోనూ తమదైనా ముద్రను వేస్తున్నారు మహిళలు. ఆఫీస్, ఇంటి పనుల్లో నిమగ్నమైపోవడంతో తమ ఆరోగ్యాల గురించి పట్టించుకోవడం మానేశారు. 

మహిళలను వెంటాడుతున్న సమస్యలు..
Women health problems


ఆడవాళ్లు మీకు జోహార్లు అనే పదం ఎన్ని సార్లు చెప్పినా తక్కువేఎందుకంటే నేటి మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారురాజకీయాలుసైనిక వ్యవస్థలతో పాటు నింగిలోకి కూడా చొచ్చుకుపోతున్నారుమగవారు చేసే ప్రతి పనిని ఆధునిక మహిళలు సునాయాసంగా చేసేస్తున్నారు.

ఇంట్లో పనులు చేసుకుంటూనే బయటిపనులు కూడా చక్కదిద్దుకుంటున్నారుప్రతి రంగంలోనూ తమదైనా ముద్రను వేస్తున్నారు మహిళలుఆఫీస్ఇంటి పనుల్లో నిమగ్నమైపోవడంతో తమ ఆరోగ్యాల గురించి పట్టించుకోవడం మానేశారుఅందరికీ అన్నీ పనులు చేశాక తినడం.....మిగిలిపోయింది కదా అని కడుపులో వేసేసుకుంటారుసరైన సమయానికి తినకపోవడంతో అనారోగ్య సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారుతమకంటూ సమయం ఇవ్వలేకపోతున్నారుతినే ఆహారంపైనా శ్రద్ధ పెట్టడం లేదుఎంత తింటున్నారో కూడా పట్టించుకోవడం లేదు.

అయితే ఇలా అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారుకాస్త సమయమైనా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారుసాధారణంగానే మహిళల శరీర తత్వం....పురుషుల కంటే భిన్నంగా ఉంటుందిరకరకాల ఆలోచనలుఇంటి పనులుఅనారోగ్యాలుహార్మోన్ల అసమతుల్యతతో సతమతమవుతుంటారునెలసరిగర్భదారణమోపాజ్‌ వంటివి ఉండటం స్త్రీలు మంచి ఆహారం తీసుకోకపోతే ఆ ప్రభావం నెలసరిపై కచ్చితంగా పడుతుందిసంతాన సమస్యలపైనా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

ముందు నుంచి మహిళలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారుపీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ రూపంలో రక్తం బయటకు వచ్చేస్తుందిఅంతేకాదు.....ప్రసవం సమయంలోనూ రక్తం పోతుందిదానివల్ల ఐరన్ లోపం కచ్చితంగా వస్తుందిరక్తం పోవడం వల్ల తల తిరగడంఅలసటఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుందిప్రస్తుత కాలంలో ఆహారపద్ధతుల్లో మార్పులు రావడం వల్ల మహిళల్లో ఎముకల క్షీణత పెరుగుతోందిపురుషులైనమహిళలైనా శరీరానికి అవసరమైనది కాల్షియం మహిళల్లో విటమిన్ B9 లోపిస్తే రక్తహీనత వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారుఅదే గర్భిణుల్లో ఉంటే పుట్టే పిల్లల నాడీ వ్యవస్థలో లోపాలు ఉండే అవకాశం తలెత్తే ప్రమాదం ఉందిశరీరంలో అయోడిన్ స్థాయి తక్కువగా ఉంటేథైరాయిడ్ గ్రంధి విస్తరించిగాయిటర్ అనే సమస్య వస్తుందికొంతమంది బరువు పెరుగుతారుదీంతో పాటు శరీరం బలహీనతఅలసటజుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి.

విటమిన్ డి లోపం వల్ల ఆయాసంవెన్నునొప్పిజుట్టు రాలడంగాయాలు మానకపోవడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయివిటమిన్‌ డీ పొందాలంటే.. ఉదయాన్నే నీరెండలో ఓ అరగంట పాటు ఉంటే మంచిది

మహిళలు తినాల్సిన ఆహారం

ఐరన్ లోపం నుంచి బయటపడాలంటే మాంసంచేపలుఆకుకూరలుడ్రైఫ్రూట్స్‌బీన్స్‌పప్పుధాన్యాలుసోయాటొమాటోబంగాళాదుంపలుపుట్టగొడుగులుఖర్జూరంబఠాణీలుసీజనల్‌ పండ్లు వారి డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు కాల్షియం లోపం దూరం చేసుకోవడానికి .. పాలు, పెరుగుచీజ్,  ఆకుకూరలు, చేపలుతృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.