ఈ ఐదు ఆసనాలతో సైనస్‌ సమస్యను బాయ్‌ చెప్పేయండి..!

Sinus సమస్యను తగ్గించుకోవడానికి మందులు వేసుకోవడం, ఆయుర్వేద చిట్కాలు పాటించడం ఒక పద్ధతి.. యోగా ద్వారా కూడా మీరు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

ఈ ఐదు ఆసనాలతో సైనస్‌ సమస్యను బాయ్‌ చెప్పేయండి..!
Yoga for sinus


Sinus సమస్యను తగ్గించుకోవడానికి మందులు వేసుకోవడం, ఆయుర్వేద చిట్కాలు పాటించడం ఒక పద్ధతి.. యోగా ద్వారా కూడా మీరు ఈ సమస్యను తగ్గించుకోవచ్చు. యోగాతో ఎన్నో రకాల సమస్యలను నయం చేసుకోవచ్చు. యోగాలో ఉన్న ఈ 5 ఆస‌నాల‌ను వేయ‌డం వ‌ల్ల ఆ రెండు స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ ఆస‌నాలు ఏమిటంటే..

పాద‌హ‌స్తాస‌నం

నిటారుగా నిల‌బ‌డి కింద‌కు వంగి చేతుల‌తో పాదాల‌ను తాకాలి. ఆరంభంలో క‌ష్టంగా ఉంటే మోకాళ్ల‌ను కొద్దిగా వంచ‌వ‌చ్చు. ఇలా 30 సెక‌న్ల పాటు ఉండాలి. మ‌ళ్లీ లేచి నిల‌బ‌డాలి. ఈ విధంగా 3 సార్లు చేయాలి.

వ‌జ్రాస‌నం

నేల‌పై నిటారుగా కూర్చుని మోకాళ్ల‌ను వంచి వెన‌క్కి తేవాలి. వెన్నెముక‌ను నిటారుగా ఉంచాలి. అర‌చేతుల‌ను మోకాళ్ల‌పై ఉంచాలి. ఈ భంగిమ‌లో 30 సెక‌న్ల పాటు ఉండాలి. ఇలా 3 సార్లు చేయాలి.

సుప్త వ‌జ్రాస‌నం

ఇది వ‌జ్రాస‌నంలో ఒక భాగ‌మే కాక‌పోతే నిటారుగా ఉన్న‌వారు అలాగే వెన‌క్కి వెల్లకిలా ప‌డుకోవాలి. అర‌చేతుల‌ను మోకాళ్ల మీద నుంచి తీసి పాదాల ప‌క్కన పెట్టాలి. ఇలా కూడా 30 సెక‌న్ల పాటు ఉండాలి. దీన్ని కూడా 3 సార్లు చేయాలి.

స‌ర్వాంగాస‌నం

దీన్ని ఆరంభంలో కొంద‌రు చేసేందుకు క‌ష్ట‌మ‌వుతుంది. కానీ సాధ‌న చేస్తే దీన్ని వేయ‌డం సుల‌భ‌మే. ఈ ఆస‌నంలో త‌ల‌ను కింద‌కు కాళ్ల‌ను పైకి పెట్టాలి. న‌డుముకు అర‌చేతుల‌ను పెట్టి స‌పోర్ట్‌ను ఇవ్వాలి. ఇలా 30 సెక‌న్ల పాటు ఉండేందుకు ప్ర‌య‌త్నించాలి. 3 సార్లు చేయాలి.

స‌విత్రి ఆస‌నం

మోకాళ్ల మీద కూర్చుని వెన్నెముక‌ను నిటారుగా ఉంచి త‌ల‌ను కొద్దిగా పైకెత్తాలి. చేతుల‌ను పైకి లేపి నిటారుగా ఉంచాలి. ఇలా 30 సెక‌న్ల పాటు ఉండాలి. 3 సార్లు చేయాలి.

ఈ ఆసనాలకు రోజూ వేయడం వల్ల.. సైనస్‌ సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.. ఒక్క సైనస్‌ ఏంటి ఈ ఆసనాల వల్ల బాడీకి రక్తప్రసరణ బాగా జరిగి..తలనొప్పి కూడా తగ్గుతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.